హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirupati By Poll: తిరుపతిలో వైసీపీ సహా అన్ని పార్టీలదీ అదే టెన్షన్... తలపట్టుకుంటున్న ముఖ్యనేతలు

Tirupati By Poll: తిరుపతిలో వైసీపీ సహా అన్ని పార్టీలదీ అదే టెన్షన్... తలపట్టుకుంటున్న ముఖ్యనేతలు

పవన్ కు ప్రాధాన్యంపై సీనియర్లు అసహనం

పవన్ కు ప్రాధాన్యంపై సీనియర్లు అసహనం

తిరుపతి ఉపఎన్నిక (Tirupati By Election) సందర్భంగా రాజకీయ పార్టీల్లో టెన్షన్ నెలకొంది. గెలుపోటముల సంగతి పక్కనబెడితే అన్ని పార్టీలు ఒకే సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉపఎన్నికల హడావిడి నెలకొండి. అన్ని పార్టీల ముఖ్యనేతలు తిరుపతిలోనే మకాం వేసి ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ నుంచి మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం తరపున ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు వారం రోజులుగా అక్కడే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో రోడ్ షో నిర్వహించి ప్రచారాన్ని వేడెక్కించారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కరోనా కారణంగా చివరి నిముషంలో రద్దైంది. ఐతే ప్రచారం జోరుగా సాగుతున్నా.. ప్రధాన పార్టీలను ఓ అంశం కలవరపరుస్తోంది. అదే కరోనా వైరస్..! ఏపీలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అందునా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీగా పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ పై చూపుతుందన్న ఆలోచనతో పార్టీలున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసుల్లోనూ చిత్తూరు జిల్లానే టాప్ ప్లేస్ లో నిలుస్తోంది. ఇక కపోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు కూడా ఉంది. పట్టణప్రాంతాల కంటే రూరల్ ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగానే పలువురు నేతలు కరోనా బారిన పడుతున్నారు. ఐతే పోలింగ్ సమయానికి కరోనా వ్యాప్తి మరింత అధికంగా ఉంటే ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులు రావొచ్చు. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని మూడు మండలాల్లో లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఇలాంటి పరిస్థితులు రాకపోయినా.. కరోనా భయంతో ప్రజలు ఓటేసేందుకు ముందుకు వస్తారా అనేది చర్చనీయాంశమైంది.

ఇది చదవండి: ఏపీలో రెండు వారాలు లాక్ డౌన్.. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. స్థానికుల కోరికమేరకే..


ఇప్పటికే భారీ మెజారిటీనే తమ లక్ష్యమని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. 5 లక్షల మెజారిటీ సాధిస్తామని.. అదే సీఎం జగన్ పెట్టిన టార్గెట్ అని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం తగ్గితే భారీ మెజారిటీ సాధిస్తామన్న వైసీపీ ఆశలకు గండిపడినట్లే. ఇక ఈ పరిస్థితి టీడీపీకి కూడా కష్టమే. పోలింగ్ శాతం తగ్గితే అధికార పార్టీకి గట్టిపోటీనివ్వావలన్న ఆశలు గల్లంతవుతాయి. గెలిచినా, గెలవకపోయినా ఢీ అంటే ఢీ అనేలా ఓట్లు సాధించాలని టీడీపీ భావిస్తోంది. ఇక జనసేన-బీజేపీ కూటమిదీ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి టీడీపీ ఓట్లతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ను కొల్లగొట్టాలని బీజేపీ భావిస్తోంది. పోలింగ్ శాతం ఏమాత్రం తగ్గినా బీజేపీకి వచ్చే ఓట్లకు గండిపటం ఖాయం.

ఇది చదవండి: వాలంటీర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్... ఇక నుంచి ప్రతి ఏటా సత్కారం


 సో గెలుపుపై ఎవరికివారు ధీమాగా ఉన్నా వైరస్ మహమ్మారి విజృంభిస్తే ఫలితాలు తారుమారవుతాయన్న ఆందోళన అన్ని పార్టీల్లోనూ నెలకొంది. ఎండలు కూడా పోలింగ్ శాతంపై ప్రభావం చూపే అకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సస్పెన్స్ కు తెరదించాలంటే ఏప్రిల్ 17వరకు ఒపిక పట్టాల్సిందే..!

First published:

Tags: Andhra Pradesh, Tirupati Loksabha by-poll

ఉత్తమ కథలు