హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

TTD Budget: టీటీడీ చరిత్రలో రికార్డు స్థాయి వార్షిక బడ్జెట్.. ఫిబ్రవరిలోనే ఆమోదం.. ఎన్నికల కోడ్ అడ్డంకి..

TTD Budget: టీటీడీ చరిత్రలో రికార్డు స్థాయి వార్షిక బడ్జెట్.. ఫిబ్రవరిలోనే ఆమోదం.. ఎన్నికల కోడ్ అడ్డంకి..

తిరుమల తిరుపతి దేవస్థానం (ఫైల్)

తిరుమల తిరుపతి దేవస్థానం (ఫైల్)

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఎన్నికల కోడ్ కారణంగా బడ్జెట్ ఆమోదించినా..? వివరాలు బయటపెట్టలేదు. అయితే మొత్తం బడ్జెట్ ఎంతో తెలుసా..?

  • News18 Telugu
  • Last Updated :
  • Tirumala, India

GT Hemanth Kumar, Tirupathi, News18

TTD Budget:  ప్రపంచంలో అత్యంత ఆదాయం కలిగిన దేవస్థానాల్లో తిరుమల (Tirumala) ఒకటి అనడంలో ఎలాంట సందేహం లేదు. అయితే ఈ సారి దేవస్థానం బడ్జెట్ కూడా రికార్డు స్థాయిలో నిలించింది. ఊహించని స్థాయిలో ఈ  ఏడాది భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam).  2023-24 సంవత్సరానికి 4411 కోట్ల రూపాయల అంచనాతో టీటీడీ పాలక మండలి బడ్జెట్ కు ఆమోదం తెలిపినట్లు టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి (YV Subbareddy) ప్రకటించారు. బుధవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మంతో కలిసి టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా  మాట్లాడిన ఆయన  గత నెల 15వ తేదిన పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. అయితే  ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల కారణంగా పాలకమండలి నిర్ణయాలు బహిర్గతం చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

2023-24 సంవత్సరానికి  4411 కోట్ల అంచనాతో బడ్జెట్ కు టిటిడి పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు.  ఏప్రిల్ చివరి కల్లా శ్రీనివాస సేతు ప్రారంభించి, భక్తులకు అందుబాటులో తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఆన్ లైన్ సేవలను ఇకపై నిరంతరాయంగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. శ్రీవారి భక్తులు సౌకర్యార్థం  5.25 కోట్ల వ్యయంతో అదనపు లడ్డు కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

తమిళనాడు రాష్ట్రం, ఉల్లందూర్ పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అదనంగా 4 కోట్లు కేటాయింపు గానూ పాలక మండలి ఆమోదం తెలిపిందని, అంతే కాకుండా తిరుపతిలోని యస్.జీ.ఎస్ ఆర్ట్స్ కళాశాలలో అదనపు భవన నిర్మాణాలకు  4.71 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.. ఇక ఒంటిమిట్టలో ఏప్రిల్ 5న శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణంను వైభవంగా నిర్వహించనున్నాంమని, కళ్యాణోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి : గంటా రాజీనామా ఆమోదం..? ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ రివర్స్ షాక్..!

ఏఫ్రిల్, మే, జూన్ మాసాల్లో భక్తులు రద్దీ దృష్యా వీఐపీ సిఫార్సు లేఖలు జారి చేసే వారు నియంత్రణ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.. విఐపీ బ్రేక్ దర్శనాల సమయం మార్పు విధానాన్ని అలాగే కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు.. డిసెంబర్ కల్లా చిన్నపిల్లల ఆసుపత్రిని ప్రారంభిస్తాంమని, త్వరలోనే బాలాజి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీని సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభిస్తాంమని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయని టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి తెలియజేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Tirumala tirupati devasthanam, Ttd news

ఉత్తమ కథలు