Home /News /andhra-pradesh /

AP POLITICS TENSION SENTIMENT FOR PENDURTHI CONSTANCY ONLY ONE TIME WINNERS IN HISTORY NGS VSP

Political Sentiment: ఎమ్మెల్యేను భయపెడుతున్న సెంటిమెంట్? అక్కడ ఎవరికైనా ఒక్క ఛాన్స్ మాత్రమేనా?

ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ కు సీటు లేనట్టేనా?

ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ కు సీటు లేనట్టేనా?

Political Centment: రాజకీయ నేతలుకు నమ్మకాలు చాలా ఎక్కువ..? ముఖ్యంగా సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అవుతారు.. ఇప్పుడు అదే సెంటిమెంట్.. అధికార పార్టీ ఎమ్మెల్యే భయపెడుతోంది. ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎవరికైనా ఒక్క ఛాన్స్ మాత్రమే దక్కింది.. సెకెండ్ ఛాన్స్ ఎవరికి దక్కలేదు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India
  P Anand Mohan, Visakhapatnam, News18

  Political Centment: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడ ఓ సెంటిమెంట్ ఉంది. ఎవరు గెలిచినా వన్‌టైమ్‌ సెటిల్ మెంట్ మాత్రమే అంటున్నారు.. అసలు ఇప్పటి వరకు అక్కడ సెకండ్ చాన్స్ లేదనే గణంకాలు చెబుతున్నాయి. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యేకూ ఆ గండం తప్పదనే ప్రచారం జరుగుతోంది. అందుకే అక్కడ టికెట్‌ ఆశిస్తున్న సీనియర్ నేతలు ఇప్పుడు రీ ఎంట్రీకి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే ఫస్ట్రేషన్‌ పీక్స్‌కు వెళ్లినట్టు టాక్ ఉంది‌. అదే విశాఖ జిల్లా (Visakha District) లో ఉన్న నియోజకవర్గం పెందుర్తి. ప్రస్తుతం అన్నంరెడ్డి అదీప్‌ రాజు (Adeep Raju) అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అసలు 2019లో ఆయన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే వరకు అదీప్‌ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఫ్యాన్ వేవ్‌లో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అది కూడా టీడీపీ సీనియర్‌ నేత.. మాజీ మంత్రి బండారు సత్యానారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) ని ఓడించడంతో ఆయన మరింత హైలైట్‌ అయ్యారు. చిన్న వయసులో ఎమ్మెల్యే అయినప్పటికీ.. మూడేళ్లుగా నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకోవడంలో విఫలం అయ్యారనే ప్రచారం జరుగుతోంది. అందుకు గ్రూపు రాజకీయాలే ప్రధాన కారణం అంటున్నారు అదే పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు..

  అప్పుడప్పుడూ తప్ప.. ప్రజల్లోకి వెళ్లడం లేదనే విమర్శలు ఆయనపై ఉన్నాయి. అందులోనూ ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చేయడంలో ఆయన ఫెయిలయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రెండున్నరేళ్ల తర్వాత పెందుర్తిలో ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టినా.. అది ప్రచారానికే పరిమితమైందనే టాక్‌ ఉంది. మరోవైపు ఆయన బంధువులు దందాలు చేస్తున్నారని టీడీపీ చేస్తున్న విమర్శలు.. రాజకీయ సెగలు రేపుతున్నాయి. ముఖ్యంగా.. గ్రాఫ్‌ పడిపోయిన ఎమ్మెల్యేలకుక టికెట్ ఇచ్చేది లేదని సీఎం జగన్ మోహన్ రెడ్డి  (CM Jagan Mohan Reddy)  పదే పదే చెబుతున్నారు. ఆ లిస్టులో అదీప్ రాజు కూడా ఉన్నారనే ప్రచారం ఉంది.  కాపు ఓటింగ్ ఎక్కువగా వున్న స్ధానం కావడంతో ఇక్కడ ప్రత్యామ్నాయం వెతుక్కోవడం అనివార్యమని వైసీపీ ఆలోచన చేసినట్టు భోగట్టా. దీనికి తోడు మాజీ శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు సీన్లోకి వచ్చారని ప్రచారం జరుగుతోంది. 2009లో ప్రజారాజ్యం తరపున పెందుర్తి నుంచి… 2014లో యలమంచిలి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల.. ఇటీవల సీఎం జగన్‌ను కలిసి వచ్చారు. ఆ తర్వాత పెందుర్తిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు కూడా.

  ఇదీ చదవండి : ఆధ్యాత్మిక బాటలో మంత్రి.. లక్ష్మీ నృసింహునికి పురాణపండ "శ్రీమాలిక " సమర్పించిన రోజా

  పంచకర్ల హడావిడిపై ఎమ్మెల్యే అదీప్‌ అనుచరగణం గుర్రుగా ఉంది. అదీప్ సైతం ఇటీవల పంచకర్లపై సెటైర్లు పేల్చారు. పంచకర్లను తాము వైసీపీ నేతగా పరిగణించడం లేదని.. తాము జగన్‌ సైనికులమైతే.. ఆయన జనసైనికుడని కామెంట్స్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీనిపై వైపీసీ పెద్దలు సీరియస్‌ అయ్యారనే టాక్ కూడా ఉంది. ఉమ్మడి జిల్లాల వైసీపీ సమన్వయ కర్తగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారట పంచకర్ల. దాంతో అదీప్‌ రాజును సుబ్బారెడ్డి గట్టిగా మందలించినట్టు ప్రచారం జరుగుతోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, TDP, Ycp

  తదుపరి వార్తలు