Supreme On Amaravati: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం రాజధాని చుట్టూ రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. ఎన్నికలు కూడా ఇదే అజెండాగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే విపక్షాలన్నీ అమరావతి (Amarvati) రాజధాని అని డిమాండ్ చేస్తున్నాయి. కానీ అధికార వైసీపీ (YCP) మాత్రం.. మూడు రాజధానులు (Three Capitals) తమ విధానమంటోంది. వికేంద్రీ కరణ పేరుతో విశాఖను పరిపాలనా రాజధాని (Visakha Executive Capital) గా.. కర్నూలు (Kurnool) న్యాయ రాజధానిగా.. అమరావతి శాసన రాజధానిగా చేస్తామంటోంది. అయితే పేరుకు మూడు రాజధానులే అయినా.. విశాఖ ప్రధాన రాజధాని అన్నది వైసీపీ వాదన.. దీనిపై మంత్రి ధర్మాన (Minister Dharmana) సైతం క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే వికేంద్రీ కరణ పేరుతో ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఉద్యమాలు తీవ్రం అయ్యాయి. ఉత్తరాంధ్రలో విశాఖ గర్జన (Visakha Garjana) పేరుతో భారీగా కార్యక్రమం నిర్వహించింది వైసీపీ.. ఇప్పుడు రాయలసీమను ఉద్యమం సిఫ్ట్ అయ్యింది. ఆత్మగౌరవం పేరుతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.. ఇలా వైసీపీ మూడే ముద్దు అంటోంది. అయితే అందుకు న్యాయపరమైన అనుమతులు ఉంటాయా.. కేంద్రం సహకరిస్తుందా అన్నదే ప్రధాన ప్రశ్నంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి సుప్రీం కోర్టు విచారణ కీలకంగా మారింది.
అమరావతి రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును సెప్టెంబర్ లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేసులో ఇప్పటికే తమ వాదన కూడా పరిగణలోకి తీసుకోవాలని కెవియెట్ పిటిషన్లు దాఖలు చేశారు అమరావతి రైతులు. 2వేల పేజీలతో ఎస్ఎల్పీ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని ఎస్ఎల్పీలో సుప్రీంకోర్టును కోరింది వైసీపీ సర్కార్. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేసినట్టే అని రాష్ట్ర ప్రభుత్వం వాధిస్తోంది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొంది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు సూచించడం శాసనసభ అధికారాలను ప్రశ్నించడమేనని తన పిటిషన్ లో వైసీపీ సర్కార్ ప్రస్తావించింది.
ఇదీ చదవండి : పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ.. ప్రారంభమైన శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ
అంతేకాదు అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం కేవలం ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని తన పిటీషన్ లో స్పష్టం చేసింది.. ఇప్పటికే పలు పిటిషన్లను స్వీకరించిన సుప్రీం కోర్టు.. అన్నింటినీ నేడు విచారణ చేపట్టనుంది. దీంతో ఈ అంశంపై సుప్రీం ఎలా స్పందిస్తుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, Ap capital, Ap government, AP News, Supreme Court