హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: కేంద్ర మంత్రి అమిత్ షాతో టీడీపీ ఎంపీల భేటీ...వెనుక ఏం జరిగింది?

AP Politics: కేంద్ర మంత్రి అమిత్ షాతో టీడీపీ ఎంపీల భేటీ...వెనుక ఏం జరిగింది?

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ ఎంపీలు

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ ఎంపీలు

Andhra Pradesh: సమస్యల కంటే ఎక్కువ సీఎం జగన్ (YS Jaganmohan Reddy) పై ఫిర్యాదులతోనే సరిపెట్టారు. రాష్ట్రంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు చేయడమే కుకండా అవినీతికి పాల్పడుతున్నారని అమిత్ షాకు కంప్లైంట్ ఇచ్చారు.

  (స్వస్తికా దాస్, సీఎన్ఎన్ న్యూస్ 18, హైదరాబాద్ )

  కేంద్ర ప్రభుత్వం ఎదుట ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పెద్ద ఫిర్యాదుల చిట్టానే ఉంచింది. బుధవారం (ఫిబ్రవరి 3) కేంద్ర హోమంత్రి అమిత్ షాతో భేటీ అయిన టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్ రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే సమస్యల కంటే ఎక్కువ సీఎం జగన్ పై ఫిర్యాదులతోనే సరిపెట్టారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, ప్రతిపక్షాలకు చెందిన నాయకులపై కేసులు, శాంతిభద్రతలు, అవినీతి, పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు ఇలా అన్ని అంశాలను అమిత్ షాకు వివరించారు. జగన్ రాష్ట్రంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు చేయడమే కుకండా అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

  ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలై శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు, మీడియాపై జగన్ దాడులకు పాల్పడుతున్నారని   టీడీపీ ఎంపీలు అమిత్ షా వద్ద ప్రస్తావించారు. వైఎస్ జగన్ తన వైఖరితో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆలయాలపై దాడులు, ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా, కాంట్రాక్టులు ఇతర పనుల్లో వైసీపీ నేతల అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా మతమార్పిడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. అలాగే పాస్టర్లకు రూ.5వేల గౌరవ వేతనమే ఇందుకు నిదర్శనమని పేర్కన్నారు.

  ఇక సీఎం జగన్ తన సతీమణికి చెందిన సంస్థకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. 2020 సెప్టెంబర్ వరకు జగన్ 30 కేసుల్లో నిందితుడిగా ఉన్నారని.. అందులో 11 కేసులను సీబీఐ, మరో 6 కేసులను ఈడీ నమోదు చేసిందన్నారు. ప్రస్తుతం జగన్ కండీషనల్ బెయిల్ పై ఉన్నారన్న సంగతిని షా దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక నేపథ్యంలో అమిత్ షాతో భేటీ అయిన టీడీపీ ఎంపీలు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ తో పార్టీ అధికార ప్రతినిథి కొమ్మారెడ్డి పట్టాభిపై దాడి జరిగిన అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

  టీడీపీ ఎంపీల ఫిర్యాదులను పరిశీలించిన అమిత్ షా ఫిర్యాదులను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు టీడీపీ ఎంపీలు న్యూస్ 18కు వివరించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Amit Shah, Andhra Pradesh, Andhra pradesh news, Ap cm ys jagan mohan reddy, AP Politics, AP Temple Vandalism, Bjp, Tdp, Ys jagan

  ఉత్తమ కథలు