AP Assembly: ఏపీకి ఏకైక రాజధాని అమరావతి (AP Capital Amaravati) అంటూ అక్కడి రైతులు మహా పాదయాత్ర చేపట్టారు.. అమరావతి టూ అరసవల్లికి చేపట్టిన ఈ యాత్రకు వైసీపీ (YCP) మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే ఇదే సమయంలో అధికార పార్టీ. మూడు రాజధానులపై స్పీడ్ పెంచింది. నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో.. మూడు రాజధానులను ఫైనల్ చేసేందుకు సిద్ధమైంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా... శాసన మండలి సమావేశాలు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో భాగంగా తొలి రోజే మూడు రాజధానులకు (Three Capitals) సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. దీనిపై చర్చతో పాటుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. విజయవంతం అయ్యేలా తీసుకోవల్సిన చర్యలపై శాసనసమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో అమరావతి శాసనసభ కమిటీ హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. శాసన మండలి, శాసన సభా సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని కోరారు.
మరోవైపు గత సమావేశాల్లో, ప్రస్తుతం సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలను సకాలంలో అందజేయాలని అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు సూచించారు. సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే మాజీ MLCల మెడికల్ బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మోషేను రాజు అధికారులను కోరారు.
ఇదీ చదవండి : శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల..? ఏ రోజు.. ఏ సేవ..? ప్రత్యేకత ఏంటంటే..?
ముఖ్యంగా మూడు రాజధానుల ఏర్పాటు పై క్లారిటీ ఇచ్చేందుకే ఈ సమావేశాలు జరుగుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేస్తారని టాక్. అది కూడా అమరావతి రైతులు పాదయాత్ర జరుగుతున్న సమయంలో.. ఉత్తరాంధ్రపై పట్టు కోల్పోకూడదు అంటే.. ఇదే సమయంలో క్లారిటీ ఇవ్వడం మంచిందని అధికార పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి : మాజీ ఎంపీ.. బీజేపీ నేత అరెస్ట్.. కారణం ఏంటో తెలుసా..?
మరోవైపు ప్రభుత్వం ఉద్యోగుల విషయంలోనూ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.. సీపీఎస్ రద్దుకు ప్రత్యామ్నాయం ఏంటి అన్నదానిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనికి తోడు జాబ్ క్యాలెండర్, సంక్షేమ పథకాలు అన్నింటిపైనా ఈ సమావేశాల్లో క్లారిటీ ఇస్తారనే చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి : బిడ్డకు ప్రాణం పోసిన మెడిసన్ విద్యార్థి.. ట్రైన్ లో నిండు గర్భిణికి డెలివరీ
అయితే మరోసారి ప్రతిపక్షం లేకుండానే సభ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అయ్యేంత వరకు అసెంబ్లీలో అడుగు పెట్టను అంటూ శపథం చేశారు. ఈ నపథ్యంలో ఆయన సమావేశాలకు అయితే రారు. ఇటీవల కొడాలి నాని నారా కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నేతలు కూడా హాజరయ్యే అవకాశం లేదు. వచ్చినా దానిపై సభను బాయికాట్ చేసే అవకాశాలే ఎక్కువ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh assembly session, Ap capital, Ap cm jagan, AP News