హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: జనసేన పార్టీకి 8 ఏళ్లు.. పవన్ ప్రసంగంపై ఆసక్తి.. ఎన్నికల శంఖారావం పూరిస్తారా..?

Pawan Kalyan: జనసేన పార్టీకి 8 ఏళ్లు.. పవన్ ప్రసంగంపై ఆసక్తి.. ఎన్నికల శంఖారావం పూరిస్తారా..?

భీమ్లా నాయక్ Photo : Twitter

భీమ్లా నాయక్ Photo : Twitter

Jana Sena Formation Day:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమరశంఖం పూరించబోతున్నారా..? ఎన్నికల మేనిఫెస్టో కూడా ముందే ప్రకటిస్తారా..? 9వ ఆవిర్భావ సభ సందర్భంగా ఆయన ఏం చెబుతారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పొత్తులపై క్లారిటీ ఇస్తారా..? అసలు పవన్ వ్యూహం ఏంటి?

ఇంకా చదవండి ...

    Jana Sena Formation Day: సోమవారం జనసేన (Janasena) 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సిద్ధమయ్యారు జనసైనికులు.. గుంటూరు కేంద్రంగా జనసేనాని సమరశంఖం పూరించబోతున్నారా? అయితే ఇది కేవలం ఆవిర్భావసభ (Jana Sena Formation Day) మాత్రమే కాదని పవన్ చెప్పడంతో.. ఆ ప్రకటనకు కారణం ఏంటి..? పార్టీ వ్యూహం ఏంటి? ఇంతకీ పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రసంగం ఎలా ఉండబోతోంది..? రాష్ట్ర ప్రభుత్వం పై పోరాటంపై ఏం చెప్పబోతున్నారు..? వచ్చే ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్తుందన్నదానిపై క్లారిటీ ఇస్తారా..? పొత్తులపై క్లారిటీ ఇస్తారా..? పార్టీ శ్రేణులు, రాష్ట్ర పజలకు అధినేత ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఈ విషయాలు అందరిలో ఉత్కంఠ పెంచుతున్నాయి. అయితే ఇప్పటికే భీమ్లానాయక్‌ మూవీ (Bheemla Nayak) లోని సాంగ్‌ స్టైల్లో.. అదే ట్యూన్‌తో అవిర్భావ సభ కోసం సాంగ్ రిలీజ్ చేసింది పార్టీ. గుంటూరు జిల్లా (Gunturu District) తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామ సమీపంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ వేదికకు దామోదరం సంజీవయ్యగారి పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా పవన్ కీలక ప్రసంగం ఉంటుందని జనసైనం చెబుతోంది.

    ఇది కేవలం ఆవిర్భావ సభ మాత్రమే కాదన్నారు పవన్. తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం జరిగే సభ అని చెప్పారు. ప్రజల ఇబ్బందులపై గళమెత్తడంతోపాటు.. సభా వేదిక నుంచే భవిష్యత్‌ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తానని ప్రకటించారు. భవిష్యత్తు జెండాని మోయటంకంటే బాధ్యత ఏముంటుంది.? ఒకతరం కోసం యుద్ధం చేయటంకంటే సాహసం ఏముంటుంది అంటూ పార్టీ శ్రేణులకు సందేశమిచ్చారు పవన్. మొత్తానికి రేపు జరగబోయే సభ ఇతర ఆవిర్భావ సభలకు పూర్తి భిన్నంగా ఉండనుంది. ఈ విషయాన్ని స్వయంగా పవనే చెప్పడంతో.. ఆయన స్పీచ్ పై ఉత్కంఠ పెరుగుతోంది. ఎన్నికలకు టైమ్‌ దగ్గరపడుతున్న వేళ… ముందస్తు ముచ్చట్లు జోరుందుకున్న సమయంలో పవన్ ఎలాంటి అంశాలు మాట్లాడుతారు. ఏం ప్రకటించబోతున్నారు అన్నది ఆసక్తిగా మారింది.

    ఇదీ చదవండి : ఇలాంటి చేపను ఎప్పుడైనా చూశారా..? మనిషాలగే ఉండి మనిషి ప్రాణం తీస్తుంది

    అటు విజయవాడ(Vijayawada)లో జనసేనా ఫ్లెక్సీ వివాదం కలకలం రేపింది. జనసేన ఆవిర్భావ సభకోసం ప్రకాశం బ్యారేజ్‌ వారథిపై కట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలను మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు. సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌.. స్పాట్‌కి వెళ్లి సిబ్బందిని ప్రశ్నించారు. పోలీసులే ఇదంతా దగ్గరుండి చేయిస్తున్నారని వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ తీరుని నిరసిస్తూ జనసేన శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారంటూ నాదేండ్ల ఆరోపించారు. విషయం తెలుసుకొని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పార్టీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు

    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan

    ఉత్తమ కథలు