GT Hemanth Kumar, News18, Tirupati
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇప్పుడు ఎక్కడ చూసినా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) గురించే చర్చ జరుగుతోంది. గురువారం ప్రస్తుత కేబినెట్ చివరి సమావేశం జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆశావాహును కూడా తమ పేరు ప్రకటిస్తారన్న నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఏర్పడిన కొత్త జిల్లాల సమీకరణాలు కలిసి వస్తాయని మరికొందరు భావిస్తున్నారు. ఇదే లిస్టులో ఉన్నారువైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా (MLA Roja). ఇటీవల ఆమె వరుసపెట్టి దేవాలయాల సందర్శనం చేసేస్తున్నారు. చిత్తూరు నుంచి కాశీ వరకు వివిధ దేవాలయాలను నెల వ్యవధిలోనే చుట్టేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయాలను సందర్శించిన మాట అటుంచితే ఆమెకు మంత్రి పదవి కట్టబెడుతారన్న వాదనకు ఆ ఒక్క అంశం బలమైన కారణంగా మారుతోంది. మహిళా ఎమ్మేల్యేలలో రోజాకు అగ్రస్థానం సీఎం జగన్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
జిల్లాల పునర్విభజణలో నగరి నియోజకవర్గంలో కొన్ని మండలాలు తిరుపతిలోను., మరి కొన్ని మండలాలు చిత్తూరు జిల్లాలోవిభజించ బడ్డాయి. దీంతో నగరి నియోజకవర్గం మొత్తం తిరుపతి జిల్లాలో చేర్చాలని రోజా సీఎం జగన్ కు విన్నవించారు. ఏమైందో ఏమో గానీ.. నగరి రెవెన్యూ డివిజన్ గా., పుత్తూరు మరి కొన్ని మండలాలు తిరుపతి జిల్లాలో చేర్చారు. ముందు నుంచి అభ్యంతరాలు తెలిపిన రోజా మాత్రం సైలెంట్ అయ్యారు. అందుకు కారణం మంత్రి పదవేనని తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మంత్రి వర్గ విస్తరణలో రోజాకు నిరాశే ఎదురైంది. జిల్లాలో వైసీపీ విజయానికి అంతా తానై నడిపించిన పెద్దిరెడ్డితో పాటుగా అనూహ్య రీతిలో నారాయణ స్వామికి డిప్యూటీ సీఎం పదవి వరించింది. అప్పట్లో రోజా అలకబూనినట్లు ప్రచారం జరిగింది. తాజాగా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో రోజా ఆశలు పదిలం చేసుకొనేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. పునర్విభజన నేపథ్యంలో రెండు జిల్లాలో నగరి నియోజకవర్గం ఉండటంతో రోజా ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో ఒకటి చిత్తూరు జిల్లాలో ఉండి నగరి రెవెన్యూ డివిజన్ ను సాధించగా.., తిరుపతి జిల్లాల్లో కొన్ని మండలాలు ఉండటంతో ఆ జిల్లా కోటాలో మంత్రి పదవి ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డిని కాదని రోజాకు మంత్రి పదవి ఇవ్వలేని పరిస్థితి. ఇక తిరుపతి జిల్లా అయితే రోజాకు అడ్డువచ్చే నాయకులే లేరు. దీంతో రెండు జిల్లాలో కలసి ఉండటం రోజాకు మంచిది అని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోందట. మంత్రి పదవి కచ్చితంగా వస్తుందన్నా క్లారిటీతోనే నియోజకవర్గంలో వరాల జల్లు కురిపిస్తున్నారట.
నగరిలో ఎన్నడూ లేని విధంగా జాబ్ మేళాను నిర్వహించారు. ఉద్యోగం లేని యువతకు సువర్ణ అవకాశం అంటూ భారీ ఎత్తున ఈ జాబ్ మేళ నిర్వహించారు. ఇక గర్భిణీ స్త్రీలకూ సామూహిక సీమంతాలు నిర్వహించారు. గతంలో సత్రవాడకు ఆర్టీసీ బస్సు సర్వీస్ లేకుంటే.., అక్కడకు బస్సు ఏర్పాటు చేసి.., సర్వీస్ ప్రారంభించారు. ఇక పౌష్ఠిక ఆహారం., దత్తత గ్రామంలో మేఘ మెడికల్ క్యాంప్ నిర్వహించి ఔరా అనిపించారు. రోజాకు మాత్రం మంత్రి పదవి వస్తుందా రాదా అనే విషయానికి ఒకటి రెండు రోజుల్లో ఫుల్ స్టాప్ పడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP cabinet, MLA Roja