Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGUDEAM PARTY LEADERS FOCUS ON MAHANADU MAIN AGENDA ON BC DECLARATION NGS

Mahanadu: మహానాడుపై టీడీపీ ఫుల్ ఫోకస్.. తీర్మానాలపై ముమ్మర కసరత్తు.. ప్రధాన అజెండా ఏంటంటే?

లోకేష్, చంద్రబాబు (ఫైల్)

లోకేష్, చంద్రబాబు (ఫైల్)

Mahanadu Update: ఎన్నికల సమర శంఖం పూరించడానికి టీడీపీ సిద్ధమవుతోంది. మహానాడు నుంచి పోరాటాన్ని ప్రారంభించనుంది..? దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ను సైతం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా మహనాడులో ఎలాంటి తీర్మానాలు చేయాలి అన్నదానిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.

ఇంకా చదవండి ...
  Mahanadu Update: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party)కి 2024 ఎన్నికలు డూ ఆర్ డై లాంటివి.. మరోసారి ఎన్నికల్లో ఓడితే పార్టీ ఉనికే ప్రశ్నార్థమవుతుంది. గెలవక తప్పని పరిస్థితి ఉంది. కానీ అది అంత ఈజీ కాదు.. అందుకే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ సారి మహానాడు (Mahanadu)ను సైతం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ (TDP)లో జోష్ తేవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా (Prakasham District)లో జరిగే మహానాడును ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నిల్లో గెలుపే లక్ష్యంగా 15 తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తీర్మానాలపై ఇప్పటికే టీడీపీ (TDP) అగ్రనేతలు కసరత్తులు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల టాక్. రాజకీయ తీర్మానాలకు సంబంధించి ఏయే అంశాలు ప్రస్తావించనున్నారనే అంశంపై అందరి దృష్టి పడింది. ఈ తీర్మానాల ద్వారా వచ్చే ఎన్నికల్లో పొత్తులు, భవిష్యత్‌ ఎన్నికల ముఖచిత్రంపై మహానాడులో స్పష్టమైన సంకేతాలను టీడీపీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకుండా జాగ్రత్తపడతామంటూ ఇప్పటికే పవన్‌ కళ్యాణ్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన ప్రకటనకు కొంచెం అటు ఇటుగానే టీడీపీ రాజకీయ తీర్మానం చేసే అవకాశముంది. బీజేపీ విషయంలో మహానాడులో టీడీపీ ఎలాంటి ప్రస్తావన చేయబోతుందో వేచి చూడాలి. రాష్ట్రానికి ఏది మంచిదైతే అదే నిర్ణయం తీసుకుంటామని, బీసీల విషయంలో మహానాడులో ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  ఇదీ చదవండి : డ్రైవర్ హత్యకేసు పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు.. ఏ క్షణమైనా వైసీపీ ఎమ్మెల్సీ అరెస్ట్‌..!

  అలాగే పొత్తులనేవి కొత్త వ్యవహరం అన్నట్టు వైసీపీ మాట్లాడుతోందని.. ఒంటరిగా పోటీ చేయాలా లేదా పొత్తు పెట్టుకోవాలా అనేది తమ ఇష్టం అంటున్నారు టీడీపీ నేతలు. అలాగే మహానాడులో తీర్మానాలపై పూర్తి స్థాయిలో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదు.. గాలి పార్టీ అని.. ఏ గాలిలో వచ్చిందో.. అదే గాలిలో కొట్టుకుపోతుందని అంచనా వేస్తున్నారు. తమ దగ్గర నుంచి వెళ్లిన బీసీలకే రాజ్యసభ పదవులు ఇచ్చారని.. ఏపీలో ఉన్న బీసీలు బీసీలే కాదా అని ఆయన ప్రశ్నించారు. రెండు రాజ్యసభ స్థానాలను తన పర్సనల్‌ వ్యవహారాలు చూసే వారికి జగన్‌ కేటాయించడం సిగ్గుచేటన్నారు.

  ఇదీ చదవండి : అమ్మఒడి అమలుకు ఇన్ని కొర్రీలా..? అసలే 2 వేలు కోత.. మిగిలినదీ డౌటే..? స్కూళ్లకు క్యూ కడుతున్న తల్లులు

  టీడీపీ-బీసీల మధ్య ఉన్నది కాంక్రీట్‌ బంధం అని టీడీపీ అభిప్రాయపడుతోంది. ఓ వైపు వైసీపీ బీసీ ఓట్లే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో మహనాడులో సైతం బీసీలకు స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి కోసం ఏం చేస్తామన్నది మహానాడు వేదికగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు మహానాడు వేదికకు పర్మిషన్‌ ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని.. అంటే తెలుగు దేశం పార్టీని చూసి ప్రభుత్వం భయపడుతోందనే విషయం అర్ధమైందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు