Home /News /andhra-pradesh /

AP POLITICS TOLLYWOOD SENIOR ACTOR MANCHU MOHAN BABU SENSATIONAL COMMENT ON ANDHRA PRADESH GOVERNMENT NGS

Mohan Babu: వైసీపీ వాడుకొని వదిలేసిందా.. మంచు ఫ్యామిలీకి-సీఎం జగన్ కు మధ్య గ్యాప్ కు కారణం అదేనా..?

వాడుకుని వదిలేశారు అంటూ మోహన్ బాబు ఆవేదన

వాడుకుని వదిలేశారు అంటూ మోహన్ బాబు ఆవేదన

Mohan Babu: ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ పై పొగడ్తల వర్షం కురిపించిన మంచు ఫ్యామిలీ.. ఇప్పుడు ఆ పార్టీకి దూరం అయ్యిందా.. మంచు ఇమేజ్ ను వైసీపీ వాడుకుని వదిలేసిందా..? ఈ రెండు కుటుంబాలకు మధ్య నిజంగానే గ్యాప్ ఉందా..? తాజాగా మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలకు అర్థం ఏంటి..?

ఇంకా చదవండి ...
  Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని (YCP Governenment) టార్గెట్ చేసే విమర్శలు చేశారా..? అసలు మొన్నటి వరకు మనం మనం అనుకునేలా ఉన్న వైఎస్-మంచు ఫ్యామిలీ మధ్య గ్యాప్ ఏర్పడింది. అసలు ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ కు కారణం ఏంది.. మొన్నటికి మొన్న మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల వరకు రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉండేది. అంతెందుకు మంచు విష్ణు (Manchu Vishnu) మా అధ్యక్షుడిగా గెలిచాడు.. అంటే అందులో వైసీపీ (YCP) హ్యాండ్ కూడా కొంత ఉంది అన్నది టాలీవుడ్ (Tollywood) సమాచారం.. ఆ ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తో సంబంధాలు కొంత వరకు మంచు విష్ణుకు ఉపయోగపడింది అన్నది బహిరంగ రహస్యమే.. ప్రత్యర్థి పార్టీలు సైతం.. మంచు విష్ణుకు ఏపీ ప్రభుత్వం సహకారం చేసిందని ఆరోపణలు కూడా చేశారు. ఇలా రెండు కుటుంబాల మధ్య మొన్నటి వరకు సత్సంబంధాలు ఉన్నా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి-ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం నెలకొన్న సమయంలోనూ.. మంచు విష్ణు ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడారు.. మోహన్ బాబు త్వరలోనే దీనిపై సీఎంను కలుస్తారంటూ విష్ణు చెప్పారు కూడా.. కానీ వాస్తవంగా చూస్తే.. సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం విషయంలో క్రెడిట్ అంతా చిరంజీవి (Chiranjeevi)కే దక్కింది. ఆయన చొరవ వల్లే వివాదం ముగిసిందని.. ఇటు సినీ పరిశ్రమ.. అటు ప్రభుత్వం బహిరంగంగానే ప్రకటించాయి.. ఈ సమావేశానికి మంచు కుటుంబం నుంచి ఎవరూ వెళ్లలేదు అన్నారు. తనకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం ఉన్నా.. కొందరు తమకు ఆహ్వానం అందకుండా చేశారంటూ మంచు ఫ్యామిలీ సరికొత్త వివాదానికి తెరలేపింది. తాజాగా మోహన్ బాబు (Mohan Babu) సైతం ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

  తనను రాజకీయంగా వాడుకొని వదిలేసారంటూ వాపోయారు. తాను ఎంతో మందికి ఉపయోగపడ్డానని చెప్పారు. తనతో ఎన్నికల ప్రచారం చేయించుకున్నారని, కానీ, తనకు ఏమీ చేయలేదంటూ ఆవేదన వ్యక్ం చేశారు. ఎన్నో రకాలుగా మోసానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసారు. తన జన్మదినం సందర్భంగా మోహన్ బాబు తిరుపతి సమీపంలోని శ్రీవిద్యానికేతన్ సంస్థల ఆవరణ లో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆ సమయంలో మోహన్ బాబు తన మనసులోని ఆవేదనను బయట పెట్టారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీని ఉద్దేసించే అనే ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం 2019 ఎన్నికల ముందు అప్పటికే వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఉన్న మోహన్ బాబు అధికారికంగా వైసీపీలో చేరారు. ఎన్నికల సమయంలో పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ వైసీపీ అభ్యర్ధి ఆర్కే కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.

  ఇదీ చదవండి : తాడేపల్లికి చేరిన గన్నవరం పాలిటిక్స్.. ఆయనకు టికెట్ ఇవ్వొద్దు అంటూ విజయసాయి రెడ్డికి లేఖలు

  వైసీపీ అధికారంలోకి వస్తే మోహన్ బాబుకు ఖచ్చితంగా నామినేటెట్ పదవి దక్కుతుందని పార్టీలో ప్రచారం సాగింది. ఫిల్మ్ కార్పోరేషన్ ఛైర్మన్ లేదా టీడీపీ బోర్డు ఛైర్మన్ పదవుల్లో ఒకటి దక్కుతుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ, ఏ పదవి దక్కలేదు. ఇదే విషయం పైన మోహన్ బాబు పలు మార్లు స్పందించారు. తాను జగన్ ను సీఎంగా చూడాలనే కోరికతోనే ఎన్నికల్లో మద్దతుగా ప్రచారం చేసానని..తాను పదవులు ఆశించి కాదని చెప్పుకొచ్చారు. కానీ కొన్ని రోజుల తరువాత మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలసి ప్రధాని మోదీదిని సడెన్ గా కలిసారు. ఆ సమయంలో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగింది. అప్పటి నుంచి సీఎం జగన్ తో మోహన్ బాబు ప్రత్యక్షంగా కలిసిన సందర్భాలు లేవు.

  ఇదీ చదవండి : : ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. గ్యాస్ బుక్ చేసుకోండి.. లక్కీ ఛాన్స్ మీదే

  ఇటీవల తన సినిమా సన్ ఆఫ్ ఇండియా విడుదల సందర్భండా కూడా తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ మోహన్ బాబు ప్రకటించారు. కొద్ది కాలం క్రితం తమ విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల విషయంలోనూ మోహన్ బాబు స్పందించారు. సీఎం జగన్ పక్కన ఉండే అధికారులు ఆయన్ను తప్పు దోవ పట్టిస్తున్నారనేది తన అభిప్రాయం అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాజాగా తనను వాడుకుని వదిలేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఆలీకి జగన్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కనుందనే ప్రచారం సాగుతోంది. ఇలా అందరికీ పదవులు ఇస్తున్న జగన్ మంచు ఫ్యామిలీని పట్టించుకోవడం లేదనే ఆవేదన వారి అభిమానుల్లో ఉంది. తాజాగా మోహన్ బాబు వ్యాఖ్యలు అదే కారణమని ప్రచారం జరుగుతోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Manchu mohan babu, Tirupati

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు