Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM STATE PRESIDENT ATCHANNAIDU SENSATIONAL COMMENTS ON YCP AND CM JAGAN NGS GNT

Atchannaidu: తాడేపల్లి ప్యాలెస్ కు టూలెట్ బోర్డు.. కౌంట్ డౌన్ మొదలైందన్న అచ్చెన్నాయుడు

సీఎం జగన్, అచ్చెన్నాయుడు (ఫైల్)

సీఎం జగన్, అచ్చెన్నాయుడు (ఫైల్)

Atchannaidu on CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందా..? త్వరలో తాడేపల్లి ప్యాలెస్ కు టూలెట్ బోర్డు పెడతారా..? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభిప్రాయం ఇది.. ఆయన ఇంకా ఏమన్నరాంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    TDP State President Atchannaidu Comments: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP)-  ప్రతిపక్ష టీడీపీ (TDP)  మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయడు (Kinjarapu Atchannaidu). ప్రస్తుతం వైసీపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వారికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. త్వరలోనే తాడేపల్లి (Tadepalli) ప్యాలెస్ ​కు టూలెట్ బోర్డు ఖాయమన్నారు అచ్చెన్నాయుడు. అనవసర అప్పులు, అక్రమ కేసులపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై లేదని ఆయన మండిపడ్డారు. కేంద్రప్రభుత్వ ఆహ్వానంపై ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు (Azadi Ka Amrit Mahotsav) విజయవంతంగా నిర్వహించడంపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandraba Babu Naidu) దిల్లీ వెళ్తే.. వైసీపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని నిలదీశారు.

    వైసీపీ మాదిరిగా కేసుల మాఫీ కోసం ప్రధాని నరేంద్ర మోదీని తమ అధినేత చంద్రబాబు నాయుడు కలవలేదన్నారు. వైసీపీ వారికి పడుకున్నా, లేచినా చంద్రబాబే గుర్తుకు వస్తున్నారని సెటైర్లు వేశారు. దేశభక్తికి సంబంధించిన అంశాలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. బ్రిటిష్ పాలకులకు వారసుల్లా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.   

    ప్రస్తుతం వ్యవస్థనలు నిర్వీర్యం చేస్తూ.. రాజ్యాంగేతర శక్తిగా మారిన వైసీపీ నాయకులు.. చంద్రబాబు గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా ప్రభుత్వానికి కానీ.. వైసీపీ నేతలకు కానీ చిత్త శుద్ధి ఉంటే.. ముందు గడప గడపలో నిలదీస్తున్న ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

    ఇదీ చదవండి : శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు.. ఎందుకు చేస్తారంటే..? భక్తుల నమ్మకం ఇదే

    ప్రభుత్వ సలహాదారుగా ప్రతినెలా లక్షల్లో జీతం తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి మూడేళ్లుగా దాచుకోవడం, దోచుకోవడం తప్ప ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలేమైనా ఉన్నాయా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అసలు ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నారా.. లేక తాడాపల్లిలో గుమస్తా ఉద్యోగం చేస్తున్నారా అంటూ తీవ్ర స్థాయిలో అచ్చెన్న ఫైర్ అయ్యారు.

    ఇదీ చదవండి : పవన్ తో పొత్తు.. చంద్రబాబుతో టీ.. జగన్‌తో లంచ్.. ఏపీపై మోదీ గేమ్ ప్లాన్ ఇదేనా?

    నియంతగా సీఎం వ్యవహరిస్తూ.. మంత్రులను డమ్మీలుగా మార్చి ‘గడపగడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమంతో జనం ముందుకు వెళ్తున్న.. మీ ప్రజాప్రతినిధులపై ప్రజలు చేస్తున్న తిరుగుబాటే వారి పతనం మొదలైందనడానికి సంకేతాలని అచ్చెన్న అభిప్రాయడ్డారు. మీరు దోచుకున్న లక్షకోట్ల తాలూకు సిబిఐ, ఈడి కేసులను బయటపడటం, అప్పుల కోసం కేంద్రం వద్ద సాగిలపడటం తప్ప వైసిపికి మరొక ఎంజెడా ఏమైనా ఉందా అని అచ్చెన్న ప్రశ్నించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Kinjarapu Atchannaidu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు