Home /News /andhra-pradesh /

AP POLITICS TOMORROW TDP CHIEF CHANDRABABU NAIDU VISAKHA DISTRICT TOUR THIS IS THE FINAL SCHEDULE NGS VSP

Chandrababu: నేడు విశాఖకు చంద్రబాబు.. అనకాపల్లి జిల్లాలో రెండు రోజుల టూర్.. టార్గెట్ అదేనా..?

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు జనం బాట పడుతున్నాయి. నియోజకవర్గాల వారిగా గెలుపు ఓటములు.. పడే ఓట్లపై లెక్కలు వేసుకుంటున్నాయి. అసమ్మతి నేతలను బుజ్జగించో.. బెదిరించో దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా చంద్రబాబు నేడు విశాఖలో పర్యటిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ముందస్తు రాజకీయ రచ్చ రచ్చ అవుతోంది. అన్ని పార్టీ ప్రస్తుతం ఎన్నికల మూడ్ లోనే ఉన్నాయి.. షెడ్యూల్ కు కనీసం ఏడాది ముందే ఎన్నికలు ఉంటాయని విపక్షాలు అంచనా వేస్తున్నాయి. అధికార పార్టీ వ్యూహాలు చూస్తే.. ముందస్తు తప్పదనే సంకేతాలే అందుతున్నాయి. అందుకే అన్ని పార్టీలు ప్రస్తుతం జనం బాట పడుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సైతం.. త్వరలో సుదీర్ఘంగా బస్సు యాత్రకు సిద్ధమయ్యారు.. మొత్తం 26 జిల్లాలను ఆయన కవర్ చేయనున్నారు. అంతకముందే అయన నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్థితులుపై లెక్కలు వేసుకుంటున్నారు. వర్గ పోరు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు. కేడర్ ను ఉత్సాహ పరిచే ప్రయత్నాలు ముమ్మరంగానే చేస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి అనకాపల్లి జిల్లా (Anakapalli District) లో ఆయన పర్యటించనున్నారు. మొదట విశాఖ చేరుకుని.. తరువాత పూర్తిగా రెండు రోజులు అనకాపల్లి జిల్లాలో పార్టీపై పూర్తిగా ఫోకస్ చేయనున్నారు.

    విశాఖ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఇవాళ సాయంత్రం అనకాపల్లి జిల్లా చోడవరంలో జరగనున్న జిల్లాస్థాయి మినీ మహానాడు (Mini Mahanadu) కు హాజరవుతారు. 16వ తేదీన అనకాపల్లిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు.  మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి 1.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.





    రెండు గంటలకు ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.30 గంటలకు చోడవరం వెళతారు. శివాలయం గుడి వద్ద ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనుల కోసం గతంలో సీఎం హోదాలో తాను ఆవిష్కరించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని సందర్శిస్తారు. తరువాత మినీమహానాడు సభా వేదిక దగ్గరకు చేరుకుంటారు. సభలో ప్రసంగించిన తరువాత ఏడు గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 7.45 గంటలకు అనకాపల్లి చేరుకుంటారు. రాత్రికి చంద్రశేఖర కల్యాణ మండలంలో బస చేస్తారు.

    ఇదీ చదవండి : వానరాలనే భయపెట్టే ఐడియా.. ఆ రైతు ఏం చేశాడో చూడండి..

    అలాగే గురువారం ఉదయం 10.30 గంటలకు ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డు రోడ్డులో నూతనంగా నిర్మించిన టీడీపీ అనకాపల్లి పార్లమెంటరీ కార్యాలయానికి చేరుకొని ప్రారంభిస్తారు. 11 గంటలకు తిరిగి చంద్రశేఖర కల్యాణ మండపానికి చేరుకుంటారు. 11.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అసెంబ్లీ నియోజవర్గాల వారీగా ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులతో సమీక్షలు నిర్వహిస్తారు. తరువాత రోడ్డు మార్గంలో బయలుదేరి గాజువాక, ఎన్‌ఏడీ జంక్షన్‌ మీదుగా విజయనగరం వెళతారు. అయితే ఆయన పర్యటన ప్రధాన టార్గెట్ కేడర్ లో ఉత్సాహం నింపడంతో పాటు.. పార్టీలో కొత్తగా చేరికలు.. ప్రస్తుతం అక్కడక్కడ ఉన్న వర్గ పోరు ఇబ్బంది లేకుండా చేయడం అనే లక్ష్యాలతోనే ఈ పర్యటనకు వస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో టీడీపీ ఉండి.. కొన్ని కారణాలతో వైసీపీ చేరిన నాయకుల చేరికపై ఫోకస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu Naidu, TDP, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు