టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూల్ పర్యటనలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వికేంద్రీకరణతో పాటు కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి తన వైఖరి తెలపాలని న్యాయవాదులు నిరసన తెలిపారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అటు న్యాయవాదుల నిరసనను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీనితో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్బంగా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు ఆడుతున్నారు. నేను వారికి సమాధానం చెప్పాను. ఇంకా బుద్ది లేకుండా ఇక్కడకు వస్తే మీరే చూసుకోవాలి. లేదంటే నేనే వస్తా తాట తీస్తా అన్నారు. అంతేకాదు కర్నూల్ లోనే బస చేస్తా అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
కర్నూల్ నగరంలోని ఓ హోటల్ లో చంద్రబాబు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఏ క్రమంలో హోటల్ దగ్గరకు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. కర్నూల్ ను న్యాయ రాజధానిగా ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని వారు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అలాగే రాయలసీమ జేఏసీ కూడా నిరసనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
చంద్రబాబుగారి ఆగ్రహం చూస్తుంటే... "అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిననాడు సాగరములన్నియు ఏకము కాకపోవు..." అంటూ సాగే తిరుపతి వెంకటకవుల పద్యం గుర్తుకు వస్తోంది.ఇది చంద్రబాబుగారి కర్నూలు జిల్లా పర్యటనలో చోటు చేసుకుంది#CBNInKurnool#RayalaseemaTDP#TDPforDevelopment pic.twitter.com/mPNWwV2tl0
— Telugu Desam Party (@JaiTDP) November 18, 2022
ఈ సందర్బంగా చంద్రబాబు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. 'గూండాలందరినీ హెచ్చరిస్తున్నా. జాగ్రత్తగా ఉండాలి. దాడులకు పాల్పడిన వారిని తరిమి కొడదాం. పోలీసుల వల్ల కాకపోతే చెప్పండి నేను వస్తా. తమాషా అనుకున్నారా. వైసిపి చోటా మోటా రౌడీలు ఇలా దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. బట్టలిప్పించి కొట్టిస్తా దద్దమ్మల్లారా? పనికిమాలిన వ్యక్తుల్లారా నేరాలు ఘోరాలు చేసిన దరిద్రులారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రౌడీలకు రౌడీ గుర్తు పెట్టుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి సంయమనం పాటిస్తున్నాం. మా కార్యకర్తలకు పిలుపునిస్తే పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేస్తే మీ జగన్ బయటకు వచ్చేవాడా? ఎవడ్రా రాయలసీమ ద్రోహి, రాయలసీమను రత్నాల సీమను చేసాం. రాయలసీమకు ద్రోహం చేసింది జగన్' అని ఆరోపించారు బాబు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.