హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: జనసేనలో నిజంగానే కోవర్టులు ఉన్నారా..? ఏ పార్టీ వారు.. పవన్ అనుమానం ఏంటి..?

Pawan Kalyan: జనసేనలో నిజంగానే కోవర్టులు ఉన్నారా..? ఏ పార్టీ వారు.. పవన్ అనుమానం ఏంటి..?

ఆ ఎమ్మెల్యే ఆస్తులపై పవన్ విమర్శలు

ఆ ఎమ్మెల్యే ఆస్తులపై పవన్ విమర్శలు

Pawan Kalyan: ప్రజారాజ్యం పార్టీ అడ్రస్ లేకుండా పోవడానికి కట్టప్పలే కారణమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జనసేనలోను కట్టప్పలు ఎంటర్ అయ్యారని పవన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే మరి జనసేనలో కటప్ప ఉన్నారా..? ఉంటే ఎందరు ఉన్నారు..? వారు ఏ పార్టీకి చెందిన వారు..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Pawan Kalyan: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం (Prajarayam) పతనానికి కారణం ఏంటన్నది చెబుతూనే..? జనసేన (Janasena)లోనూ అలాంటి వారు ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది ఏంటంటే..? మరి జనసేనలో కట్టప్పలు ఎవరు ఉన్నారు? పార్టీ నేతలు.. శ్రేణులపై ఎన్నడూ లేనంత ఆగ్రహాన్ని జనసేనాని ఎందుకు ప్రదర్శించారు? పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్టు జనసేనలో కోవర్టులు ఉన్నారా? ఉంటే వారెవరు? అసలు ఆ అనుమానం పవన్ కు ఎందుకు వచ్చింది. అయితే చాలా ఏళ్లుగా రాజకీయాల్లో కోవర్టు ఆపరేషన్లు గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. ఈ తరహా చర్చ.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎప్పుడూ పెద్దగా లేదు.. ఆరోపణలే తప్పా.. వాస్తవం అన్నది ఎక్కడా నిరూ పణ కాలేదు. కానీ ఇప్పుడు జనసేనలో కోవర్టుల గురించి చర్చ జరుగుతోంది.


  వివిధ వేదికలపై ప్రజారాజ్యం.. ఆ పార్టీ విలీనం గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌. ఆ రోజు కొందరు కోవర్టుల వల్లే కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేయించారనేది పవన్‌ కామెంట్ల సారం. తాజాగా జరిగిన జనసేన పీఏసీ సమావేశంలో మరో కీలక అంశాన్ని కూడా పవన్‌ కల్యాణ్‌ ప్రస్తావించారు. పార్టీలో ఉండేవారు ఉండొచ్చు.. పోయేవాళ్లు పోవచ్చు.. పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడవడం కరెక్ట్ కాదని నిర్మొహమాటంగా చెప్పేశారు జనసేనాని.  అయితే పవన్ సడెన్ గా ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు. పవన్‌ కల్యాణ్‌ ప్రకటన తర్వాత జనసేనలో ఎవరు కోవర్టులు అనేది ఆసక్తిగా మారింది. ఒకరిద్దరిలో కోవర్టు తరహా ఛాయలు కన్పిస్తున్నాయన్న పవన్‌ వ్యాఖ్యలు మరింత హాట్ హాట్ గా మారాయి. అసలు పార్టీలో ఏం జరుగుతోందనే చర్చ నడుస్తోంది. పార్టీ వర్గాల నుంచి ఆయనకు కొంత ఫీడ్‌ బ్యాక్‌ వచ్చిందని.. దానిని కంట్రోల్‌ చేయడానికే గతంలో ఎన్నడూ లేని విధంగా కటువుగా మాట్లాడారని అభిప్రాయ పడుతున్నారు.


  ఇదీ చదవండి : 40 రోజులు తాడిపండ్లు తింటే మెరిసిపోతారా? ఆ వంటకాలు యమ్మీ టేస్టే కాదు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు


  ముఖ్యంగా జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఆయన ఆరాపటుడుతుంటే..? కానీ కొన్ని నియోజకవర్గాల్లో కమిటీ ఇంఛార్జులను పని చేసుకోనివ్వకుండా చాలామంది స్థానిక నేతలు పదే పదే అడ్డుపడుతున్నారట. సోషల్ మీడియాలోనూ రకరకాల ప్రచారాలు పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నారట. దాంతో కమిటీల్లోని వాళ్లు తాము పని చేయలేమని.. ఇలాగైతే కష్టమని నేరుగా పవన్‌ కల్యాణ్‌కు మొర పెట్టుకున్నారంట.. జనసేన కోసం పనిచేయలేని వారు.. పార్టీలో చేరి.. సొంతవాళ్లపైనే విమర్శలు చేస్తున్నట్టు పవన్ గుర్తించారని.. అందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చంటున్నారు.


  ఇదీ చదవండి : వర్షంలోనూ చంద్రబాబుకు నీరా‘జనం’.. నేరస్తుల పాలన చూస్తున్నాం.. మనం ఏంటో చూపిద్దామంటూ వార్నింగ్


  కానీ వారిని కట్టడి చేయడం స్థానిక నేతలకు సాధ్యం కావడం లేదంటున్నారు. ఇలా జనసేనలో చేరిన వారిలో అత్యధికమంది వైసీపీ నుంచే వచ్చారనేది పార్టీ వర్గాల వాదన. దాంతో వారిని ఉద్దేశించే పవన్‌ కల్యాణ్‌ కోవర్టు కామెంట్స్‌ చేశారని భావిస్తున్నారు. పవన్‌ అలా అన్నారో లేదో.. కోవర్టులపై సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలైంది. జనసేనలో కీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్‌ను ఉద్దేశించే జనసేనాని ఆ కామెంట్స్‌ చేశారని.. కొందరు వైరల్‌ చేస్తున్నారు. నాదెండ్ల వల్లే పార్టీ నుంచి కొందరు వెళ్లిపోయారని.. పార్టీలోకి కొత్తవాళ్లు రావడం లేదని చర్చకు తెరలేపారు.


  ఇదీ చదవండి : నేడు ఎస్టీజీ భద్రత పెంపు.. మొన్న రామోజీ, జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ.. బీజేపీ ప్లాన్ అదేనా..?


  ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్‌ కల్యాణ్‌ ఆ వ్యాఖ్యలు చేశారని విశ్లేషిస్తున్నారు. ఇందులో వాస్తవం లేదన్నది జనసేన వర్గాల వాదన. వ్యక్తిగత లాభం కోసం పార్టీలో చేరిన వాళ్లు తనను నేరుగా అనలేక నాదెండ్లను బూచిగా చూపుతున్నారని పవన్‌ ఫీలవుతున్నారట. 2019 ఎన్నికల వరకు పార్టీలో క్రియాశీలకంగా ఉండి.. ఓటమి తర్వాత వెళ్లిపోయిన వారిని పక్కన పెడితే.. జనసేనను అంటిపెట్టుకుని ఉన్న కొద్దిమందిలో నాదెండ్ల ఒకరనే సదాభిప్రాయం పవన్‌కు ఉందట. లేకపోతే ఆయన్ని పక్కన ఎందుకు కూర్చోబెట్టుకుంటారనేది పార్టీ వర్గాల ప్రశ్న.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan

  ఉత్తమ కథలు