AP POLITICS TOMORROW WILL COME FINAL NOTIFICATION FOR AP NEWS DISTRICTS CM JAGAN ALLREADY TAKE DECISION NGS GNT
AP New Districts: తుది దశకు చేరిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ.. రేపే తుది నోటిఫికేషన్..
ప్రతీకాత్మక చిత్రం
AP New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఫైనల్ అయ్యింది. ఇవాళో.. రేపో కొత్త జిల్లాలకు సంబంధించి తుది నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. అచితే తాజాగా మరో ఐదు రెవిన్యూ డివిజన్లు పెంచినట్టు తెలుస్తోంది. ఏర్పిల్ రెండో తేదీ నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
AP New Districts: ఆంధ్రప్రదేశ్ (Andra Pradesh) లో కొత్త జిల్లాల (New District) ఏర్పాటు తుది దశకు చేరుకుంది. ఈ విషయంలో విపక్షాల విమర్శలు.. అభ్యంతరాలు సంగతి ఎలా ఉన్నా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) దూకుడుగానే ముందుకు వెళ్లారు. ముందునుంచి ఆయన చెబుతున్నట్టుగానే.. ఉగాది (Ugadi) నాటికి ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసేస్తున్నారు. రేపు ఏపీలో కొత్త జిల్లాలపై ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం విధించిన గడువు లోపు 11 వేలకుపైగా అభ్యంతరాలు వచ్చినట్టు సమాచారం. తాజాగా వచ్చిన అభ్యంతరాల పరిశీలన తరువాత.. కేవలం డివిజన్ల పెంపు మినాహా ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు అని సమాచారం. దీనిపై ఇప్పటికే సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకున్నారని.. అదే తుది నోటిఫికేషన్ లో ఉంటుదని తెలుస్తోంది.
న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చేపడుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి చేరిన సుమారు 10-11 వేల వినతులు, అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో స్వల్ప మార్పులు మినహా పెద్దగా మార్పులు చేర్పులకు అవకాశం వుండదని తెలుస్తోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషనుకు.. తుది నోటిఫికేషనుకు పెద్దగా మార్పులు చేర్పులు ఉండవని అధికారులు చెబుతున్న మాట. ముఖ్యంగా బాలాజీ జిల్లా పేరు పెట్టాలన్న ప్రతిపాదనపై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. బాలాజీ జిల్లాగా కాకుండా కొత్త జిల్లాను తిరుపతి (Tirupati) పేరుతోనే ఏర్పాటు చేస్తూ నోటిఫికేషనులో సవరణ చేసే అవకాశం కనిపిస్తోంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో చెప్పిన 11 రెవెన్యూ డివిజన్లకు అదనంగా మరో ఐదు డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం వుంది. ఇప్పటికే కొత్త జిల్లాల వారీగా కేడర్ ఎలాట్మెంట్ పూర్తయింది. కొత్త కలెక్టరేట్లల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఆయా జిల్లాల యంత్రాంగం ఫోకస్ పెట్టింది. ఇదీ చదవండి : రోజాకు అధినేత ఇచ్చిన ఆదేశాలేంటీ? అందుకే ఆమె ఆ పని చేసిందా?
జిల్లా కేంద్రాల్లో కూడా ఎలాంటి మార్పు లేదని తెలిసింది. రెవెన్యూ డివిజన్లపై పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. దీంతో గతంలో ప్రకటించిన 11 కాకుండా మరో 4 కొత్త డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కొత్త ఆఫీస్ల ఎంపిక, ఏర్పాటు కూడా పూర్తయింది. సాధ్యమైనంత వరకు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేనిచోట్ల అద్దె భవనాల్లో తాత్కాలిక ఆఫీస్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగుల పంపిణీ కూడా దాదాపు పూర్తయింది. నేడు సీఎం జగన్ కొత్త జిల్లాలపై తుది సమావేశం జరపనున్నట్టు సమాచారం. ఈ సమావేశం తర్వాత ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుందని తెలుస్తోంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.