హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Telugu Desham Party: లోకేష్ ను కొత్తగా ప్ర‌మోట్ చేస్తున్న టీడీపీ? ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా?

Telugu Desham Party: లోకేష్ ను కొత్తగా ప్ర‌మోట్ చేస్తున్న టీడీపీ? ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా?

చంద్రబాబు, లోకేష్ (ఫైల్)

చంద్రబాబు, లోకేష్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) ఇప్ప‌టివ‌ర‌కు వినిపించిన మాట‌లు జ‌గ‌న్ అన్న‌, చంద్ర‌న్న.. ఇప్పుడు కొత్తగా మరో అన్న ప్రజల ముందుకు వస్తున్నారు.

  M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్ప‌టివ‌ర‌కు వినిపించిన మాట‌లు జ‌గ‌న్ అన్న‌, చంద్ర‌న్న ముఖ్యంగా చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ప్రారంభించిన ఏ ప‌థ‌కానికైన చంద్ర‌న్న అనే పేరే ముందు ఉండేది. ప్ర‌స్తుతం జ‌గ‌న్ మోహాన్ రెడ్డి ప్ర‌వేశపెడుతున్న ప‌థ‌కాల‌కు కూడా జ‌గ‌నన్నఅనే పేరు వ‌చ్చేలా చూసుకుంటున్నారు. అంతలా ఈ నేత‌లు త‌మ‌ని తాము ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లెందుకు అన్న అనే ట్యాగ్ లైన్లు త‌గ‌లించుకున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో మ‌రో కొత్త అన్న పేరుగా వినిపిస్తోంది ఆయ‌నే లోకేషన్న. 2024 ఎన్నిక‌లే లక్ష్యంగా లోకేష్ సిధ్ద‌మ‌వుతున్నారు. అందుభాగంగానే ప్ర‌జ‌లో నానేందుకే ఇప్పుడు టీడీపీ లోకేష్ ను లోకేష‌న్న ప్రోజెక్ట్ చేసే ప‌నిలో ప‌డ్డాయి ఆ పార్టీ వ‌ర్గాలు. ఇందులో భాగంగానే లోకేష్ ను ప్రోమోట్ చేయ‌డానికే ఒక ప్ర‌త్యేక‌మైన బృందాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం. టీమ్ లో స‌భ్యులు గ‌తంలో పీకే టీం లో ప‌ని చేసిన వారు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

  ఆ టీమ్ రూపోందించిన ఈ కొత్త నేమ్ ను ఇప్పుడు విరివిగా ప్ర‌చారం చేస్తోన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి లోకేష్ ను పూర్తి స్థాయిలో ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు రూపోందిస్తున్నారు. ఇదిలా ఉంటే కోవిడ్ కార‌ణంగా రాష్ట్రంలో ప‌ద‌వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్షల ర‌ద్దు కోసం లోకేష్ ఏపీ ముఖ్య‌మంత్రికి జ‌గ‌న్ కు లేఖ రాశారు అదే స‌మ‌యంలో జూమ్ లో ప్ర‌త్యేకంగా విద్యార్ధుల‌తో మాట్లాడారు. కానీ చివ‌ర‌కు సుప్రీంకోర్టు జోక్యంతో ఏపీ స‌ర్కారు ప‌రిక్ష‌ల‌ను ర‌ద్దు చేసింది.

  ఇది చదవండి: పాలిటిక్స్ పై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. త్వరలోనే ఏపీ టూర్..?


  అయితే లోకేష్ నిర్వ‌హించిన మొత్తం ఈ ప్రోగ్ర‌మ్ స‌క్సెస్ అవ్వ‌డంతో లోకేష్ డిమాండ్ వ‌ల‌నే జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గ‌రు అనే అంశాన్ని టీడీపీ సోషల్ మీడియా టీమ్ విసృతంగా ప్ర‌చారం చేసింది. అయితే ఈ ప్రమోష‌న్స్ లో థాంక్యూ లోకేష్ అన్న అనే ట్యాగ్ లైన్ తో ప్రచారం చేయ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. లోకేష్ ను కూడా అన్న గా ప్ర‌యోట్ చేయ‌డం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుండా అటు పార్టీ వ‌ర్గాల్లో కూడా చ‌ర్చ‌కు దారితీస్తోంది.

  ఇది చదవండి: ఎక్కువ మాట్లాడితే అంతు చూస్తా..! తెలంగాణ మంత్రులకు రోజా వార్నింగ్


  2024 ఎన్నిక‌ల నాటికి నారా లోకేష్... జ‌గ‌న్ ను డీ కొట్టే స్థాయిలో ఉంటారా...? అనేది ఇప్ప‌టి నుంచే బేరీజు వేసుకుంటున్నారు. అయితే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి లోకేష్ ను భవిష్యత్తు నేత‌గా ప్రమోట్ చేయ‌డానికే చంద్ర‌బాబు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే అదే స్థాయిలో లోకేష్ కూడా స‌న్న‌ద్ద‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే తెలుగుపై ప‌ట్టు సాధించి గ‌తంలో మాదిరిగా త‌డ‌బ‌డ‌కుండా ఇప్పుడు ప్ర‌తీ మాట సూటీగా మాట్లాడ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ముఖ్య‌మంత్రినే టార్గెట్ చేస్తూ ప‌దునైన వ్యాఖ్య‌ల‌తో లోకేష్ అంద‌రి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ఏపీలో లోకేష్ కోసం చేస్తున్న ఈ కొత్త ప్ర‌మోష‌న్ ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Nara Lokesh, TDP

  ఉత్తమ కథలు