హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: వైసీపీ ఎమ్మెల్యేల్లో సర్వేల కలకలం.. గడప గడపకు ప్రభుత్వం తరువాత మరింత గ్రాఫ్ తగ్గిందా..?

CM Jagan: వైసీపీ ఎమ్మెల్యేల్లో సర్వేల కలకలం.. గడప గడపకు ప్రభుత్వం తరువాత మరింత గ్రాఫ్ తగ్గిందా..?

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

CM Jagan: అధికార వైసీపీలో అలజడి మొదలైందా..? సీఎం జగన్ సర్వేలలో ప్రస్తుతం ఎమ్మెల్యేల గ్రాఫ్ మరింత పడిందా..? గతంలో కంటే గ్రాఫ్ పడిపోవడానికి కారణం ఏంటి..? మరి దీనిపై అధిష్టానం సీరియస్ గా ఉందా..? అధినేత జగన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు.

ఇంకా చదవండి ...

  CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధికార వైసీపీ (YCP) లో చాలామంది ఎమ్మెల్యేలు కలవరపాటుకు గురవుతున్నారా..? ఓ వైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే.. నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోతోందా..? ముఖ్యంగా అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) చేస్తున్న సర్వేలు.. వారికి తలనొప్పిగా మారాయా..? మరోసారి పోటీ చేసేందుకు అధినేత అవ్వకాశం ఇవ్వారా..? ఎందుకంటే జగన్ మళ్లీ రెండోసారి నేతలందరికీ వర్క్ షాప్ పెట్టాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.  ఆయన ఏం బాబు పేలుస్తారో అనే టెన్షన్ అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. అయితే ఈ సారి వర్క్ షాప్ లో మాత్రం నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇస్తారని.. అవసరమైతే సీటు ఇవ్వడం లేదు.. తాను సూచించిన అభ్యర్థికి సహకరించాలని స్పష్టం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని.. వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో తమ భవిష్యత్తు ఏంటి.. జగన్ తెప్పించుకున్న నివేదికల్లో తమ ఫేట్ ఏంటి.. అని చాలామంది ఎమ్మెల్యేలు మదనపడుతున్నట్టు టాక్. గతంలో నిర్వహించిన సమావేశంలోనే జగన్ నేతలందరికీ క్లారిటీ ఇచ్చారు. తన గ్రాఫ్ 65 శాతం ఉండగా.. ఎమ్మెల్యే గ్రాఫ్ 40 శాతం కూడా లేదని.. వెంటనే గ్రాఫ్ పెంచుకోవాలని లేదంటే కఠిన నిర్ణయాలు తప్పవని చెప్పారు. ఆ వెంటనే మంత్రులు, నేతలు అంతా గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) పేరుతో ప్రజల్లోకి వెళ్లి.. అందరికీ అందుబాటులో ఉండి గ్రాఫ్ పెంచుకోవాలని సూచనలు చేశారు.. కానీ తాజాగా అధినేత తెప్పించుకున్న సర్వేలో రిపోర్ట్స్ మరింత దారుణంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గత మూడేళ్లుగా సంక్షేమ పథకాలు (Welfare Schemes) అమలుచేస్తున్నా.. అభివృద్ధి లేకపోవడంతో వైసీపీ ప్రభుత్వం (YSP Government) ప్రజా వ్యతిరేకత పెరిగిందని ద్వితీయ శ్రేణి నాయకులు అభిప్రాయపడుతున్నారు.

  సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఎప్పటికప్పుడు ఐ ప్యాక్ టీమ్ సభ్యులతో సర్వేలు చేయిస్తున్నట్టు సమాచారం. ఆ సర్వేల్లో ప్రభుత్వంతో పాటు జగన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తమైనా.. ఎమ్మెల్యేలపై మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండడం లేదని ఆ నివేదికల్లో చెప్పినట్టు సమాచారం. అసలు ఎమ్మెల్యేల గ్రాఫ్ అమాంతం పడిపోయిందని సర్వేలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన జగన్ ఎమ్మెల్యేలకు రెండు నెలల కిందట ఒక వర్క్ షాప్ నిర్వహించారు. ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. పనితీరు మార్చుకోవాలని, ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని ఆదేశించారు. 

  అధినేత ఆదేశాల మేరకు చాలామంది మంత్రులు, ఎమ్మెల్యు లు అంతా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం అంటూ ప్రజల్లోకి వెళ్లారు. కొందరు మాత్రం ఇప్పటికే ఆ కార్యక్రమం చేపట్టకపోగా.. ప్రజల్లోకి వెళ్లిన చాలామంది నేతలకు నిరసన సెగలు బాగానే తాకాయి. ఎక్కడికక్కడ సమస్యలు అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. చాలాచోట్ల అవమానాలు, చీత్కారాలు ఎదురయ్యాయి. మా ఇంటికి, వీధులకు రావొద్దని ప్రజాప్రతినిధుల ముఖం మీదే ప్రజలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

  ఇదీ చదవండి : ఇది వింటే షాక్ అవుతారు.. దాడి చేసేందుకు సిద్ధమవుతున్న రాకాసి చేప..? ఎంత డేంజరో తెలుసా?

  ఎలాగోలా కార్యక్రమం ముగించామనుకున్న తరుణంలో.. వచ్చిన మరో సర్వే వారందరికీ ఇరకాటంలో పెడుతుందని ఆందోళన చెందుతున్నారు. తాజా సర్వే నివేదిక ఆధారంగానే జగన్ మరోసారి వర్కుషాపు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సారి వచ్చిన రిపోర్ట్స్ చాలా వరకు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగానే ఉన్నాయటే టాక్ వినిపిస్తోంది. ఐపాక్ సంస్థ 2024 ఎన్నికలపై తన బృందంతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడకపోగా.. మరింత దిగజారిందని పేర్కొన్నట్టు సమాచారం. దీంతో జగన్ మరోసారి ఎమ్మెల్యేలను పిలిచి క్లాస్ తీసుకోవాలని భావిస్తున్నారట. అందుకే ఎమ్మెల్యేల్లో అప్పుడే కలవరం మొదలైంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp

  ఉత్తమ కథలు