YCP Exams: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరీక్షల కాలం నడుస్తోంది. అయితే ఈ పరీక్షలు కేవలం విద్యార్థులకే కాదు.. అధికార పార్టీలు ఎమ్మెల్యేలు కూడా పరీక్షలకు సిద్ధమయ్యారు.. వారి పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి.. ఆ పరీక్షల్లో ఎవరైనా తమరిపోర్ట్ కార్డును పెంచుకుంటారో? వారికే సీట్లు ఉంటాయని అధినేత ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు కూడా.. దీంతో అందరిలో టెన్షన్ మొదలైంది.
YCP Exams: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం పరీక్షల సీజన్.. ఇప్పటికే విద్యార్థులు పరీక్షల పేపర్లతో కుస్తీ పడుతుంటే.. ఇప్పడు అధికార
పార్టీ ఎమ్మెల్యేలు కూడా పరీక్షలకు సిద్ధమయ్యారు. అంటే పేపర్ పెన్ను పట్టుకుని పరీక్షలు రాకపోయినా..? తమ ప్రోగ్రస్ రిపోర్ట్ (Progress Report) పెంచుకునే
పరీక్షల పెడుతున్నారు అధినేత, సీఎం జగన్ (CM Jagan).. ఈ నెల 11వ తేదీ నుంచి గడప గడపకు వైసీపీ (Gadapa Gadapaku YCP) పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇలా ప్రజల్లోకి వెళ్లిన తరువాత.. ఎవరైతే.. పార్టీ అధిష్టానం చేయించే సర్వేలో బలం పెంచుకుంటారో వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలాని ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఇటీవల పార్టీ మీటింగ్ లో అందరి ఎమ్మెల్యేలకు జగన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తన గ్రాఫ్ 65
శాతం ఉందని.. ఎమ్మెల్యే గ్రాఫ్ 45 శాతం మాత్రమే ఉందన్నారు.. కొంతమంది పరిస్థితి అస్సలు బాగులేదన్నారు. ఎవరైతే ప్రజల్లో తమ బలం నిరూపించుకుంటారో వారికే తిరిగి టిక్కెట్లు దక్కనున్నాయి. ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గడప గడపకు వైసీపీ పేరుతో జనం బాట పడుతున్నారు. ప్రతీ ఎమ్మెల్యే - ఇన్ఛార్జ్ లు తమ నియోజకవర్గంలోని ఒక్కో సచివాలయం పరిధిలో పర్యటించనున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు (Welfare Schemes) అందరికీ అందుతున్నాయా..? ఏమైనా లోటు పాట్లు ఉన్నాయా..? లబ్ధిదారులు అంతా? హ్యాపీగానే ఉన్నారా..? అంటూ పలు రకాల అంశాలపై ప్రజల నుంచే సమాధానాలు రాబెట్టనున్నారు. చిన్న చిన్న విషయాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత
ఉంటే.. సమస్యలు ఏంటో చెప్పాలని.. ఏడాది లోగా ఆ సమస్యలు తీరుస్తామంటూ హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతం సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో పాజిటివిటీ బాగనే ఉందని.. ఆ పాజిటివ్ ఓటు తమకు కలసి వస్తుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది.. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత ఉంది.. ఎందుకు ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్న అంశాలపై క్లారిటీ వస్తే.. వ్యతిరేక ఓటు కూడా విపక్షాలకు దక్కుకుండా చేయొచ్చన్నది అధినేత ప్లాన్.. అందుకే గడప గడపకు వైసీపీని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు సీఎం జగన్..
ఈ 35 నెలల కాలంలో ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా ఏకంగా 1,38,894 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అదే విధంగా ఇళ్ల పట్టాలు.. పథకాలు అందని అర్హులను ఎవరినైనా గుర్తిస్తే.. వారికి స్థానిక సచివాలయంలో నమోదు చేసుకొనే విధంగా చొరవ తీసుకోనున్నారు. ఎన్నికల మేనిఫెస్టో, మూడేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులకు
చేకూర్చిన ప్రయోజనాన్ని వివరిస్తూ సీఎం వైయస్ జగన్ రాసిన లేఖను ఆ కుటుంబానికి అందించి.. వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి అన్నాది
జనగ్ ఆలోచన..
ఏపీ వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గం పరిధిలో సుమారు 80 సచివాలయాలు ఉంటాయి. నెలలో 20 రోజులు గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం సాగుతుంది. అంటే.. ఈ కార్యక్రమం పూర్తవడానికి 8 నుంచి 9 నెలల సమయం పడుతుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ గడప గడపకు వైసీపీని విజయవంత చేసే బాధ్యతను ప్రాంతీయ సమన్వయకర్తల కో-ఆర్డినేటర్, విజయసాయిరెడ్డికి సీఎం అప్పగించారు. మరోవైపు ఈ కార్యక్రమం ముగిసేలోపే.. బూత్ కమిటీలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ కమిటీల్లో 50 శాతం మహిళలకు స్థానం కల్పించనున్నారు.
గతంలో తెప్పించుకున్న నివేదికల్లో ప్రభుత్వం సీఎం జగన్ పాలన పైన 65 శాతం మేర సానుకూలంగా ఉంటే.. ఎమ్మెల్యేల్లో దాదాపుగా 40- 45 మంది పైన వ్యతిరేకత కనిపిస్తోందని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగానే.. ఎమ్మెల్యేల పని తీరుకు గ్రేడింగ్ మూడు రకాలుగా ఖరారు చేసారు. ఈ రేటింగ్ ఆధారంగానే టిక్కెట్లు కేటాయిస్తానని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. తక్కువ రేటింగ్ ఉన్న వారు ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రజలతో మరింతగా మమేకమై వారి రేటింగ్ పెంచుకొనేందుకు.. ఈ కార్యక్రమం ఉపయోగించుకోవాలన్నది జగన్
ఉద్దేశం. అయినా రేటింగ్ పెరగని వారికి టిక్కెట్లు ఇచ్చి.. నష్టపోవటానికి పార్టీ సిద్దంగా లేదని.. వ్యక్తల కంటే పార్టీనే ముఖ్యమని సీఎం జగన్ స్పష్టంగా తేల్చి చెప్పారు. అందుకే ఈ గడప గడపకు కార్యక్రమం ప్రతి ఎమ్మెల్యేకు పరీక్ష లాంటిదే..
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.