హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodali Nani : కొడాలి నాని ఇంటి వద్ద టెన్షన్.. జనసేన ఉద్యమం ఎఫెక్ట్..

Kodali Nani : కొడాలి నాని ఇంటి వద్ద టెన్షన్.. జనసేన ఉద్యమం ఎఫెక్ట్..

కొడాలి నాని ఇంటివద్ద టెన్షన్ వాతావరణం

కొడాలి నాని ఇంటివద్ద టెన్షన్ వాతావరణం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ (Janasena Party) రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్వానంగా ఉన్న రోడ్ల పోటోలు, వీడియోలను ఆ పార్టీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియా (Social Media) లో పోస్ట్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ (Janasena Party) రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్వానంగా ఉన్న రోడ్ల పోటోలు, వీడియోలను ఆ పార్టీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియా (Social Media) లో పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudivada) నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. గుడివాడలోని మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) ఇంటి ముట్టడికి జనసేన నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. గుడివాడలో రోడ్లను మరమ్మతులు చేయాలంటూ జనసేన నేతలు నిరసనకు దిగారు. రోడ్లు బాగుచేయాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని.. ఏం నేరం చేశామని అరెస్ట్ చేస్తున్నారంటూ జనసేన నేతలు ప్రశ్నించారు.

కొడాలి నాని ఇంటి వద్దకు జనసేన కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో పోలీసులు కూడా మోహరించారు. దీంతో కొడాలి నాని ఇంటికి వెళ్లే మార్గంలో ధర్నా నిర్వహించారు. కొడాలి నాని.. పవన్ కు రాజకీయాలు నేర్పడం మానుకొని గుడివాడ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు.


ఇది చదవండి: టీడీపీ కార్యాలయం చుట్టూ వివాదం.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్.. అసలేం జరిగిందంటే..!

ఇదిలా ఉంటే జనసేన పార్టీ గుడ్ మార్నింగ్ సీఎంసర్ పేరుతో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టింది. మూడు రోజుల పాటు ఉద్యమం చేపడతామని ప్రకటించింది. అనుకున్నట్లుగానే శుక్రవారం ఉదయం నుంచే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అధ్వానంగా ఉన్న రోడ్లను ఫోటోలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జనసేన పోస్ట్ చేస్తున్న రోడ్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈనెల 15లోగా రోడ్లన్నీ బాగుచేసి చూపిస్తామన్న సీఎం జగన్ ఛాలెంజ్ ను స్వీకరించిన జనసేన.. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేలా డిజిటల్ ఉద్యమాన్ని చేపట్టింది.

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని మరిచిందని.. రోడ్లు ధ్వంసం అవుతున్నా పట్టించుకోవడం లేదని జనసేన ఆరోపిస్తోంది. రోడ్ల నిర్వహణ కోసం పెట్రోల్ పై వసూలు చేస్తున్న సెస్, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, ఇతర నిధులు ఏం చేస్తున్నారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది రోడ్లపై ఇలాంటి ఉద్యమాన్నే జనసేన చేపట్టింది. గతేడాది సెప్టెంబర్ లో డిజిటల్ క్యాంపెయిన్ చేయగా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. సరిగ్గా ఏడాది తర్వాత ఇలాంటి కార్యక్రమానికే జనసేన పిలుపునిచ్చింది.

First published:

Tags: Andhra Pradesh, Janasena party, Kodali Nani

ఉత్తమ కథలు