Home /News /andhra-pradesh /

AP POLITICS TOLLYWOOD HERO NTR WHO SAYS HE WILL NOT ENTER POLITICS SNR

NTR POLITICS:యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల్లోకి రాను అన్నది అందుకా..

(తారకమంత్రం)

(తారకమంత్రం)

NTR POLITICS:యంగ్‌ టైగర్ సినిమాలే చేస్తారట. రాజకీయాల్లోకి రానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఫ్యూచర్‌పై తనకు నమ్మకం లేదని చెప్పడం చూస్తుంటే ఖచ్చితంగా వస్తానని చెప్పకనే చెప్పినట్లుగా ఉంది. అయితే అదంతా ఇప్పుడు కాకుండా..హ్యాపీగా తనకున్న స్టార్‌డమ్‌తో వరుసగా సినిమాలు చేసుకుంటూ 7-8ఏళ్ల తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బెటర్‌ అనేది తారక్‌ మనసులో ఉన్న మాటగా బాలీవుడ్‌కి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
లెజెండ్ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్(NTR) పొలికలు, నట వారసత్వం, వాక్చాతుర్యం పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్‌ పెద్దాయన మాదిరిగానే పాలిటిక్స్‌లోకి వస్తారా ? ప్రజల్లో ఆదరణ తగ్గుతున్న తెలుగుదేశం(Telugudesam) పార్టీని పైకి తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తారా ? నందమూరి వంశం నుంచి మూడో తరం రాజకీయ వారసుడిగా పాలిటిక్స్‌లోకి పూర్తిస్థాయిలో తారక్‌ తెరంగేట్రం చేసేది ఎప్పుడు ? ఇలాంటివి చాలా రోజులుగా తెలుగు ప్రజలల్లో నెలకొన్న సందేహాలు. అయితే ఇప్పుడు కాకపోతే కాస్త లేటైనా వస్తాడులేని అందరూ భావిస్తూ వచ్చారు. కాని ఈ యంగ్‌ టైగర్‌ మాత్రం సినిమాల్లోనే చాలా హ్యాపీగా ఉంది. సినిమాల్లోనే కంటిన్యూ అవుతానని చెప్పడం చూస్తుంటే తాను రాజకీయాల్లో(Politics)కి రాను అని పిచ్చ క్లారిటీగా కనిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ(TDP) ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్లో తారక్ టీడీపీలోకి వచ్చి యాక్టివ్ రోల్ పోషిస్తే బాగుంటుందనే ఆపార్టీకి చెందిన కొందరు అగ్రనేతల అభిప్రాయం. అధిష్టానం అభిప్రాయం కూడా అదే అయినప్పటికి స్వయంగా పిలిస్తే ఎన్టీఆర్ ఎక్కడ నిరాసక్తి చూపుతాడోననే భావన కూడా పార్టీ పెద్దల్లో ఉందట. అందుకే పార్టీకి విధేయులుగా..ఎన్టీఆర్‌కి అత్యంత సన్నిహితులుగా ఉన్నవ్యక్తులతో సంప్రదింపులు చేసినట్లుగా ఏపీ పొలిటికల్‌ సర్కిల్‌(Political Circle)లో వినిపిస్తున్న మాట. ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనే మాటతో టీడీపీకి చెందిన కొందరు పెద్దలు తారక్‌పై ఒత్తిడి తెచ్చినట్లుగా సమాచారం. గతంలో తన కట్టె కాలేవరకు టీడీపీలోనే ఉంటా.. అని స్టేట్‌మెంట్ (Statement)ఇచ్చిన ఎన్టీఆర్‌ మాటను పట్టుకొని పార్టీ పెద్దలంతా ఇలా ఫోర్స్ చేస్తుంటే..యంగ్‌ టైగర్ మాత్రం ప్రస్తుతం సినిమాల్లో తనకున్న క్రేజ్‌ని వదిలేసుకోవడం ఎందుకని భావిస్తున్నారట. అది కూడా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే టీడీపీలోకి వెళ్లి..స్టార్‌డమ్‌ని వదిలేసుకోవడం మంచిది కాదని భావించినట్లుగా సమాచారం. అందుకే బాలీవుడ్‌ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినిమాల్లోనే కంటిన్యూ అవుతాను..భవిష్యత్తు గురించి తాను పెద్దగా ఆలోచించనంటూ తన పొలిటికల్ఎంట్రీపై జరుగుతున్న చర్చకు తాత్కాలికంగా తెరదించారు.

పాలిటిక్స్ నో  ఛాన్స్..
రాబోయే ఎన్నికల వరకు సినిమాలు చేసుకుంటు పోవాలన్నది నందమూరి వారసుడి ఆలోచనగా కనిపిస్తుంది. 2024ఎన్నికల్లో కూడా సైలెంట్‌గా ఉండి..ఆ తర్వాత మరో ఐదేళ్లు అంటే దాదాపు 7-8ఏళ్ల పాటు సినిమాలు చేస్తూ ఆ తర్వాత పొలిటికల్ స్టెప్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అని ఎన్టీఆర్‌ ఫీలింగ్‌గా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ చేతిలో టీడీపీ ఒకసారి ఓడిపోయింది. రాబోయే ఎన్నికల్లో కూడా స్వల్ప మెజారిటీతోనైనా వైసీపీనే అధికారం చేపడుతుందనే పాజిటివ్ టాక్‌ జనంలో బలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో చేరినప్పటికి తన వల్ల ప్రయోజనం ఉండదనే ఆలోచన తారక్‌లో ఉన్నట్లుగా ఆయన మాటలు చూస్తే అర్ధమవుతుంది.

ఫ్యూచర్‌లో చెప్పలేం ..
అందుకే ఈ రెండేళ్లు ..ఆ తర్వాత ఐదేళ్లు పూర్తిస్థాయిలో హీరోగానే ప్రజల అభిమానాన్ని చురగొని ఆ తర్వాత రాజకీయాల్లోకి దిగితే ఫలితం మరోలా ఉంటుందని ఎన్టీఆర్‌ ప్లాన్‌గా ఆయన సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అప్పుడైతే తాతయ్య మాదిరిగానే ఏదో రకంగా తెలుగువారి ఆత్మాభిమానం, తెలుగు ప్రజల గుండె చప్పుడు, వైసీపీ పాలనలో దగా పడ్డ తెలుగువాళ్లనే పంచ్‌ డైలాగులతో పొలిటికల్ లైఫ్‌ని బిగెన్ చేసే అవకాశం లేకపోలేదు. అందుకే పాలిటిక్స్‌లోకి రమ్మని ఆహ్వనించే ప్రమోషన్‌ చూసి..ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పొజిషన్‌ని చేజార్చుకోవడం సరికాదనే గట్టిగా నమ్ముతున్నట్లు ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఇంటర్వూకి ఇచ్చిన మాటల పరమార్ధంగా కనిపిస్తోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: AP Politics, NTR, TDP, Tollywood actor

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు