Tension in Kuppam: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సొంత నియోజకవర్గం కుప్పం (Kuppam) లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండో రోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ (Anna Canteen) ను.. వైసీపీకి చెందిన కొందరు ధ్వంసం చేశారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన.. ఫ్లెక్సీలను కూడా చించేశారు. విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలను (TDP Leaders) పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. సమాచారం అందుకున్న చంద్రబాబు నాయుడు హుటాహుటిన అక్కడకు బయలు దేరారు. ఈ నేపథ్యంలో ముందస్తుగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు వైసీపీ గానీ.. అటు టీడీపీ గానీ వెనక్కు తగ్గడం లేదు.. పోటా పోటీ నిరసనలకు దిగుతున్నారు. దీంతో ఏ క్షణం ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పలేక పోలీసులు టెన్షన్ పడుతున్నారు.
చంద్రబాబు నాయుడి తొలి రోజు పర్యటనలో సైతం ఇలాంటి పరిస్థితే కనిపించింది. టీడీపీ - వైసీపీ కార్యకర్తలు పరస్పరంగా రాళ్ల దాడు చేసుకున్నారు. ఇక రెండో రోజు మరింత తీవ్రంగా మారింది. నేరుగా బాహాబాహీకి దిగారు. రాళ్ల దాడికి నిరసనగా ఇరు వర్గాలకు ఇవాళ నిరసనకు పిలుపు ఇచ్చాయి. అక్కడితో ఆగని వైసీపీ నేతలు.. చంద్రబాబు నాయుడు కాసేపట్లో ప్రారంభించాల్సిన అన్నా క్యాంటీన్ ను పూర్తిగా ధ్వంసం చేశారు.
కుప్పంలో టీడీపీ నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ వద్దకు వెళ్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు https://t.co/P0QR3WpaYx
— Telugu Desam Party (@JaiTDP) August 25, 2022
అక్కడ ఉన్న తెలుగు దేశం కార్యకర్తలపైనా దాడికి దిగారు.. అయితే ఇదంతా జరుగుతున్న పోలీసులు వాళ్లకు సహకరిస్తు.. టీడీపీ కార్యకర్తలనే అడ్డుకుంటున్నారని.. ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. తొలి రోజు సైతం ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. చంద్రబాబు కాసేపట్లో వస్తారని తెలియగానే .. అక్కడకు చేరుకున్న వైసీపీ నేతలు.. ఆందోళనకు దిగారు.. రోడ్డుపై బైఠాయించి.. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రతిగా నినాదాలు చేశాయి.
ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. కుప్పంలోని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. రెండో రోజు ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని భావించిన.. జిల్లా అధికారులు ముందుగా అలర్ట్ అయ్యారు.. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.. అలాగే ఆర్టీసీ బస్సులను సైతం ఎక్కడికక్కడ డిపోల్లోనే నిలిపివేశారు.
ఇదీ చదవండి : ఆమె చేసిన పనికి పగలబడి నవ్విన జగన్.. ఆ నవ్వు ఆపుకోలేక ఏం చేశారో చూడండి
మరోవైపు.. వైసీపీ నేతల చర్యలకు ధీటుగానే టీడీపీ నేతలు తిరుగుబాటకు దిగారు. ఎమ్మెల్యే భరత్ ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారిని బారికేడ్లు అడ్డుగా వేసి అడ్డునేకునేందుకు పోలీసులు ప్రయత్నించినా.. కొందరు మాత్రం వాటిని దాటునుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Kuppam, TDP