Home /News /andhra-pradesh /

AP POLITICS TO DAY ON WARDS YCP MLAS AND OFFICIAL WILL REACH DIRECT PEOPLE OVERALL ANDHRA PRADESH NGS

YCP Leaders: వానల్లోనే గడప గడపకూ ప్రభుత్వం.. చివరి నిమిషంలో మారిన పేరు.. తొలి రోజే అడ్డుపడుతున్న తుఫాను

వైసీపీ ఎమ్మెల్యేలకు పరీక్ష

వైసీపీ ఎమ్మెల్యేలకు పరీక్ష

YCP Leaders: ఏపీలో తుఫాను కారణంగా నేటి ఇంటర్ పరీక్షలు రద్దైతే.. వైసీపీ ఎమ్మెల్యేలు, అధికారులకు నేటి నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. తొలిరోజే వాన గండం ఉండడంతో ఈ అడ్డంకి అధిగమించేది ఎలా అని మదన పడుతున్నారు. అయితే ప్రభుత్వం నేరుగా ఉత్తర్వులు ఇవ్వడంతో.. ప్రజల్లోకి వెళ్లక తప్పడం లేదు.. మరి వర్షం కారణంగా తొలిరాజు గడపగడపకు వాయిదా వేస్తారా.. సీఎం ఆదేశాలతో తొలిరోజు కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారో చూడలి.

ఇంకా చదవండి ...
  YCP Leaders:  వైసీపీ ఎమ్మెల్యేల (YCP Mlas)కు నేటి నుంచి పరీక్ష ప్రారంభం కానుంది.. పార్టీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి వైసీపీ ఎమ్మెల్యేలంతా ప్రజల మధ్యనే ఉండాలి.. అయితే ఈ కార్యక్రమానికి గడపగడపకు వైసీపీ అని తొలుత డిసైడ్ చేసారు. కానీ, లాస్ట్ మినిట్ లో గడప గడపకు ప్రభుత్వంగా పేరు మార్చారు. అంతేకాదు కొత్త మార్గదర్శకాలతో ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కోసం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి కావటంతో..ఇక, ఎన్నికల వరకు ఎమ్మెల్యేలతో సహా.. పార్టీ శ్రేణులు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ నిర్దేశించారు. ప్రతీ ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని ప్రతీ ఇంటికి వెళ్లాల్సిందే అని సీఎం జగన్ అదేశాలు జారీ చేశారు. అలా వెళ్లే ఎమ్మెల్యేలు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటుగా... ఆ ఇంటికి అందుతున్న పథకాలు..లబ్ది గురించి తెలుసుకోనున్నారు. పథకాలు అందించడంతో పాటు.. ప్రతి ఇంటికీ  జగన్ రాసిన లేఖను ఎమ్మెల్యే అందించనున్నారు. ప్రతిపక్షాలు.. మీడియా నుంచి వస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలి.. ప్రజలకు వాస్తవం తెలిసేలా చేయాలి అంటే ఇదే సరైన మార్గమని అధినేత భావిస్తున్నారు. అందుకే విపక్షాల ఆరోపణలను సైతం ఖండిస్తూ లబ్ది దారులకు తమ లక్ష్యాలను వివరించనున్నారు. పార్టీ పరంగా తొలుత భావించిన ఈ కార్యక్రమంలో అధికారులు భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు సిద్దం చేసారు. కేవలం ఎమ్మెల్యేలే అంటే ఫీడ్ బ్యాక్ ర్యాంగ్ గా వచ్రే ప్రమాదం ఉందని.. అందుకే అధికారులను భాగం చేశారు.

  ఇంటింటికీ వైసీపీ అని.. ఎమ్మెల్యేలతో పాటు అధికారులను పంపిస్తే.. అది మరింత వివాదాస్పదమయ్యే ప్రమాదం ఉంది. అందుకే వివాదాలకు అవకాశం లేకుండా దీనిని ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా మార్చుతూ ఉత్తర్వులు ఇచ్చారు. సీఎం జగన్ అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీల్లో ఎంత శాతం అమలు అయ్యాయన్న విషయంలో ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 95 శాతం హామీలను క్లియర్ చేసినట్లుగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల కలెక్టర్లు (District collectors) ఖరారు చేసిన షెడ్యూల్‌ను అనుసరించి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రతి ఇంటినీ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ఎమ్మెల్యేలు సందర్శించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు.

  ఇదీ చదవండి : మాజీ మంత్రి నారాయణను ఎందుకు అరెస్ట్ చేశామంటే? ఆధారాలు ఉన్నాయన్న ఎస్పీ? ఏమన్నారంటే?

  ఇదే ఎమ్మెల్యేకు పెద్ద సమస్యగా మారింది.. సాధారణంగా కేవలం ఎమ్మేల్యేల కార్యక్రమమే అయితే.. తూతూ మంత్రంగా పూర్తి చేసేయొచ్చు. కానీ అధికారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయడంతో తప్పక గడప గడపకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో చాలా చోట్ల వానలు పడుతుండడం కూడా ఇబ్బందిగా మారింది. వానల్లో ఎలా వెళ్తామని అధికారులను ఎమ్మెల్యేలు నిలదీస్తున్నట్టు సమాచారం. మరోవైపు ప్రభుత్వంతో పాటుగా ఎమ్మెల్యేల పని తీరు పైన క్షేత్ర స్థాయిలో సర్వేలు చేయించినట్లుగా తేల్చారు. అందులో ప్రభుత్వం పైన ప్రజల్లో సానుకూలత ఉండగా.. కొందరు ఎమ్మెల్యేల పైన మాత్రం వ్యతిరేకత ఉన్నట్లుగా తేలింది. అందుకే ఇప్పుడు నేరుగా గడప గడపకు ఎమ్మెల్యేలతో పాటు అధికారులను పంపిస్తే.. ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉంది. స్తానిక ఎమ్మెల్యేపై ఎంత వ్యతిరేకత ఉందన్నది ఒక క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు.

  ఇదీ చదవండి : పవన్ దేవుడా..? లేక జ్యోతిష్యుడా..? దమ్ముంటే సింగిల్ గా రావాలి అంటూ రోజా సవాల్

  ఇప్పటి వరకు గ్రాఫ్ తక్కువగా ఉన్న ఎమ్మెల్యేల పని తీరు మార్చుకోవటానికి.. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని సీఎం భావిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నది జగన్ లక్ష్యం.. ఓ వైపు వైసీపీ బలం పెంచుకోవడంతో పాటు.. వచ్చే ఎనే్నికల్లో గెలిస్తే.. ప్రతిపక్షాలు లేకుండా చేయొచ్చు.. ముఖ్యంగా చంద్రబాబును ఓడిస్తే..ఇక, టీడీపీ ఉండదనేది వైసీపీ నేతల అంచనా. ఎమ్మెల్యేల పనితీరు మెరుగు పరుచుకుంటేనే..వారి గ్రాఫ్ పెరిగితేనే టిక్కెట్లు వస్తాయని సీఎం స్పష్టంగా చెప్పారు. గ్రాఫ్ పెరగని వారికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. దీంతో ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో పలు జిల్లాల్లో వానలు అడ్డంకిగా మారుతున్నాయి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు