CM Jagan : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) విశాఖ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచుతోంది. ప్రధాని మోదీ (Prime Minster Modi) తో పాటు సీఎం ఈ పర్యటనలో పాల్గొననున్నారు. ప్రధాని సమక్షంలో జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తెస్తారా.. తెస్తే మోదీ దానిపై స్పందిస్తారా.. మూడు రాజధానులు (Three Capitals) అంశంపై మోదీ మనసులో ఏంటీ ఈ పర్యటనలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం రెండు రోజుల పాటు సీఎం విశాఖలోనే ఉండనున్నారు. 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటిస్తారు. ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో సీఎం ఆయనతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం 5.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరుతారు. 6. 15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. రాత్రి విశాఖలోనే ఆయన బస చేయనున్నారు. రాత్రి పార్టీ కీలక నేతలతో సీఎం ప్రధానంగా సమావేశం అయ్యే అవకాశాలుఉన్నాయి.
శనివారం ఉదయం 10.05 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్లోని హెలీప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. 10.20 గంటలకు ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలుకుతారు. 10.30 నుంచి 11.45 గంటల వరకు ప్రధానితో కలిసి పలు శంకుస్థాపనలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. 12.45 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి మధ్యాహ్నం 2.00 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
మరోవైపు 11వ తేదీనే ప్రధాని ఏపీకి చేరుకోనున్నారు. మదురై నుంచి నేరుగా విశాఖపట్నంకు సాయంత్రం 6:30 గంటలకు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తూర్పు నౌకాదళం చేరుకుంటారు. ఆయన కూడా రాత్రి విశాఖలోనే బస చేయనున్నారు. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు ఆంధ్రా విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తరువాత 10, 472 కోట్ల రూపాయల విలువైన 5 ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, రెండు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయనున్నారు.
ఇదీ చదవండి : తిరుమల లడ్డు బరువు తగ్గుతోందా..? యువకుడి పోస్ట్ వైరల్.. టీటీడీ ఏమందంటే..?
అలాగే ప్రధాని తెలంగాణ షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. 12న ఏపీలోని విశాఖపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని రామగుండానికి ప్రధాని చేరుకుంటారు. ఆ తరువాత 3.30 గంటలకు రామగుండం ఎరువులు, రసాయనాల పరిశ్రమను ప్రారంభిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మించిన భద్రాచలం రోడ్డు-సత్తుపల్లి రైల్వే లైనును జాతికి అంకితం చేస్తారు. తరువాత ప్రధాని మోదీ బహిరంగ సభలో మాట్లాడుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Visakhapatnam