Home /News /andhra-pradesh /

AP POLITICS THIS SWAMY JI LOOKING TO JOIN PAWAN KALYAN JANASENA PARTY AFTER FAILING IN TELANGANA POLITICS FULL DETAILS HERE PRN GNT

AP Politics: జనసేనలో చేరనున్న ప్రముఖ స్వామిజీ..? ఆ నియోజకవర్గంపై కన్ను..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

AP Politics: దేశ రాజకీయాలలో చాలా మంది స్వామిజీల పాత్ర ఉంటుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాలిటిక్స్ లో ఉంటుంటారు స్వామిజీలు. కొన్ని పార్టీలకు వారి సహాయ సహకారాలుంటాయి. దేశంలోనే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక స్వామిజీ.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India
    Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

    దేశ రాజకీయాలలో చాలా మంది స్వామిజీల పాత్ర ఉంటుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాలిటిక్స్ లో ఉంటుంటారు స్వామిజీలు. కొన్ని పార్టీలకు వారి సహాయ సహకారాలుంటాయి. దేశంలోనే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక స్వామిజీ. అలానే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వం ఏర్పాటు చేయుటలో తన పాత్ర ఉందని తన శక్తిసామర్ధ్యాలను దారపోశానని బాహాటంగానే వెల్లడించారు విశాఖపట్నం (Visakhapatnam) కు చెందిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి జీ. ఐతే యూపీకి యోగీ ఎలాగో.. తెలంగాణకు తాను అలాగేనంటూ ఓ స్వామీజి గతంలో రంగంలోకి దిగారు. 2019లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పార్టీ అధికారంలోకి రాలేదు. అక్కడ రాజా సింగ్ తప్పితే బీజేపీ ఎక్కడ గెలవలేక పోయింది.

    ఐతే తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న స్వామీజి ఇప్పుడు ఏపీపై కన్నేశారన్న ప్రచారం జరుగుతోంది. ఐతే ఈసారి బీజేపీ (BJP) నుంచి పోటీ చేసినా గెలవలేమని డిసైడ్ అయ్యారట.. పోని టీడీపీ (TDP) వైపు వెళ్దామా అంటే గతంలో ఆయనకు.. ఆ పార్టీకి మధ్య పెద్ద మేటరే నడిచింది. దీంతో అటువైపు కూడా వెళ్లలేకపోతున్నారు. ఇక అధికార వైసీపీ (YSRCP) లోకి వెళ్దామా అంటే ఆయనకు పెద్దగా ప్రాధాన్యం దక్కదని మథనపుడుతున్నారు. దీంతో ఆయన నాలుగో ప్రత్యామ్నాయం అయిన జనసేన పార్టీ (Janasena Party) వైపు చూస్తున్నారట.

    ఇది చదవండి: ఆ నెల రోజులు తిరమలకు రాకపోవడమే మంచిది.. భక్తులకు టీటీడీ కీలక సూచన.. కారణం ఇదే..!


    జనసేనలో చేరితే ఎలా ఉంటుంది..? చేరిన తర్వాత ఎక్కడ నుంచి పోటీ చేయాలి..? ఎక్కడైతే గెలుస్తాం.. డబ్బులెంత ఖర్చు చేయాలనే దానిపై ఆయన తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జనసేన నాయకత్వంతో సంప్ర‌దింపులు, రాయ‌బారాల కోసం అన్ని ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నారు.


    ఇది చదవండి: ఢిల్లీలో ఛాన్స్ వదులుకోని చంద్రబాబు.. ఆ సామెతను నిజం చేయబోతున్నారా..?


    తాను ఎక్కడ నుంచి బరిలో దిగాలనుకుంటున్నదనీ కొద్దీ రోజులలో నిర్ణయించుకొని.. వచ్చే ఎన్నికలకు ప్రణాళిక రూపొందించే పనిలో స్వామిజి ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి స్వామిజీ ముఖ్యమంత్రి పదవి నుండి తన స్థానం థానే గెలుపొందేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు స్వామిజి ని ఆదరించి స్వామీజీని శాసనసభలో అడుగుపెట్టే వస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి. ఇంతకీ స్వామీజీ రాకను జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతిస్తారా..? ఇంతకీ నిజంగానే సదరు స్వామిజీ పవన్ తో నడవాలనుకుంటున్నారా..? ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత..? ఒకవేళ సదరు స్వామిని చేర్చుకుంటే జనసేనపై ఎలాంటి ప్రభావం పడుతుందనేదానిపై చర్చ జరుగుతోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు