Privilege Notice: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార - ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. మరోసారి ఆ డైలాగ్స్ వారు అసెంబ్లీ వేదిక అయ్యింది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి (Deputy CM Narayanaswamy) చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఫైర్ అవుతోంది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్సీ (TDP MLC)లు డిప్యూటీ సీఎంపై మండలి చైర్మన్‌కు ప్రివిలేజ్ నోటీసిచ్చారు. నారా లోకేశ్‌ను నారాయణస్వామి అసెంబ్లీలో దూషించారని టీడీపీ నేతలు ఆరోపించారు. మండలి నియమావళి రూల్ 173 ప్రకారం చైర్మన్‌ను ప్రివిలేజ్ నోటీసిచ్చారు. నిబంధనలకు తిలోదకాలిచ్చారని నోటీసులో ఆరోపించారు ప్రతిపక్ష ఎమ్మెల్సీలు. తమ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే తాను లోకేష్ ని ఉద్దేశించి ఎలాంటి అనుచిత కామెంట్లు చేయలేదని వివరణ ఇచ్చారు నారాయణస్వామి. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి తనతో మాట్లాడారు. ఆ వ్యక్తిని ఉద్దేశించి తాను చేసిన కామెంట్లని తనను ఉద్దేశించినట్టుగా లోకేష్ భావిస్తున్నారని వివణ ఇచ్చారు.
సభలో అలాంటి కామెంట్లు చేయకూడదని.. ఈ విషయంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానంటూ పేర్కొన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. తనను ఏ స్థాయిలో రెచ్చగొడితే అలా మాట్లాడానో గమనించాలని కోరారు. బడుగులకు న్యాయం చేస్తోన్న ప్రభుత్వాన్ని కూలగొడతామంటే కోపం రాదా..? అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ను వాడూ వీడూ అని ఇష్టానుసారంగా లోకేష్ మాట్లాడుతున్నారన్నారు. మద్యం నిషేధం.. మద్య నియంత్రణ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. యనమల వియ్యంకుడుకు.. అయ్యన్నపాత్రుడు వంటి వారు మద్యం డిస్టలరీలు నడుపుతున్నారని పేర్కొన్నారు. ఇటీవలే అయ్యన్నపాత్రుడు తన డిస్టలరీలను అమ్ముకున్నారంటూ విమర్శించారు. ఎస్సీలను చులకనగా చూసేది చంద్రబాబేని ఆయన విమర్శించారు.
ఇదీ చదవండి : ఎంపీపై పరువు నష్టం దావా..! ఆయన తీరుపై ఏపీ సర్కార్ సీరియస్.. యాక్షన్ ప్లాన్ రెడీ
మైనార్టీ సభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే లోకేష్ అడ్డుకునే ప్రయత్నం చేశారని.. చంద్రబాబు, లోకేష్ వంటి వారు అబద్దాల్లో పెరిగి.. అబద్దాలతోనే రాజకీయాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఔరంగజేబు కోవకు చెందిన వారంటూ విమర్శించారు. చంద్రబాబు ఏనాడైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా..? అంటూ నారాయణ స్వామి నిలదీశారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్లకూ సంక్షేమ పథకాల లబ్ధి జరుగుతోందని.. జగన్ ఎవ్వరికీ వ్యతిరేకం కాదని ప్రకటించారు. జగన్ పరిపాలన రామరాజ్యాన్ని తలపిస్తోందంటూ నారాయణస్వామి పేర్కొన్నారు. ఖరీదైన మద్యాన్ని 10-15 ఏళ్లపాటు తాగితే.. శరీరంలో ఆల్కహాల్ ఉంటుంది. తాగుడుకు అలవాటు పడిన వాళ్ల ఆరోగ్యం సరిగా ఉండదన్నారు నారాయణ స్వామి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, AP News, Nara Lokesh, TDP