హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ap: నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత..మైక్ లాక్కున్న పోలీసులు..స్టూల్ పై నిలబడి లోకేష్ నిరసన

Ap: నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత..మైక్ లాక్కున్న పోలీసులు..స్టూల్ పై నిలబడి లోకేష్ నిరసన

నారా లోకేష్ (ఫైల్ ఫోటో)

నారా లోకేష్ (ఫైల్ ఫోటో)

టీడీపీ యువ నాయకుడు నారాలోకేష్ (Nara lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరు జిల్లా సంసిరెడ్డిపల్లెలో నారా లోకేష్ (Nara lokesh)ను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

టీడీపీ యువ నాయకుడు నారాలోకేష్ (Nara lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరు జిల్లా సంసిరెడ్డిపల్లెలో నారా లోకేష్ (Nara lokesh)ను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు నారా లోకేష్ కు మైక్ అందిస్తున్న వ్యక్తిని లాగారు..అంతేకాదు లోకేష్ నిలబడ్డ స్టూల్ ను సైతం లాక్కునేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పోలీసుల తీరుపై నారా లోకేష్ (Nara lokesh) స్టూల్ పై నిలబడి నిరసన తెలిపాడు. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని..రాజ్యాంగం ఇచ్చిన హక్కును హరించడానికి మీరెవరంటూ పోలీసులను నిలదీశారు. మా గ్రామం వచ్చినప్పుడు మాట్లాడొద్దని అనడానికి పోలీసులకు ఏం హక్కు ఉందని లోకేష్ (Nara lokesh) పోలీసులను ప్రశ్నించారు.

Breaking News: ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం..ఏడుగురు కార్మికులు దుర్మరణం

లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 14వ రోజు నెల్లూరు నియోజకవర్గంలో  కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు ఆత్మకూరు ముత్యాలమ్మ ఆలయ ఆవరణ నుండి పాదయాత్ర స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి సంసిరెడ్డిపల్లెకు పాదయాత్ర చేరుకునే క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు ఆయన మాట్లాడానికి అందిస్తున్న మైక్ ను లాక్కున్నారు. అలాగే లోకేష్ నిల్చున్న స్టూల్ ను లాక్కునే ప్రయత్నం చేయడంతో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నారు. ఈ క్రమంలో లోకేష్ పోలీసులు, ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలతో మాట్లాడకుండా పాదయాత్ర చేయాలంట. 'సైకో జగన్ కొత్త రూల్ పెట్టినట్టున్నాడు. పోలీసులు మైక్ లాగేసుకున్నారు. కార్యకర్తలను కొడుతున్నారు. పోలీసు జులుంను ఖండిస్తూ నారా లోకేష్ గారు స్టూల్ పై నిలబడి నిరసన తెలుపుతుంటే...ఆ స్టూల్ ను కూడా లాగేసే ప్రయత్నం చేయడం ఎంత దారుణం అని' లోకేష్ మండిపడ్డారు.

Ap-Telangana: మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా..షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ

జగన్ రెడ్డి శాడిజం పరాకాష్టకు చేరుతోంది. పాదయాత్రపై పోలీసు దాడులు ముమ్మరమయ్యాయి. మైక్ తీసుకొస్తున్న బాషా అనే కార్యకర్తను గాయపరిచి మైక్ లాక్కున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు.

First published:

Tags: Andhrapradesh, Ap, Nara Lokesh, Police, TDP

ఉత్తమ కథలు