Home /News /andhra-pradesh /

AP POLITICS TO DAY ANDHRA PRADESH LAST CABINET MEETING FOR SOME MINSTERS THEY ALL RESIGNATIONS AFTER MEETING NGS

AP Cabinet: నేడే ఆ మంత్రులకు లాస్ట్ మీటింగ్.. సాయంత్రం మూకుమ్మడి రాజీనామాలు.. కొనసాగేది ఎవరంటే..?

ఏపీ కేబినెట్ (ఫైల్)

ఏపీ కేబినెట్ (ఫైల్)

AP Cabinet: మంత్రుల రాజీనామాకు సర్వం సిద్ధమైంది. అంతా మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నారు. ఇప్పుడు మళ్లీ మంత్రులుగా కొనసాగేది ఎవరు.. కొత్తగా ఎంతమందికి అవకాశం కల్పిస్తారు..? రాజీనామా చేస్తున్న మంత్రులకు సీఎం ఏం చెప్పబోతున్నారు..? ఎలాంటి బాధ్యతలు అప్పచెపుతారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

ఇంకా చదవండి ...
  Andhra pradesh Cabinet Meeting to day:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు  సీఎం జగన్ (CM YS Jagan) .. సర్వం సిద్ధం చేస్తున్నారు.  ఇందులో భాగంగా ఇవాళ మంత్రులతో రాజీనామాలు చేయించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా  ఈ కేబినెట్ తో చివరి సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం.. చాలామంది మంత్రులకు ఇదే చివరి కేబినెట్ సమావేశం. మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి (Velagapudi) లోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అధ్యక్షతన జరగనుంది.. ఈ సమావేశంలోనే మంత్రుల రాజీనామాను సీఎం కోరే అవకాశం ఉందని తెలిసింది.  సీఎం ఆదేశాల మేరకే ఉద్వాసనకు గురవుతున్నవారంతా రాజీనామాలు చేయనున్నారు. దీనిపై మంత్రులకు సీఎం జగన్ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.

  తాజాగా అందుతున్న సమాచారం మేరకు కేవలం ఇద్దరు మినహా మిగిలిన వారంతా రాజీనామా లేఖలు ఇస్తారని అత్యంత విశ్వసనీయ సమాచారం. వీరిలో ఎవరూ ఊహించని విధంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూరు జయరాంకు.. అధినేత మళ్లీ అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సీనియర్లు అయితే బొత్స సత్యనారాయణ (Minster Botsa) , పెద్దిరెడ్డి రాచంద్రారెడ్డి (Peddireddy Ramachandrareddy),  సీఎంకు అత్యంత సన్నిహితులు కొడాలి నాని (Kodali Nani), పేర్ని నాని (Perni Nani) లను సైతం కేబినెట్ నుంచి తప్పిస్తారని టాక్.

  ఇదీ చదవండి : రంధ్రంలో రాజ రాజ చోర.. ఎరక్కపోయి వచ్చాడు ఇరుక్కున్నాడు

  వీరిలో పెద్దిరెడ్డి మినహా. మిగిలిన ముగ్గురు మంత్రులు తమ పదువులపై క్లారిటీ ఇచ్చారు కూడా.. మంత్రి బొత్స ఇటీవల మాట్లాడుతూ..  మంత్రులకు అవకాశం ఇవ్వాలా..? తప్పించాలా అన్నది అధినేత ఇష్టం అన్నారు. అయితే ఏ బాధ్యతలు ఇచ్చినా.. పార్టీ కోసం కష్టపడతాను అన్నారు బొత్స..  ఫైర్ బ్రాండ్ మినిస్టర్ కొడాలి నాని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు. తనకు మంత్రి పదవి అడ్డంకి అని.. లేకపోతే ప్రతిపక్షాలకు ముఖ్యంగా టీడీపీకి విశ్వరూపం చూపిస్తానని వారం క్రితమే కామెంట్స్ చేశారు. మరో మంత్రి పేర్ని నాని కూడా తన పదవిపై క్లారిటీ ఇచ్చారు. 11న కొత్త రవాణా మంత్రి వస్తారని.. కొత్త మంత్రికి తన అభిప్రాయాలు చెబుతానని ఆయనే స్వయంగా అన్నారు. అంతే ఈ ముగ్గురికీ ముందే జగన్ సమాచారం ఇచ్చినట్టు వైసీపీ వర్గాల్లో సమాచారం జరుగుతోంది.

  ఇదీ చదవండి : పేరెంట్స్ కు గుడ్ న్యూస్.. ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా..? వాయిదాల్లో ఫీజులు చెల్లించే అవకాశం? ఎలా అంటే?

  ఇక నేటి కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకోనున్నారు సీఎం. ఈ సందర్బంగా మంత్రులకు సీఎం ఏం చెబుతారని ఆందరిలో ఉత్కంఠ పెంచుతోంది. ముఖ్యంగా ఈ సమావేశంలో 40 అంశాలతో కేబినెట్ అజెండాను రూపొందించారు. కొత్తపేట రెవెన్యూ డివిజన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. రంపచోడవరం కేంద్రంగా కొత్త గిరిజన జిల్లా ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు.  సంగం బ్యారేజికి మాజీ దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి పేరు పెట్టడానికి ఆమోదం తెలపనుంది కేబినెట్. రాజధాని అమరావతికి సంబంధించి నిర్ణయం,  సీపీఎస్ రద్దుపై అధికారుల కమిటీ వేయడంపై చర్చే జరిగే అవకాశం ఉంది. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై కేబినెట్‌లో చర్చించే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

  ఇదీ చదవండి : టీడీపీ యువ ఎంపీతో ప్రధాని ముచ్చట్లు.. కూతురుకి చాక్లెట్లు ఇచ్చిన మోదీ సర్ ప్రైజ్

  మంత్రుల రాజీనామా తరువాత.. అంతే రేపు సీఎం జగన్‌ గవర్నర్‌ హరిచందన్‌ను కలుస్తారు. అదే రోజు కొత్త మంత్రుల లిస్ట్‌ను అందిస్తారని తెలుస్తోంది. సీఎం జగన్ తో పాటు.. 26 మంది మంత్రులు ఉండాలి. జగన్‌, ఇద్దరు మంత్రులు కాకుండా 23 మంది కొత్తగా ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్‌ అయింది. ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. కొత్త జిల్లాలు, సామాజిక సమీకరణల ఆధారంగా మంత్రివర్గ కూర్పుపై కసరత్తు జరుగుతోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, AP News, AP Politics

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు