హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhrapradesh: అమరావతి రైతులు, ప్రభుత్వ పిటీషన్ లను కలిపి విచారించిన హైకోర్టు..తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

Andhrapradesh: అమరావతి రైతులు, ప్రభుత్వ పిటీషన్ లను కలిపి విచారించిన హైకోర్టు..తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

హైకోర్టు

హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాజధానిగా అమరావతిని  (Amravati)) కొనసాగించాలని రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే సుమారు 41 రోజులు పూర్తి చేసుకున్న పాదయాత్రకు ఇటీవల బ్రేక్ ఇచ్చారు. పాదయాత్రలో ఇటీవల కోర్టు పలు ఆంక్షలను ఆదేశించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాజధానిగా అమరావతిని  (Amravati)) కొనసాగించాలని రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే సుమారు 41 రోజులు పూర్తి చేసుకున్న పాదయాత్రకు ఇటీవల బ్రేక్ ఇచ్చారు. పాదయాత్రలో ఇటీవల కోర్టు పలు ఆంక్షలను ఆదేశించింది. కేవలం 600 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే సంఘీభావం తెలిపే వాళ్లు రోడ్డుకు ఇరువైపుల ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.  ఈ క్రమంలో రైతులు పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ప్రభుత్వం రైతుల పాదయాత్రను నిలిపివేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై నిన్న విచారించిన కోర్టు విచారణ ఇవ్వాల్టికి వాయిదా వేసింది. ఈరోజు రెండు పిటీషన్ లను కలిపి విచారించిందిహైకోర్టు. ఇద్దరి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Kanipakam: సత్యప్రణాలకు నెలవైన వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో దొంగలు..? చోరీపై మంత్రి ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) కు మూడు రాజధానులు ఉండాలని ఏపీ సర్కార్ ముందు నుంచి భీష్మించుకుని కూర్చుంది. ఇప్పటికే పరిపాలన అంతా విశాఖ నుంచే కొనసాగుతుంది. రైతులు చేపట్టిన పాదయాత్ర నిబంధనలు పాటించకుండా చేస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. మూడు రాజధానుల విషయానికి అధికార వైసిపి పార్టీ సపోర్ట్ చేస్తుంది. దీనితో జనసేన- టీడీపీతో వైసీపీకి ఓ మినీ యుద్ధమే నడుస్తుంది. అమరావతి  (Amravati)) రైతులకు జనసేన , టీడీపీ మద్దతుగా నిలుస్తుంది. మూడు రాజధానులు (Three Capitals) వద్దు..అమరువతే ముద్దు అనే నినాదంతో రైతులు పాదయాత్రను చేపట్టారు. తాజాగా కోర్టు ఆదేశాలపై రైతులు కోర్టుకు మొర పెట్టుకున్నారు. 600 మంది రైతులతో చివరి వరకు పాదయాత్ర చేయడం కష్టమని అంటున్నారు. రొటేషన్ పద్దతిలో రైతులు పాదయాత్రలో పాల్గొంటారని చెప్పుకొచ్చింది. అలాగే ఈ పాదయాత్రలో మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారని, వారి సమస్యలను అర్ధం చేసుకోవాలని పిటీషన్ లో పేర్కొంది. రైతుల పాదయాత్రకు అనేక గ్రామాల ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని వారు రోడ్డుకు ఇరువైపులా ఉండాలని అంటే యాత్రలో పాల్గొనే వారికి భోజనాలు తయారు చేయడం, వసతి కల్పించడం, విరాళాలు వసూలు చేయడం వంటి పనులు చేస్తుంటారని రైతులు పేర్కొన్నారు.

ఏపీకి రాజధాని అమరావతినా లేక విశాఖనా. ఈ విషయంలో ఏపీ రెండు భాగాలు ఆయిపోయింది. ఇప్పటికే పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన వైసిపి దానికే మద్దతు తెలుపుతుంది. మరోవైపు అమరావతినే రాజధాని దానికే ప్రజల మద్దతు ఉందని టీడీపీ నాయకులూ చెబుతున్నారు.

First published:

Tags: Ap, Highcourt

ఉత్తమ కథలు