Home /News /andhra-pradesh /

AP POLITICS THREE YCP MPS WILL READY TO JOIN TELUGU DESAM PARTY THIS IS THE LIST NGS

AP Politics: ఆ ముగ్గురు అధికార పార్టీ ఎంపీలు తెలుగుదేశం వైపు చూస్తున్నారా? ఆ లిస్టులో ఎవరున్నారంటే?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

AP Politics: ఆంధ్రప్రేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లో కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా త్వరలోనే వలసలు భారీగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే అధికార పార్టీ నుంచి కీలక నేతలు తెలుగు దేశంలో చేరుతారంటూ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ లిస్టులో తాజాగా ముగ్గురు ఎంపీలు కూడా ఉన్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
  Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లో ఉన్నాయి. ప్రధాన పార్టీలన్నీ జనం బాట పడుతున్నాయి. ఇతర పార్టీలతో పోల్చుకుంటే తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఫుల్ జోష్ లో ఉంది. మహనాడు (Mahanadu) సక్సెస్ పార్టీలో కొత్త ఉత్సాహం తెప్పించింది. అందుకే మొన్నటి వరకు వైసీపీ (YCP) లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొందరు నేతలు.. జనసేన (Janasena) లేదా బీజేపీ (BJP) లోకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నా.. తాజాగా వారు రూటు మార్చుకుని టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.  ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేలతో ఎంపీలకు సమస్యలు ఉన్నాయని తెలిసినా సీఎం జగన్ (CM Jagan) పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కొందరి నేతల్లో ఉంది. అందుకే వారంతా తెలుగు దేశం తలుపులు తట్టేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం ఉంది.

  ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు ఎంపీలు తెలుగుదేశం పార్టీవైపు చూస్తున్న‌ట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నిక‌ల్లో పొత్తులు ఉంటాయ‌ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు స్ప‌ష్టం చేయ‌డంతో విజ‌యావ‌కాశాలుంటాయ‌న్న ఆలోచ‌న కూడా వారిని తెలుగుదేశంవైపు చూసేలా ప్రేరేపిస్తోందని అనుచరలు అంటున్నారు. ప్రస్తుతం న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వైసీపీ రెబెల్ ఎంపీగా కొన‌సాగుతున్నారు. పార్టీ ప‌రంగా ఆయ‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌డానికి సాంకేతిక ఇబ్బందులు ఉండ‌టంతో వైసీపీ కూడా మౌనం వ‌హించింది. ఆయ‌న పార్టీమార‌డం ఖాయం. 

  తెలుగుదేశం పార్టీలోకి వ‌స్తారంటూ ఆయ‌న అనుచరులు చెబుతున్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా జ‌రిగే ప్ర‌తి కార్య‌క్ర‌మానికి ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా మ‌ద్ద‌తిస్తున్నారు. రెండున్న‌ర సంవ‌త్స‌రాల నుంచి నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉన్న ర‌ఘురామ ప్ర‌ధాన‌మంత్రి ప‌ర్య‌ట‌న సందర్భంగా త‌న నియోజ‌క‌వ‌ర్గానికి రాబోతున్నారు. ఆయ‌న పార్టీ మార‌డం ఖాయం తేలిపోయింది. అయితే మొదట బీజేపీలో చేరుతారనే ప్రచారం ఉన్నా.. జనసేన టీడీపీ పొత్తు ఉంటే.. తెలుగు పార్టీనే తనకు సరైన ఫ్లాట్ ఫాం అని ఆయన భావిస్తున్నారు. దాదాపుగా తెలుగుదేశం పార్టీలోనే చేరి న‌ర‌సాపురం నుంచి పోటీచేయ‌బోతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

  ఇదీ చదవండి : మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లికి సిద్ధపడ్డ భర్త.. ఆమె ఏం చేసిందంటే?

  మరోవైపు అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు లావు కృష్ణ‌దేవ‌రాయ‌లు.. సాధారణంగా న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు కృష్ణ‌దేవ‌రాయ‌లు అంద‌రినీ క‌లుపుకుపోయే మ‌న‌స్త‌త్వం ఉన్న వ్య‌క్తి గుర్తింపు ఉంది. కానీ ఆయ‌న‌ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు మాత్రం ఆయ‌న్ను క‌లుపుకుపోవ‌డంలేదు. ముఖ్యంగా విడుద‌ల ర‌జ‌ని (చిల‌క‌లూరిపేట‌), బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు (వినుకొండ‌)తో ఆయ‌న‌కు నిత్యం వివాదాలు ఎదురవుతున్నాయి. ఇత‌ర ఎమ్మెల్యేలు కూడా అంటీ ముట్ట‌న‌ట్లుగా ఉంటున్నారు. ఇటీవ‌ల బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు నిర్వ‌హించిన సామాజిక న్యాయ‌భేరి బ‌స్సు యాత్ర‌కు, న‌ర‌స‌రావుపేట‌లో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ‌కు ఆయ‌న దూరంగా ఉన్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ పార్టీ ప‌రంగా ఎటువంటి మ‌ద్ద‌తు ల‌భించ‌క‌పోవ‌డంతో ఆయ‌న పార్టీ మార‌డం దాదాపుగా ఖాయ‌మైన‌ట్లేన‌ని సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌లు భావిస్తున్నారు.

  ఇదీ చదవండి : సినిమాలకు పవన్ గుడ్ బై.. జనసేనాని వ్యూహం అదేనా..?

  ప్రోటోకాల్ వివాదాల‌తో మరో ఎంపీ మాగుంట అసంతృప్తి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి ఎంపీగా ఎన్నికైన‌ప్ప‌టి నుంచి అసంతృప్తితోనే ఉన్నారు. ఎమ్మెల్యేలు లెక్క‌చేయ‌క‌పోవ‌డం, ప్రోటోకాల్ వివాదాలుండ‌టంతోపాటు గ‌త ఎన్నిక‌ల్లో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే ఆయ‌న వైసీపీలో చేరాల్సి వ‌చ్చింద‌ని శ్రీ‌నివాస‌రెడ్డి అనుచ‌రులు చెబుతున్నారు. ఆయ‌న పార్టీ మార‌డం లాంఛ‌న‌మేన‌ని చెబుతున్నారు. ఒంగోలు నుంచి రాబోయే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిగా పోటీచేసే అవ‌కాశం ఉన్న‌ట్లు రాజ‌కీయ‌వేత్త‌లు విశ్లేషిస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, TDP, Ycp

  తదుపరి వార్తలు