హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kodela Sivaram: కోడెల కుమారుడుపై మరో ఫిర్యాదు.. సొంతపార్టీ నేతకే బెదిరింపులు

Kodela Sivaram: కోడెల కుమారుడుపై మరో ఫిర్యాదు.. సొంతపార్టీ నేతకే బెదిరింపులు

కోడెల శివరాం (ఫైల్)

కోడెల శివరాం (ఫైల్)

Andhra Pradesh: రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ (YSRCP) అధికారంలోకి వచ్చాక శివరామ్‌తో (Kodela Sivaram) పాటు ఆయన సోదరిపై దాదాపు 20కి పైగా కేసులు నమోదయ్యాయి.

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు కుటుంబాన్ని వివాదాలు వీడటం లేదు. కోడెల మరణం తర్వాత ఆయన తనయుడు శివరాంపై పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో వ్యక్తి శివరామ్ తనను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఈసారి ఫిర్యాదు చేసిన టీడీపీ నేత కావడం ఫిర్యాదు. శివరాం తన వద్ద భారీగా మద్యం తీసుకొని డబ్బులివ్వకుండా బెదిరిస్తున్నాడంటూ ఓ మద్యం వ్యాపారి పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం గణపవరానికి చెందిన టీడీపీ నేత, మద్యం వ్యాపారి నర్రా రమేష్.. శివరాం తన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని శివరాం తన వద్ద రూ.1.30 కోట్ల విలువ చేసే మద్యాన్ని తీసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు.

  2019 ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంచేందుకు తన వద్ద మద్యం తీసుకెళ్లారని.. ఇంతవరకు డబ్బులు చెల్లించకపోగా తనను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కన్నారు. శివరాం నుంచి తనకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని రమేష్ పోలీసులను కోరారు. 2015 నుంచి 2019 వరకు మద్యం వ్యాపారుల నుంచి అనధికారికంగా వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు.

  ‘K’ ట్యాక్స్ ఆరోపణలు

  కోడెల కుటుంబంపై గతంలోనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కే ట్యాక్స్ పేరుతో నియోజకవర్గంలో మద్యం, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారుల నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైన తరవాత శివరాంపై ఆరోపణలు ఒక్కొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక శివరామ్‌తోపాటు ఆయన సోదరిపై దాదాపు 20కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇక కోడెల శివప్రసాదరావు మరణానికి ఆయన తనయుడే కారణమని సొంత బంధువులే ఆరోపించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP Politics, Kodela death, Kodela Siva Prasada Rao, Kodela sivaram, TDP, Ysrcp

  ఉత్తమ కథలు