Home /News /andhra-pradesh /

AP POLITICS THESE ARE THE NEW MINSTERS LIST ALMOST CM JAGAN FINAL THE LIST WHO WILL BE GET CHANCE NGS

AP Cabinet list: సామాజిక వర్గాల వారిగా జాబితా ఖరారు.. ఏపీలో కొత్త మంత్రులు వీరే..

ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ (ఫైల్)

ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ (ఫైల్)

AP Cabinet List: ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రి వర్గ జాబితా సిద్ధమైందా..? పాత మంత్రుల్లో కొనసాగుతున్నది ఎవరు..? ఏ సామాజిక వర్గాలకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు. మహిళా మంత్రులు ఎంతమందికి అవకాశం ఉంది.. రెడ్డి సమాజిక వర్గానికి ఈ సారి పెద్ద పీట వేస్తారా..?

ఇంకా చదవండి ...
  AP Cabinet List: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మంత్రి వర్గ విస్తరణకు సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది జులై లోపే కొత్త మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం పూర్తి కానుంది. అధికారికంగా తేదీ ప్రకటించకపోయినా.. మంత్రివర్గ మార్పులపై సీఎం జగన్ మోహన్ రెడ్డి  (CM Jagan Mohan Reddy) క్లారిటీ ఇచ్చారు.  రాజీనామాలకు సిద్ధమవ్వాలని మంత్రులకే స్వయంగా చెప్పేశారు.. అయితే మంత్రి పదవి పోయిందని ఎవరూ నిరాశకు గురి కావొద్దన్నారు. పార్టీ బాధ్యతలు అప్పచెబుతానని స్పష్టం చేశారు. మళ్లీ పార్టీ విజయానికి అంతా కష్టపడాలని సూచనలు చేశారు. అలాగే ఈ సారి మంత్రి పదవులకు భారీగా పోటీ ఉందని.. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటానని సీఎం స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే చాలా మంత్రుల్లో టెన్షన్ మొదలైంది.. తమ పదవి పోయినట్టేనా అని మదన పడుతున్నారు. అయినా మళ్లీ మంత్రి పదవి నిలబెట్టుకునే దిశగా లాబీయింగ్ మొదలు పెట్టారు. మరోవైపు సీనియర్ నేతలు మరికొందరు ఈ సారి ఎలాగైనా తమకు మంత్రి పదవి దక్కేలా చూడాలని తాడేపల్లి గూడెం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎవరి ఆశలు.. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా.. సీఎం జగన్ మాత్రం ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికలే టార్గెట్ గా జంబో టీంను రెడీ చేస్తున్నట్టు సమాచారం.. దీంతో ఈ సారి పూర్తి స్థాయి కేబినెట్ ను రెడీ చేసినట్టు తెలుస్తోంది..

  సరిగ్గా రెండున్నరేళ్ల తరువాత మంత్రి వర్గ మార్పు ఉంటుందని గతంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల కొంత మంది మంత్రులను కూడా రాజీనామా చేయాల్సిందిగా ఆయన కోరారు. అయితే అప్పటికే ఆయన ఓ క్లారిటీకి వచ్చిన సమాచారం.. అయితే కసరత్తు కూడా దీనికి సంబంధించి చాలా కసరత్తు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా సామాజిక సమీకరణాల కోణంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అది కూడా నియోజకవర్గాల వారీగా రిపోర్ట్ లు తెప్పించుకున్న తరువాతే.. ఆయన దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అందులో భాగంగా సామాజిక వర్గాలు, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మంత్రి వర్గాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీని నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

  ఇదీ చదవండి : నగరిలో అందరి చూపు ఆమెపైనే.. తమ పార్టీ తరపున పోటీ చేయాలని ఆహ్వానం.. ఆమెకు ఓకేనా..?

  పాత మంత్రి వర్గంలో కొనసాగా మంత్రుల జాబితా ఇదే.. !
  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  బొత్స సత్యనారాయణ
  బుగ్గన రాజేంద్ర రెడ్డి
  కొడాలి నాని
  పేర్ని నాని
  ఈ ఐదుగురు లేదా.. కనీసం నలుగురు తిరిగి మంత్రి పదవులు దక్కించుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

  సామాజిక వర్గాల వారిగా చూస్తే.. వీరంతా మంత్రి పదువులు దక్కించుకునే అవకాశం ఉంది..
  ఎస్టి సామాజిక వర్గం నుండి..!
  రాజన్న దొర,
  తెల్లం బాలరాజు
  కొట్టు భాగ్యలక్ష్మి
  చెట్టి పాల్గుణ

  ఇదీ చదవండి : టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాక్.. వారిపైనే అనుమానం ఉందంటున్న నేతలు

  ఎస్సీ సామాజిక వర్గం నుండి.
  పండుల రవీంద్ర బాబు
  గొల్ల బాబురావు
  తలారి వెంకట్రావు
  మేరుగు నాగార్జున
  వరప్రసాద రావు
  కోరుముట్ల శ్రీనివాస్
  తోగురు అర్థర్

  ఇదీ చదవండి : పొత్తులపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎంపీ.. వచ్చేది బీజేపీ సర్కారే అంటూ సంచలన వ్యాఖ్యలు

  కాపు సామాజిక వర్గం నుండి.
  దాడిశెట్టి రాజా
  జక్కంపూడి రాజా
  గ్రంధి శ్రీనివాస్
  సామినేని ఉదయభాను
  అంబటి రాంబాబు
  తోట త్రిమూర్తులు
  కరణం ధర్మశ్రీ

  బీసీ సామాజిక వర్గం నుండి.
  కొలుసు పార్థసారథి
  ధర్మాన ప్రసాదరావు
  తమ్మినేని సీతారాం
  జోగి రమేష్,
  పొన్నాడ సతీష్
  కారుమూరి వెంకట
  రమణ నాగేశ్వరావు,
  వంశీకృష్ణ శ్రీనివాస్

  ఇదీ చదవండి : మమత మాటల వెనుక పీకే ఉన్నారా..? టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయా..?

  మైనార్టీ సామాజిక వర్గం నుండి.
  హాఫీజ్ ఖాన్,
  రుహుల్ల

  ఇదీ చదవండి : భర్తతో కలిసి రోజా వ్యాయామాలు చూశారా..? ఫులో జోష్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్

  క్షత్రియ సామాజిక వర్గం నుండి.
  ముదునూరి ప్రసాద్ రాజు

  ఇదీ చదవండి : ఏపీలో చంద్రబాబు పెగాసస్ రచ్చ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం ఆమోదం.. ఏం జరుగుతోంది..

  మహిళల నుండి
  రెడ్డి శాంతి
  ఆర్ కే రోజా రెడ్డి
  విడుదల రజిని
  జొన్నలగడ్డ పద్మావతి
  విశ్వాసరాయి కళావతి
  మేకపాటి గౌతమ్ రెడ్డి (భార్య శ్రీ కీర్తి)

  ఇదీ చదవండి : 2 తలల పాము ఇంట్లో ఉంటే కుబేరులవుతారా..? అందులో నిజమెంత..? ప్రమాదకరం కాదా..?

  రెడ్డి సామాజిక వర్గం నుండి.
  ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
  గండికోట శ్రీకాంత్ రెడ్డి
  నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
  భూమన కరుణాకర్ రెడ్డి
  కాకాని గోవర్ధన్ రెడ్డి
  అనంత వెంకట రామిరెడ్డి
  తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
  ఆళ్ల రామకృష్ణారెడ్డి
  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

  దాదాపు ఈ జాబితా నుంచే మంత్రులు ఉండే అవకాశం ఉంది.. ఇంకా మంత్రి వర్గ విస్తరణకు సమయం ఉండడంతో.. కాస్త మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, AP News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు