హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: రేణిగుంట ఎయిర్ పోర్టులో టెన్షన్ టెన్షన్... చంద్రబాబుకు నో పర్మిషన్...

Andhra Pradesh: రేణిగుంట ఎయిర్ పోర్టులో టెన్షన్ టెన్షన్... చంద్రబాబుకు నో పర్మిషన్...

చంద్రబాబును వెంటాడుతున్న కేసులు

చంద్రబాబును వెంటాడుతున్న కేసులు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చిత్తూరు జిల్లా (Tirupathi) తిరుపతి (Tirupati) సమీపంలోని రేణిగుంట ఎయిర్ పోర్టు (Tirupati Airport) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరులో నిరసన తెలిపేందుకు సిద్ధమైన చంద్రాబును ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరు వెళ్లేందుకు అనుమతి లేదని.. శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ బాబును పోలీసులు అడ్డుకున్నారు. అలాగే కొవిడ్ నిబంధనలు కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ మేరకు ఎయిర్ పోర్టులోనే చంద్రబాబుకు నోటీసులు అందించారు. చంద్రబాబును అడ్డుకోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచి టీడీపీ నేతలనుఎ ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఎవరూ బయటకు రాకుండా కట్టడి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. దానికి నిసనగా చిత్తూరులోని గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఐతే చంద్రబాబుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎన్నికల ప్రక్రియకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశముందని కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తనను ఎయిర్ పోర్టులో అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. తనకు నిరసన తెలిపే హక్కు ఉందంటూ వాగ్వాదానికి దిగారు. తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని.. ప్రతిపక్ష నేత పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ఎయిర్ పోర్టులోనే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు మాత్రం చంద్రబాబుకు నమస్కరించి మరీ వెనక్కి వెళ్లిపోవాలని కోరారు.


ఉదయం నుంటి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమరనాథఅ రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మఅను హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరగింది. దీంతో ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ వైఖరిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని.. టీడీపీ అంటే సీఎం జగన్ కు ఎందుకంత భయమని ప్రశ్నిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, AP News, AP Police, Chandrababu Naidu, Municipal Elections, TDP, Tirupati, Ysrcp

ఉత్తమ కథలు