AP POLITICS THESE ARE FINAL LIST IN ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY CABINET THEY WILL TAKE OATH TOMORROW NGS GNT
AP Cabinet Final List: సీఎం జగన్ కొత్త కేబినెట్ ఇదే.. వారికే ఈ సారి అధిక ప్రాధాన్యం.. వాళ్లకు తప్పని నిరాశ
సీఎం వైఎస్ జగన్ (ఫైల్)
AP Cabinet Final List: సుదీర్ఘ కసరత్తు తరువాత సీఎం జగన్.. తన కేబినెట్ కూర్పును ఫైనల్ చేశారు. ఈ సారి బడుగు బలహీన వర్గాలకే కేబినెట్ లో పెద్ద పీట వేశారు. ముఖ్యంగా సామాజిక సమీకరణాలను ప్రమాణికంగా తీసుకున్నారు. సీఎం జగన్ కేబినెట్ లో చేరుతున్న మంత్రుల ఫైనల్ లిస్ట్ ఇదే..
AP Cabinet Final List: సుదీర్ఘ కసరత్తు తరువాత.. మంత్రుల జాబితాను సీఎం జగన్ (CM Jagan) ఫైనల్ చేశారు. తాజాగా ఎంపికైన మంత్రులకు.. సీఎంఓ నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకే సీఎం జగన్ పెద్ద పీట వేసినట్టు వైసీపీ (YCP) వర్గాలు చెబుతున్నాయి. అలాగే పాత వారిలో అనుభవం రీత్యా కొందరిని, సామాజిక సమీకరణాల నేపథ్యంలో మరికొందర్నీ కొనసాగిస్తున్నారు. మొత్తం 25 మందికి తన కేబినెట్ లో అవకాశం కల్పించారు. పాతవారిలో 10 మందిని కొనసాగించి.. కొత్తగా 15 మందికి అవకాశం ఇచ్చారు. అయితే అత్యధికంగా బీసీ వర్గానికి 10 బెర్తులు కేటాయించారు సీఎం జగన్. సామాజిక సమీకరణల ప్రకారం చూసుకుంటే బీసీ 10, కాపు 4, రెడ్డి 4, ఎస్సీ 5, ఎస్టీ 1, మైనార్టీ 1 అవకాశం కల్పించారు. ఈసారి కేబినెట్ లో నలుగురు మహిళలకు చోటిచ్చారు.
తొలి కేబినెట్ లో పని చేసిన వారిలో.. బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayna ), పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి (Peddireddy Ramachandra Reddy), బుగ్గన రాజేంద్రనాథ్ (Buggana Rajendranath), పినెపీ విశ్వరూప్ (P Viswarup), జయరామ్ (Jayaram), వేణుగోపాల్ (Venugopal), అప్పలరాజు (Appalaraju), అంజాద్ బాషా (Amzad Bhasa), నారాయణ స్వామి ( Narayana Swamy), ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh), తానేటి వనిత (Taneti Vanitha)ను కొత్త కేబినెట్లోకి తీసుకున్నారు.
తీవ్ర తర్జన భర్జనల మధ్య.. సామాజిక, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొత్తగా వీరికి మంత్రి వర్గంలో జగన్ అవకాశం కల్పించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు (Darmnana Prasada Rao), సాలూరు నుంచి రాజన్నదొర (Rajanna Dora), అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాధ్ (Amarnath), మాడుగల నుంచి బి. ముత్యాల నాయుడు ( Muthyala Naidu) తుని నుంచి దాడిశెట్టి రాజా (D Raja), తణుకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు (Nageswara Rao), తాడపల్లి నుంచి కొట్టటు సత్యనారాయణ (Kottu Satyanarayan) పెడన నుంచి జోగి రమేశ్ (Jogi Ramesh), చిలకలూరిపేట నుంచి విడదల రజిని (Vidudala Rajani), నగరి నుంచి ఆర్కే రోజా (Rk Roja), సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు (Ambati Rambabu) వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున (M Nagarjuna), సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhana Reddy), అనంత పురం నుంచి ఉషశ్రీ (Usha Sri), తిప్పే స్వామి (Tippe Swamy)లకు జగన్ కేబినెట్లో అకాశం కల్పించారు.
విశాఖపట్నం జిల్లా
పూడి ముత్యాల నాయుడు
గుడివాడ అమర్నాథ్
తూర్పుగోదావరి జిల్లా
దాడిశెట్టి రాజా
పినిసే విశ్వరూప్
చెల్లుబోయినవేణుగోపాల్
పశ్చిమగోదావరి జిల్లా
కారుమూరి నాగేశ్వరరావు
తానేటి వనిత
కొట్టు సత్యన్నారాయణ
కృష్ణా జిల్లా
జోగి రమేష్
గుంటూరు జిల్లా
విడదల రజనీ
అంబటి రాంబాబు
మెరుగు నాగార్జున
ప్రకాశం జిల్లా
ఆదిమూలపు సురేష్
నెల్లూరు
కాకాని గోవర్థన్ రెడ్డి
చిత్తూరు జిల్లా
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Rk రోజా
కడప జిల్లా
అంజాద్ బాషా
కర్నూలు జిల్లా
బుగ్గన
రాజేంద్ర నాథ్ రెడ్డి
గుమ్మనూరు జయరాం
అనంతపురం
ఉషశ్రీ చరణ్
తిప్పే నారాయణ స్వామి
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.