Home /News /andhra-pradesh /

AP POLITICS TIRUMALA TIRUPATI DEVASTHANAM SAYS GOOD NEWS TO THEIR EMPLOYEES FOR CONSTRICTION NEW HOUSE NGS

Tirumala Tirupati: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సొంతింటి కల నేరవేర్చే దిశగా అడుగులు

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (ఫైల్)

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (ఫైల్)

Tirumala Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఉద్యోగులకు శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తుంది. దీంతో ఎన్నోఏళ్ల కల నేరువుతోందని ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు.

    TTD Employees:  తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthnam) కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉద్యోగుల (TTD Employees) చిరకాల స్వప్నం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల (Tirumala)లో పని చేసే ఉద్యోగులకు ఇంటి స్థలాల విషయంలో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది జగన్ ప్రభుత్వం.. వారి సొంతింటి కల నెరవేర్చాలని భావించింది. దీనికి సంబంధించి టీటీడీ పాలక మండలి ఓ తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ఏపీ ప్రభుత్వం (AP Government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం 61.63 కోట్ల రూపాయల చెక్ ను కలెక్టర్ హరినారాయన్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbbareddy) అందచేశారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) కూడా ఉన్నారు. టీటీడీ ఉద్యోగుల కోసం వడమాలపేట మండలం అరణ్యం గ్రామంలో ప్రభుత్వం సేకరించిన 300 ఎకరాల స్థలం, కొనుగోలు చేసిన ప్రభుత్వ భూమిలో ఉద్యోగులకు ఇంటి స్థలాలు టీటీడీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా మీడియాతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… సీఎం జగన్ (CM Jagan) చొరవతోనే టీటీడీ ఉద్యోగుల 30 ఏళ్ల కల నేడు నెరవేరుతోంది అన్నారు.

    ప్రభుత్వానికి డబ్బులు చెల్లించిన నేపథ్యంలో 300 ఎకరాల స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుందన్నారు. టీటీడీలో పనిచేస్తున్న 5 వేల 518 మందికి ఇంటి స్థలాలు దక్కనున్నాయన్నారు. ప్రైవేటు వ్యక్తులు గోశాల ఏర్పాటు, గో ఉత్పత్తుల తయారీకి ముందుకు వస్తే పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు తమ చిరకాల స్వప్పం నెరవేరుతోంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని ఉద్యోగులు టీటీడీని కోరుతున్నారు.

    ఇదీ చదవండి : ప్రజల కోరిక మేరకు విద్యుత్ చార్జీలు పెంపు.. ప్రభుత్వం వివరణపై ఆగ్రహ జ్వాలలు

    మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో నేర చరితుల్ని సభ్యులుగా చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘోరమైన నేరాలకు పాల్పడిన కొందరు వ్యక్తులు ఇటీవల టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా చేరారని అటువంటి వారిని వెంటనే తొలగించాలంటూ హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు చీఫ్ జస్టిస్..నేరచరిత ఉన్నవారిని ఆలయ పాలకమండలిలో సభ్యులుగా ఎలా నియమిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భగవంతుని సేవలో నేరచరితులా..? ఇలాంటి వాటిని ఉపేక్షించను అంటూ హైకోర్టు సీజే ప్రభుత్వంపై, టీటీడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఇదీ చదవండి : ఏపీ ప్రజలకు సీఎం శుభవార్త.. సమగ్ర భూ సర్వేతో దేశానికి రాష్ట్రం దిక్సూచి కావాలన్న జగన్

    నేరచరితపై ప్రాదమిక ఆదారాలున్న వారు పాలకమండలి నియమకాలకు అర్హులు కారని ధర్మాసనం స్పష్టం చేసింది. సభ్యుల నియమకాలలో ఇతర ప్రయోజనాలున్నాయని అనుమానం వ్యక్తం చేసిన సిజే..తుది తీర్పులో దీనిపై కఠినంగా వ్యవహారిస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 19కి విచారణ వాయిదా వేసింది కోర్టు. కోర్టు ఇచ్చిన తీర్పుపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కోర్టు తీర్పు పూర్తిపాఠం ఇంకా చూడలేదన్నారు. ఈ కేసు విషయం సీఎం దృష్టికి తీసుకెళుతామని చెప్పారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Tirumala, Ttd news, YV Subba Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు