Home /News /andhra-pradesh /

AP POLITICS TO DAY CM JAGAN MOHAN REDDY TDP CHIEF CHANDRABABU NAIDU WILL GO DELHI MEET WITH PM MODI NGS GNT

CM Jagan-Chandrababu: పీఎం మోదీ సమావేశానికి చంద్రబాబు హాజరు.. జగన్ దూరం.. నేడు ఢిల్లీకి వైసీపీ, టీడీపీ అధినేతలు

చంద్రబాబు, జగన్ (ఫైల్)

చంద్రబాబు, జగన్ (ఫైల్)

CM Jagan-Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ప్రధాని మోదీ సమావేశానికి చంద్రబాబు హాజరు అవుతుండగా..? సీఎం జగన్ మాత్రం దూరంగా ఉండనున్నారని సమాచారం.. దీంతో ఈ పర్యటన ఆసక్తికరంగా మారింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    CM Jagan-Chandrababu: ఇవాళ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఢిల్లీకి పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఇద్దరూ ఒకే రోజు ఢిల్లీ పర్యటనలో ఉంటున్నా.. ఎదురు పడే అవకాశం లేదు.. చంద్రబాబు (Chandrababu) పాల్గొనబోయే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీకి జగన్ వెళ్లడం లేదు. ప్రధాని మోదీ పాల్గొంటున్న సమావేశంలో చంద్రబాబు హాజరవుతుంటే..? జగన్ దూరంగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవ్వుతోంది. దీంతో ఈ అంశం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు షెడ్యూల్ చూస్తే ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు రాష్ట్రపతి ముర్ముతో చంద్రబాబు భేటీ అవుతారు. ఇక సాయంత్రం 4:30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నేతృత్వంలో జరిగే.. ఆజాదీకా మహోత్సవ్ కమిటీ భేటీలో పాల్గొంటారు.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత నేరుగా మోదీతో కలిసి ఓ సభలో చంద్రబాబు పాల్గొంటుండడం ఇదే ఫస్ట్ టైం.. అయితే చాలా కాలంగా చంద్రబాబును ప్రధాని మోదీ పక్కన పెట్టారని.. కలిసే ప్రయత్నాలు చేసినా.. పట్టించుకోలేదనే ప్రచారం ఉంది. కానీ ఈ మధ్య కేంద్రానికి దగ్గర అవ్వాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.. ఇలాంటి సమయంలో చంద్రబాబుకు అనూహ్యంగా కేంద్రం నుంచి ఆహ్వానం వచ్చింది.

    మరోవైపు ఇవాళ రాత్రి 7:30 గంటలకు ఢిల్లీకి జగన్ చేరుకుంటారు. 7న రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ నిర్వహించే.. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. రాత్రి హస్తినలోనే బస చేసి.. ఆదివారం (ఆగస్టు 7న) ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌‌కు సీఎం జగన్ వెళతారు. 9.45 – 4.30 వరకు రాష్ట్రపతి భవన్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరగనున్న నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం అనంతరం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగుపయనం అవుతారు. రాత్రి 8.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.



    చంద్రబాబు పర్యటన రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఆజాదీ కా అమృతోత్సవ్‌ నేషనల్ కమిటీ సమావేశానికి చంద్రబాబుకు కేంద్రం స్వయంగా ఆహ్వానించింది. లిఖితపూర్వక ఆహ్వానం పంపడంతో పాటు ఫోన్‌ కూడా చేశారు.. దీంతో చంద్రబాబు వెళుతున్నారు.  అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతోపాటు ప్రముఖ రాజకీయ నేతలు, క్రీడాకారులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు.

    ఇదీ చదవండి : ఒక్కసారి ఈ జెండాను చూడాలంటే కష్టమే..? త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ.. పొడుగు ఎంతంటే?

    మొత్తం 240 మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబుతో మోదీ ఎలా వ్యవహరిస్తారు అన్నదాని కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే నేరుగా చంద్రబాబుతో మోదీ మాట్లాడితే.. రెండు పార్టీలు త్వరలో దగ్గర అవుతున్నాయనే సంకేతాలు అందించినట్టే అని ప్రచారం జరుగుతోంది.

    ఇదీ చదవండి : కావాలనే ఆయన్ను టార్గెట్ చేస్తున్నారా? మరి మాజీ మంత్రి ఆడియో లీక్ చేసింది ఎవరు..?

    సీఎం జగన్ విషయానికి వస్తే.. ఆర్దిక అంశాల్లో కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలు.. సెస్ లు- పన్నుల్లో రాష్ట్రాల వాటాల గురించి ముఖ్యమంత్రి నీతిఅయోగ్ సమావేశంలో ప్రస్తావిస్తారని చెబుతున్నారు. ఇక, ప్రధానితో సమయం ఖరారైతే..ప్రధానంగా పోలవరం నిర్వాసితుల ప్యాకేజీ గురించి చర్చించనునున్నట్లు సమాచారం.

    ఇదీ చదవండి : వరలక్ష్మీ వ్రతం మహత్యమా..? గడప ముందుకే వచ్చి పిండకుండానే పాలిస్తున్న గోమాత.. మీరే చూడండి

    కేంద్రంతో మొన్నటి వరకు చాలా సఖ్యంగా ఉండే సీఎం జగన్.. మోదీ సమావేశానికి ఎందుకు హాజరు కావడం లేదన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.. చంద్రబాబు నాయుడుతో వేదిక షేర్ చేసుకోవడం ఇష్టం లేకనే ఆయన వెళ్లడం లేదా..? లేక ఇటీవల కేంద్రంపై విమర్శల దూకుడు పెంచిన వైసీపీ.. ఇకపైనా అదే కొనసాగించాలి అనుకుంటోందా.? అదే సమయంలో బీజేపీకి టీడీపీ దగ్గర అవుతున్నారనే అనుమానిస్తున్నారా..? అందుకే ఆయనే బీజేపీ దూరంగా ఉంటున్నారనే మరో ప్రచారం కూడా ఉంది..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, Pm modi, Ycp

    తదుపరి వార్తలు