Home /News /andhra-pradesh /

AP POLITICS THIS IS THE PRIME MINSTER MODI GAME PLAN ON ANDHRA PRADESH POLITICS NGS

Modi-jagan-Chandrababu: పవన్ తో పొత్తు.. చంద్రబాబుతో టీ.. జగన్‌తో లంచ్.. ఏపీపై మోదీ గేమ్ ప్లాన్ ఇదేనా?

చంద్రబాబుతో టీ, జగన్ తో లంచ్

చంద్రబాబుతో టీ, జగన్ తో లంచ్

Modi-jagan-Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. ముఖ్యంగా ఏపీలో పార్టీలపై కేంద్ర వైఖరి చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం ఏపీలో ఉన్నవి ప్రధాని మూడు రాజకీయ పార్టీలు.. అయితే ఇటు అధికార వైసీపీతో భాయ్ భాయ్ అంటోంది మోదీ.. టీడీపీకి దగ్గర అవుతోంది. మరోవైపు పవన్ తో పొత్తు పెట్టుకుంటోంది.. దీంతో మోదీ ప్లాన్ ఏంటి అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Delhi, India
  Modi-jagan-Chandrababu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్య పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యల తరువాత.. రాబోయే ఎన్నికలకు టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కలిసి వెళ్తాయనే ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని బీజేపీ నేతలు ఖండించారు.. తాము వైసీపీ, టీడీపీకి సమాన దూరం పాటిస్తున్నామని.. పదే పదే చెబుతూ వచ్చారు. అదే స్థాయిలో చంద్రబాబు పై తీవ్ర విమర్శలు కూడా చేశారు. మరోవైపు కేంద్ర పెద్దలకు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అంటే కోపం ఉందని.. అందుకే ఆయనతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదన్నారు.. అదే సమయంలో సీఎం జగన్ (CM Jagan) కు పదే పదే అపాయింట్ మెంట్ ఇస్తూ ఉండడంతో.. జగన్ పై బీజేపీ ప్రత్యేక ప్రేమ చూపిస్తోందనే ప్రచారం కూడా ఉంది.. అందుకే టీడీపీ-బీజేపీలతో కలిసి ఎన్నికలకు సిద్ధమవ్వాలనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ఆదిలోనే బీజేపీ బ్రేక్ వేసింది..

  కానీ ఆదివారం ఢిల్లీలో పరిణామాలు చూసిన తరువాత.. పరిస్థితి పూర్తిగా మారినట్టు కనిపిస్తోంది. కేంద్రం ఎలాంటి ప్లాన్ తో ముందుకు వెళ్తోంది అన్నది ఆసక్తికరంగా మారింది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minster Narendra Modi) అధ్యక్షతన ముగిసిన రెండు కార్యక్రమాలు- ఏపీ రాజకీయాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి జగన్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హాజరయ్యారు.  ఈ రెండు కార్యక్రమాల్లో ప్రధానిని వేర్వేరుగా కలిశారు జగన్, చంద్రబాబులు. 

  ఇక్కడ ఏపీపై ప్రధాని మోదీ వైఖరి ఏంటి అన్నది ఆసక్తి పెంచుతోంది ఎందుకంటే.. ఇటే జనసేన తో కలిసే వచ్చే ఎన్నికలకు వెళ్తామని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. అందులో వెనుకడుగే లేదంటున్నారు. అటు ఢిల్లీలో ప్రధాని మోదీ అయితే చంద్రబాబుతో కలిసి టీ తాగుతూ ప్రత్యేకంగా మాట్లాడారు.. మరోవైపు సీఎం జగన్ తో లంచ్ చేసి.. ఆయనతోనూ చాలా ఆప్యాయంగా మాట్లాడరు.. ఇలా మూడు పార్టీలకు ప్రధాని సమాన ప్రధాన్యత ఇవ్వడం వెనుక ఆయన వ్యూహం ఏంటన్నది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  ఢిల్లీలో జరిగిన రెండు కార్యక్రమాలకూ దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెప్టినెంట్ గవర్నర్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే నాయకులు తిరుచ్చి శివ సహా వేర్వేరు పార్టీల నాయకులు హాజరయ్యారు. వారందరినీ మోడీ ఆప్యాయంగా పలకరించారు. అయితే అందరితో మాట్లాడని మోదీ.. చంద్రబాబును మాత్రం ప్రత్యేకంగా పక్కకు తీసుకెళ్లి మరి మాట్లాడారు.. మరోసారి కలుద్దామంటూ చెప్పారు.  ఇదీ చదవండి : హస్తినలో సీఎం జగన్ కు పెరుగుతున్న ప్రాధాన్యత పెరిగిందా? మోదీ లంచ్ భేటీ లెక్క ఏంటి?

  ఇటు నీతి ఆయోగ్‌ గవర్నింగ్ కౌన్సిల్ పాల్గొన్న ముఖ్యమంత్రులు, లెప్టినెంట్ గవర్నర్లతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గవర్నింగ్ కౌన్సిల్ భేటీ ముగిసిన తరువాత వారకి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్‌తో పాటు అస్సాం, రాజస్థాన్ ముఖ్యమంత్రులు హిమంత బిశ్వ శర్మ, అశోక్ గెహ్లాట్‌, జమ్మూ కాశ్మీర్, లఢక్ లెప్టినెంట్ గవర్నర్లు మనోజ్ సిన్హా, రాధాకృష్ణ మాథుర్‌ కూర్చున్న టేబుల్ వద్ద మోదీ చాలా సేపు గడపడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అందులోనూ సీఎం జగన్ తో ఎక్కవ సేపు మాట్లాడడం.. ఆయన భుజం తట్టి మరి అభినందించడం హాట్ టాపిక్ గా మారింది. 

  ఇదీ చదవండి : భర్తను బతికిస్తానని సోది చెప్పిన వ్యక్తి వలలో పడ్డ మహిళ.. చివరకు ఏం జరిగిందంటే?

  తాజా పరిణమాలు చూస్తుంటే.. ఏపీ రాజకీయాలపై బీజేపీ పెద్దలు ప్రత్యేక ప్లాన్ తో ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. జనసేనతో పొత్తు కొనసాగిస్తూ.. ఆ పార్టీతో కలిసే 2024 ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడంతో.. ఏ పార్టీ అవసరం ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అందుకే రెండు పార్టీలకు దూరంగా ఉండకూడదని.. ఏ పార్టీ అయితే ఎన్నికల్లో గెలుస్తోందో.. ఆ పార్టీకి మద్దతుగా ఉండడమే మేలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు అప్టి సర్వేలు నివేదికలు ఆధారంగా.. ఎవరితో కలిసి వెళ్లాలి అన్నది నిర్ణయం తీసుకుంటారని... అప్పటికే నివేదిక హోరా హోరీ ఉందని చెబితే.. కేవలం జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లి.. మిగిలిన రెండు పార్టీలకు సమాన దూరంగా ఉండి.. ఫలితాలు వచ్చిన తరువాత.. గెలిచిన పార్టీకి అండగా ఉంటే బెటరనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Narendra modi

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు