Home /News /andhra-pradesh /

AP POLITICS TIRUPATI BJP CANDIDATE RATNA PRABHA EXPECTING JANASENA CHIEF PAWAN KALYAN TO CAMPAIGN FOR BJP IN TIRUPATI BY POLL FULL DETAILS HERE PRN

Tirupati By-Poll: తిరుపతి ప్రచారానికి పవన్ కల్యాణ్...? గుడ్ న్యూస్ చెప్పిన రత్నప్రభ

పవన్ కల్యాణ్, రత్నప్రభ (ఫైల్)

పవన్ కల్యాణ్, రత్నప్రభ (ఫైల్)

తిరుపతి ఉపఎన్నికలో(Tirupati By-Poll) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రచారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ-జనసేన (BJP-Janasena) అభ్యర్థి రత్నప్రభ (Ratna Prabha) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టి తిరుపతి ఉపఎన్నికపైనే పడింది. భారీ ఆధిక్యాన్ని దక్కించుకోవాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుంటే.. ఎలగైనా గెలవాలని తెలుగదేశం పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా విజయం సాధిస్తామని జనసేన-బీజేపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగిన ఆమె..తనను గెలిపిస్తే పార్లమెంట్ లో ఏపీ ప్రజల గళాన్ని వినిపిస్తానని చెప్పారు. అంతేకాదు ఇన్నాళ్లకు మాతృభూమికి సేవచేసే అవకాశం తన ముందుందని చెప్పారు. ప్రజల కోసం పనిచేయడంలోనే తనకు ఆనందం ఉంటుందన్నారామె. కేవలం తిరుపతి గురించే కాకుండా.. రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తానని తెలిపారు. గతంలో తాను చేసిన ట్వీట్లకు ప్రస్తుత ఎన్నికలకు సంబంధం లేదని రత్నప్రభ స్పష్టం చేశారు. సీఎం జగన్ ను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ తో రాజకీయాలతో ముడిపెట్టొద్దన్నారు.

    ఈ సందర్భంగా ట్వీట్ పై ఆమె వివరణ ఇచ్చారు. జగన్ ను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ నిజమేనని.. మంచి పని చేస్తే వైసీపీకి మద్దతిచ్చినట్లు కాదన్నారు. డబ్బుకు ఓటెయ్యాలో.. నీతినిజాయితీకి ఓటు వేయాలో ప్రజలు తెల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక తిరుపతి ఉపఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతు లేదన్న ప్రచారాన్ని రత్నప్రభ కొట్టిపారేశారు. తన అభ్యర్థిత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ పూర్తి సంతృప్తిగా ఉన్నారని.. 200శాతం తనకు మద్దతిస్తారని స్పష్టం చేశారు.

    ప్రచారానికి పవన్..?
    ఇక తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా ప్రచారం చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారంటూ రత్నప్రభ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పవన్ తో భేటీ అయి ఉపఎన్నికపై చర్చించానని.. ప్రచారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానని మాటిచ్చారని ఆమె తెలిపారు. రత్నప్రభ ప్రకటనతో అటు తిరుపతి జనసైనికుల్లో జోష్ వచ్చినట్లైంది. ఐతే పవన్ నిజంగా ప్రచారానికి వస్తారా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది. రత్నప్రభ ప్రకటన జనసేన కార్యకర్తలను ఆకట్టుకునేందుకా.. లేదా పవన్ నిజంగా తిరుపతిలో ప్రచారం చేస్తారా అనే దానిపై రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది.

    పవన్ ప్రచారానికి వస్తే తమకు ప్లస్ పాయింట్ అవుతుందని బీజేపీ భావిస్తోంది. వైసీపీ, టీడీపీల ప్రచారానికి ధీటుగా పవన్ క్యాంపెయినింగ్ ఉంటుందని అంచనా వేస్తోంది. అలాగే తిరుపతిలో ఉన్న కాపు ఓట్లపైనా పవన్ టూర్ ప్రభావం ఉంటది చూస్తోంది. గెలుపు సంగతి అటుంచింతే బలమైన ఉనికిని చాటుకునేందుకు పవన్ ప్రచారం ప్లస్ పాయింట్ అవుతుందన్న గ్యారెంటీ ఉందని కమలనాథులు చెప్తున్నారు. ఐతే ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న పవన్.. తిరుపతిలో ప్రచారానికి డేట్లు సర్దుబాటు చేసుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Bjp-janasena, Pawan kalyan, Tirupati Loksabha by-poll

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు