Yuvagalam: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర తొలి రోజు ఊహించిన దానికంగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) కు అస్వస్థత మినహా అంతా.. తెలుగు దేశం పార్టీ ఊహించినట్టే సాగింది. భారీగా టీడీపీ (TDP) శ్రేణులు తరలవచ్చి నారా లోకేష్ (Nara Lokesh) కు మద్దతుగా నిలిచారు. మహిళలు వీరతిలకం దిద్ది లోకేష్ ను ఆశీర్వదించారు.. కుప్పం (Kuppam)లో మొదలై ఈ పాదయాత్రలో నేరుగా ప్రజలను కలుస్తూ ముందుకు సాగారు లోకేష్.. 4 వేల కిలోమీటర్ల మేర సాగే యువగళం పాదయాత్రను శుక్రవారం కుప్పం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘యువగళం పాదయాత్ర ప్రకటించగానే 10మంది మంత్రులు తనపై మాటల దాడికి దిగారు. ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నావని ప్రశ్నించారని..గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అభివృద్ధి చేశాను. ఐటీ మంత్రిగా.. వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. ఆ అర్హతతోనే పాదయాత్ర చేస్తున్నా అని క్లారిటీ ఇచ్చారు.
ఇక యువగళం పేరు ప్రకటించగానే వైసీపీ నాయకులకు వణుకు పుట్టిందని లోకేష్ విమర్శించారు. తనను విమర్శించే మంత్రులను ప్రశ్నిస్తున్నా.. ఈ మూడేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారు.. వీధుల్లో డ్యాన్సులు వేస్తే, క్యాసినో ఆడిస్తేనో పరిశ్రమలు రావని సెటైర్లు వేశారు.
ఇంకా లోకేష్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘పొట్టి శ్రీరాములు త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దేశంలోనే తెలుగు జాతి గర్వపడే విధంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కృషి చేశారు. ఆంధ్రుల సత్తా ఏమిటో చంద్రబాబు చేసి చూపించారు. కానీ, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు.
ఇదీ చదవండి : సీఎం జగన్ రేపటి విశాఖ టూర్ రద్దు.. రాజశ్యామల యాగానికి దూరం.. కారణం ఏంటో తెలుసా..?
ఈ మూడేళ్లలో వైసీపీ చేసిందేమిటి..? జగన్‌రెడ్డి అంటే జాదూరెడ్డి గుర్తొస్తున్నారని.. మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు.. జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాలు ఉండవన్నారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇస్తామన్నారు. ఏమయ్యాయి ఉద్యోగాలన్నీ..? ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు ఏమైంది..? మెగా డీఎస్సీ ఏమైందని జాదూరెడ్డిని ప్రశ్నిస్తున్నా’ అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
ఇంకా ‘ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన జాదూరెడ్డి.. ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. దానికి కారణం మీపైన ఉన్న కేసులే అన్నారు. యువత, రైతులు.. ఇలా అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం బాధితులే అన్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. 3 రాజధానుల్లో ఎక్కడైనా ఒక్క ఇటుకైనా వేశారా జాదూరెడ్డి? పారిశ్రామిక వేత్తలు పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి. జే ట్యాక్స్ కట్టలేదని పక్క రాష్ట్రానికి పంపించేశారు. మహిళలపై దాడులు జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తారని ప్రగల్భాలు పలికారు. కానీ, అది బుల్లెట్లు లేని గన్ అని ప్రజలకు అర్థమైంది అన్నారు.
ఇదీ చదవండి : యువగళంతో లోకేష్ సీఎం అవుతారా..? పాదయాత్ర సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..?
యువగళం పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో యువతను ఉద్దేశించి నారా లోకేష్ మాట్లాడుతూ ‘యువతకు హామీ ఇస్తున్నా.. త్వరలోనే యువతకు ప్రత్యేకంగా మేనిఫెస్టో తీసుకు రాబోతున్నాం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? ప్రైవేటు రంగం నుంచి ఎన్ని? స్వయం ఉపాధి ద్వారా ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో స్పష్టంగా అందులో ప్రకటిస్తామన్నారు. ఏటా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కౌలు రైతులకు ప్రత్యేక కార్యాచరణ తీసుకొచ్చి ఆదుకుంటాం. ప్రభుత్వ వైఫ్యలాలను విమర్శిస్తే.. తనకు చీరలు, గాజులు పంపుతామని ఓ మహిళా మంత్రి అన్నారని.. పంపించండి చీర, గాజులు.. మా అక్కలు, చెళ్లెల్లకు ఇస్తా. చీర కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతగానివాళ్లా..? అని అడుగుతున్నా అని ప్రశ్నించారు. ’నని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kuppam, Nara Lokesh, TDP