Home /News /andhra-pradesh /

AP POLITICS TOMORROW CM JAGAN MOHAN REDDY KUPPAM TOUR THIS IS THE MAIN REASON NGS

CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. చంద్రబాబుకు ఆహ్వానం..! ఆపరేషన్ 175కి రేపు తొలి అడుగు

రేపు సీఎం జగన్ కుప్పం పర్యటన

రేపు సీఎం జగన్ కుప్పం పర్యటన

CM Jagan: టార్గెట్ 175 అంటున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. అందులో భాగంగా రేపు తొలి అడుగు వేస్తున్నారు. ప్రతిపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kuppam, India
  CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)  సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. వచ్చే ఎన్నికల్లో 175 ఎందుకు నెగ్గలేం అంటూ.. పదే పదే పార్టీ నేతలను ప్రశ్నిస్తున్నారు. ప్రతి సమావేశాంలో మన టార్గెట్ 175 అనే చెబుతున్నారు.  అది జరగాలి అంటే ముందు.. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సొంత నియోజకవర్గం కుప్పం (Kuppam) లో మొదట గెలవాలి.. అది నెగ్గితే.. మిగిలిన నియోజకవర్గాల్లో నెగ్గడం కష్టం కాదన్నది వైసీపీ (YCP) లెక్క.. అందుకే కుప్పంపై ఎక్కువగా జగన్ ఫోకస్ చేస్తున్నారు. అందుకే అడగకుండానే కుప్పానికి వరాలు జల్లు కురిపిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గాల రివ్యూలు చేపట్టిన జగన్.. కుప్పం నుంచే ఆ కార్యక్రమం ప్రారంభించారు.. అంతేకాదు కుప్పంలో చంద్రబాబు ను ఓడిస్తే.. మంత్రి పదవి గిఫ్ట్ గా ఇస్తాను అంటూ బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కుప్పంపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్న జగన్.. ఇప్పుడు నేరుగా కుప్పం కోటను ఢీ కొట్టేందుకు రెడీ అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సారి జగన్ కుప్పం పర్యటనకు వెళ్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో అనూహ్యంగా వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. వచ్చే ఎన్నికలకు సంబంధించి కుప్పం అభ్యర్ధిగా ఎమ్మెల్సీ భరత్ ను సీఎం ఖరారు చేసారు. భరత్ ను గెలిపిస్తే వచ్చే ప్రభుత్వంలో మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. సీఎంగా ఇదే నియోజకవర్గం నుంచి చంద్రబాబు 14 ఏళ్లు పని చేసినా కుప్పం రెవిన్యూ డివిజన్ చేయలేకపోయారంటూ పలు సందర్భాల్లో సీఎం ఎద్దేవా చేసారు. అలాగే కుప్పం కోసం భారీగా నిధులు కూడా విడుదల చేశారు.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే చంద్రబాబు సొంత గడ్డపై నుంచే.. వైయ‌స్ఆర్ చేయూత పథకం మూడో విడత నిధుల విడుదల చేయనున్నారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు ఈ నిధులను జమ చేయనున్నారు. అలాగే ఈ వైఎస్సార్ చేయూతతో పాటు.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభలోనూ పాల్గొంటారు. ఇదీ చదవండి : ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటున్నారా..? 5 వేలు నుంచి మొదలు.. ఆ నెంబర్ మాత్రం 2 లక్షలు అలాగే రేపు అంటే 23వ తేదీనే ఆయన కుప్పం వెళ్లడం వెనుక వేరే కథ కూడా ఉందంటూ వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను.. ముగ్గురు ఎంపీలను టీడీపీ తన పార్టీలోకి ఫిరాయించేలా ప్రోత్సహించింది. ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఫలితాలు మే 23న వెల్లడయ్యాయి. ఆ ఫలితాల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. కాగా, ప్రతిపక్ష టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలే గెలిచారు. ఆ వెంటనే దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే.. 23 మంది ఎమ్మెల్యేలను కొంటే.. 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారు అంటూ సమయం వచ్చినప్పుడల్లా సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను గుర్తు చేస్తూ.. రేపు కుప్పంలో పర్యటిస్తున్నారనే ప్రచారం ఉంది. ఇదీ చదవండి: కొడాలి నానికి లైన్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. మరి మాజీ మంత్రి స్పందిస్తారా..? చంద్రబాబుకు ఆహ్వానం.. మరోవైపు కుప్పం పర్యటనలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమంలో కుప్పంలో పాల్గొంటున్న వేళ..ప్రోటోకాల్ ప్రకారం స్థానికంగా ఎమ్మెల్యే అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు సమాచారం ఇచ్చినట్లు స్థానిక అధికారుల నుంచి తెలుస్తోంది. మరి ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందినా.. చంద్రబాబు హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇదీ చదవండి : ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రుల శొభ.. ఏ రోజు ఏ అవతారం.. అమ్మవారికి ఇష్టమైన రంగులు ఇవే.. ఫలితాలు ఏంటి? సీఎం జగన్‌ పర్యటన షెడ్యూల్‌.. ఉదయం 9.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కుప్పం బయలుదేరతారు. 10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. 11.15–12.45 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొంటారు తరువాత వైఎస్సార్‌ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. 1.20 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Chandrababu Naidu, Kuppam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు