హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

RK Roja: మంత్రి ఫోన్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. సినిమా, రాజకీయ ఎంట్రీకి కారణం ఎవరో తెలుసా..?

RK Roja: మంత్రి ఫోన్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. సినిమా, రాజకీయ ఎంట్రీకి కారణం ఎవరో తెలుసా..?

మంత్రి రోజా ఫోన్ చోరీ స్టోరీలో ట్విస్ట్

మంత్రి రోజా ఫోన్ చోరీ స్టోరీలో ట్విస్ట్

RK Roja: మంత్రి రోజా మొబైల్ ఫోన్ చోరీ చేసింది ఎవరు..? లేదా అసలు చోరీకి గురి అవ్వలేదా..? మంత్రి ఫోన్ మిస్సింగ్ కు కారణం ఏంటి..? ఆమె ఫోన్ ను పోలీసులు ఎలా గుర్తించారు..? అంతే కాదు తిరుపతి పర్యటనలో ఉన్న ఆమె.. ఈ స్థాయిలో ఉండడానికి టీడీపీ నేతే కారణం అన్నారు.

ఇంకా చదవండి ...

RK Roja: మంత్రి రోజా (Minster Roja) ఫోన్ మిస్సింగ్  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా కలకలం రేపింది. మంత్రి ఫోన్ కే దిక్కు లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి. మరోవైపు స్వయంగా మంత్రే తన ఫోన్ మిస్ అయ్యింది అంటూ ఫిర్యాదు చేయడంతో.. విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే మూడు గ్రూపులుగా రంగంలోకి దిగి ఫోన్ కోసం గాలించారు.. మొత్తానికి ఆమె ఫోన్ ను ట్రాక్ చేసి గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై  ఎస్పీ మాట్లాడుతూ ట్వీస్ట్ బయట పెట్టారు. అసలు మంత్రి రోజా మొబైల్ ఫోన్ చోరీకి గురికాలేదన్నారు.. ఆమె పద్మావతి అతిధి గృహంలో కొంత సేపు బస చేసారని అదే సమయంలో.. పద్మావతి అతిధి గృహంలో మొబైల్ ఫోన్ మరచిపోయారని వివరణ ఇచ్చారు.  అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పోలీస్ శాఖకు ఆ ఫోన్ ను అప్పగించారని.. కానీ అప్పటికే మంత్రి మీటింగ్ కి వెళ్లిన సమయంలో మొబైల్ లేకపోవడంతో.. ఆమె మొబైల్ చోరీకి గురైందని భావించారన్నారు.. 15 నిమిషాల్లోనే మంత్రి రోజా మొబైల్ ఫోన్ ఆమె వద్దకు చేర్చామన్నారు. ఏదీ ఏమైనా మంత్రి ఫోన్ దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు తిరుపతి (Tirupati) పర్యటనలో ఉన్న మంత్రి రోజు కీలక విషయాలు వెల్లడించారు. ఆమె మొదట సినిమాల ద్వారా తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు. సినిమాల ద్వారా ఉన్న ఫాలోయింగ్ తో.. ఆ తరువాత రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు. ఇక వైసీపీ (YCP)లో చేరిన తరువాత.. ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాదు.. తొలిసారి మంత్రి బాధ్యతలు స్వీకరించారు. అయితే తనను సినిమాల్లోకి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి తీకొచ్చింది ఎవరు అనే విషయంపై పలు సందర్భాల్లో ఆమె ప్రస్తావించారు. తాజాగా తిరుపతిలో ఆ విషయాలపై క్లారిటీ ఇచ్చారు.. టీడీపీ నేత వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు.

ఇదీ చదవండి : ఆ జిల్లాలో వారం రోజులు లాక్ డౌన్.. ఎందుకో తెలుస్తే.. షాక్ అవుతారు..?

తిరుపతిలోని బ్లిస్ హోటల్ లో మంత్రి రోజాను ఘనంగా సన్మానించింది ఏపీ హోటల్ అసోసియేషన్.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను సినిమాల్లోకి, రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మాజీ ఎంపీ శివప్రసాదేనని మరోసారి గుర్తుచేసుకున్నారు. ఇక, టూరిజంలో హోటళ్లది ముఖ్య భూమిక అని.. కోవిడ్ -19 వల్ల హోటల్ నిర్వాహకులు తీవ్రంగా నష్టపోయారన్న ఆమె.. తిరుపతిలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ఇదీ చదవండి : సీఎం కాన్వాయ్ కు సర్కార్ వాహనాల్లేవా? సస్పెండ్ తో సరిపోతుందా? ప్రభుత్వంపై విపక్షాల ఫైర్

అలాగే తిరుపతి జూపార్కులో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మంత్రి రోజా.. చంద్రగిరి కోట అభివృద్ధికి తిరుపతి వాసిగా కృషి చేస్తానన్న ఆమె.. ఏపీ టూరిజానికి టీటీడీ దర్శన టికెట్ల కోటా పెంపునకు ప్రయత్నాలు చేస్తాను అన్నారు. తిరుపతిలో టీటీడీ గదుల బుకింగ్ కౌంటర్ ఏర్పాటు అవశ్యకతను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని.. నిర్వాహకుల అభ్యర్థన మేరకు హోటల్ పనివేళల పెంపుకు కృషి చేస్తానన్నారు. ఏపీలో అన్ని పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా ఒక యాప్ రూపాందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. అలాగే రాష్ట్రం కోసం ఎంత కష్టపడతానో.. సొంత ప్రాంతం తిరుపతి అభివృద్ధికి కూడా అంతే కష్టపడతానని మంత్రి చెప్పారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Rk roja, Tirupati

ఉత్తమ కథలు