హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Badvel Bypoll: నేడే బద్వేల్‌ బై పోల్.. జనసేన-టీడీపీ ఓట్లు పడేది ఎవరికి..?

Badvel Bypoll: నేడే బద్వేల్‌ బై పోల్.. జనసేన-టీడీపీ ఓట్లు పడేది ఎవరికి..?

బద్వేల్ బై పోల్

బద్వేల్ బై పోల్

Badvel Bypoll to day: బద్వేల్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన బరిలో లేకపోయినా.. ఈ ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా అధికార వైసీపీ గెలుపు పై ఎలాంటి అనుమానం లేకపోయినా.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు ఎన్ని ఓట్లు వస్తాయి అన్నదాని ఉత్కంఠ నెలకొంది.

ఇంకా చదవండి ...

To day Badvel Bypoll: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జాతీయ పార్టీల భవిష్యత్తు ఏంటన్నది నేటి ఎన్నికతో తేలిపోనుంది. రెండు జాతీయ పార్టీలు బీజేపీ (BJP),  కాంగ్రెస్ (Congress)లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకన్న కడప జిల్లా (Kadapa District)లోని బద్వేల్ (Badvel) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేడు జరగనుంది. ఈ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. ఓటర్లందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె. విజయానంద్‌ (K.vijayanand) విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఓటున్న ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలన్నారు. పోలింగ్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు ప్రధాన ఎన్నికల అధికారి. పోలింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తోపాటు వెబ్‌క్యాస్టింగ్‌ కూడా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 77.64 శాతం పోలింగ్‌ నమోదైంది. అప్పట్లో 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 77,466 మంది, 81,394 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో 77.64 శాతం నమోదైంది. ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,15,292 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 22 మంది ఉన్నారు.

ఈ ఉప ఎన్నిక రెండు జాతీయ పార్టీలకు కీలకం కానుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (TDP), ఓట్ల పరంగా కాస్త మెరుగ్గా కనిపించే జనసేన (Janasena)రెండూ ఈ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్నాయి. దీంతో వార్ వన్ సైడ్ అవుతుందని.. ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది అనుకన్నారు. కానీ రెండు జాతీయ పార్టీలు బద్వేల్ ఉప ఎన్నిక బరిలో నిలిచాయి. కేవలం బరిలో దిగడమే కాదు.. గెలుపు తమదే అని తొడలు కొడుతూ... అధికార వైసీపీ (YCP) వైపు కాలు దువ్వాయి. ఈ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఓట్లను కొల్లగొట్టి తమ సత్త చాటుతామంటున్నాయి బిజెపీ(BJP)., కాంగ్రెస్ (Congress) పార్టీలు..

ఇదీ చదవండి: నేటి రాశి ఫలాలు.. ఆర్థిక సమస్యలు పరిష్కారం.. ఆకస్మిక ధనలాభం

దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణం తరువాత బద్వేల్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.. అధికార వైసీపీ పార్టీ వెంటకసుబ్బయ్య సతీమణికే ఎమ్మెల్యే టిక్కెట్ ను కేటాయించింది. దింతో టీడీపీ., జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి. ఇక మిత్ర పక్షం తప్పుకోగా... బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధం అయింది. దింతో పోటీ చేయకున్నా జనసేన తన మద్దతును బిజెపికి ఇస్తామంటూ ప్రకటించింది.

ఇదీ చదవండి: ఒక్క ఛాన్స్ కావాలా..? ఫిల్మ్ మేకింగ్‌లో ఆసక్తి ఉందా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా చేయండి

అయితే ప్రస్తుతం ఈ ఎన్నికలో టీడీపీ-జనసేన కార్యకర్తలు, అభిమానుల ఓట్లు ఎవరికి పడతాయి అన్నది ఆసక్తికరంగా మారింది. జనసేన అధినేత పవన్ నేరుగా ఎన్నికల ప్రచారానికి రాకపోయినా.. జనసేన కార్యకర్తలు పొత్తులో భాగంగా బీజేపీకే ఓటు వేసే అవకాశం ఉంది. ఇటీవల ఏపీలో పరిణామాలతో టీడీపీ నేతలు.. బీజేపీ అధిష్టానానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు కూడా.. బీజేపీ ఓటు వేస్తారా..? లేక కాంగ్రెస్ కు సపోర్టు చేస్తారా అన్నది చూడాలి..

ఇదీ చదవండి: కుక్కలకు కూడా చట్టాలుంటాయా..? గీత దాటితే కఠిన శిక్ష..?

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో పూర్తిగా చతికిలబడ్డ కాంగ్రెస్.. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగింది. ప్రధాన ప్రతిపక్షాలు సానుభూతి, సాంప్రదాయం అంటూ పోటీ నుంచి వైదొలగితే.. బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు మాత్రం కయ్యానికి సై అంటూ.. మీసం మెలేస్తున్నాయి. బద్వేల్ లో ఇరు పార్టీలకు ఏమైనా ఓటు బ్యాంకు బలంగా ఉందా అంటే అసలే లేదు. 2019లో ఇక్కడ పోటీకి దిగిన కాంగ్రెస్ కు పట్టుమని 2 వేల ఓట్లు కూడా పడలేదు. మరో జాతీయ పార్టీ బిజెపికి 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక జనసేనకు 4 వేల పైచిలుకు ఓట్లు రాగా.... టీడీపీకి మాత్రం 76 వేల 603వందల ఓట్లు వచ్చాయి. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే నోటాకు అధికంగా ఓట్లు రావడం విశేషం

First published:

Tags: Andhra Pradesh, Ap bjp, AP Congress, AP News, AP Politics, Ycp

ఉత్తమ కథలు