AP POLITICS TELUGU DESAM POLITICAL FIGHT BETWEEN BANDARU SATYANARAYAN VS GANDI BABJI THAT IS PLUS POINT TO YCP NGS NJ
TDP Clasesh: ఆ నియోజకవర్గంలో వైసీపీ బలం పెరిగిందా? టీడీపీ వర్గపోరే అధికార పార్టీకి ప్లస్ అవుతోందా?
టీడీపీ వర్గ పోరు వైసీపీకి ప్లస్ అవుతుందా..?
TDP Clasesh: వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా టీడీపీ అధిష్టానం అడుగులు వేస్తోంది. ఈ సారి అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ వయసులోనూ విరామం లేకుండా కష్టపడుతున్నారు. కానీ స్థానికంగా కొన్ని నియోజకవర్గాల్లో కీలక నేతల మధ్య విబేధాలు పార్టీకి నష్టం చేకూరేలా ఉన్నాయి.
TDP Clasesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. చాలా చోట్ల అధికార పార్టీ మధ్య విబేధాలు రచ్చ రచ్చ అవుతుంటే.. ఓ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అదికూడా ఈ సారి తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) భారీగా ఆశలు పెట్టుకున్న గ్రేటర్ విశాఖ (Grater Visakha Patnam) పరిధిలోని నియోజకవర్గంలో.. మాత్రం టీడీపీ (TDP) లో వింత పరిస్థితి నెలకొంది. విశాఖ (Visakha) జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన పెందుర్తి రాజకీయాలు ఎప్పుడూ ఇంటరెస్టింగ్‌గానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న సెంటిమెంట్ ఉంది. అదే ఒకసారి ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యే.. తర్వాత ఎన్నికల్లో గెలవకపోవడం. ఇదే సెంటిమెంట్ ఎప్పుడూ ప్రతిపక్షానికి కలిస్తోంది. అధికారంలో ఉన్న వాళ్లకు గుబులుపుట్టిస్తోంది.
2019లో ఈ సీటును వైఎస్సార్సీపీ గెలుచుకుంది.. అయితే స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి మళ్లీ టీడీపీ పుంజుకుంది. ఇప్పుడు మళ్లీ ఎలక్షన్ ఫీవర్ స్టార్ అవ్వబోతుంది. దీంతో ఈ నియోజకవర్గంపై పట్టుకోసం ప్రధానపార్టీలు తమదైన శైలిలో ఎత్తుగడులు వేస్తున్నాయి. ఇక్కడ సెంటిమెంట్ ప్రకారం టీడీపీకి కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నా… దాన్ని తమకనుగుణంగా మార్చుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతుందని చర్చ జరుగుతోంది. దానికి ప్రధాన కారణం ఆ పార్టీ నాయకుల అంతర్గత గొడవలేనట.
ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిల మధ్య సఖ్యత లేదనే ప్రచారం జరుగుతోంది. బండారు నాలుగుసార్లు గెలిచి మంత్రిగా చేయగా.. గండి బాబ్జి మాజీ శాసనసభ్యుడు. వైఎస్సార్సీపీ డిస్మిస్ చేసిన తర్వాత.. 2019 ఎన్నికల ముందు ఆయన టీడీపీలోకి జంప్ అయ్యారు. బాబ్జి చేరికపై సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యంతరం తెలిపినా టీడీపీ పెద్దలు పట్టించుకోలేదు. బండారు, గండి ఇద్దరూ బలమైన వెలమ సామాజికవర్గానికి చెందిన నాయకులు కావడంతో.. 2019 ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా వస్తాయని టీడీపీ వేసిన అంచనా తారుమారయ్యింది.
అదే అదునుగా తర్వాత రానున్న ఎన్నికల్లో పెందుర్తి టీడీపీ నుంచి పోటీ చేసేది తానేని గండి బాబ్జి సంకేతాలిచ్చారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. మరోవైపు బండారు, బాబ్జి ఇద్దరు బహిరంగ వేదికలపైనే సవాళ్లు చేసుకునే వరకు వెళ్లారు. ఇంతలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ పార్టీ జంప్ చేయడంతో విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా గండి బాబ్జిని నియమించారు. అక్కడితో పెందుర్తిలో ఆధిపత్య పోరాటానికి తెరపడిందని తెలుగు తమ్ముళ్లు అనుకున్నారు.
కానీ ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అనకాపల్లి జిల్లా పర్యటనలో మరోసారి వర్గబేధాలు బయటపడ్డాయి. నియోజకవర్గాల వారీగా సమీక్షల్లో భాగంగా.. పెందుర్తి గురించి జరుగుతున్న సమీక్షలో గండి బాబ్జి రావడం బండారు వర్గానికి పడలేదు. పెందుర్తిలో తన వర్గానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదంటూ బాబ్జి.. టీడీపీ పెద్దలకు చెప్పడంతో మరోసారి ఇద్దరి మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. సబ్బవరం జడ్పీటీసీగా ఉన్న తన తమ్ముడు రవికి.. తన వర్గానికి చెందిన సర్పంచ్‌లకు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వానాలు అందడం లేదని బండారుపై బాబ్జి ఫిర్యాదు చేశారట. ఇదే ధోరణి కొనసాగితే బండారుతో కలిసి పనిచేయడం సాధ్యం కాదని తెగేసి చెప్పేశారట.
మొన్నామధ్య పినగాడిలో అధికారపార్టీ నేత నిర్మించిన ఆలయ ప్రారంభ కార్యక్రమానికి.. బండారును ఆహ్వానించకుండా బాబ్జికి స్వాగతం లభించింది. తన నియోజక వర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి ప్రత్యుర్థులు పిలిస్తే గండి వర్గం వెళ్లడం బండారుకు అస్సలు రుచించలేదట. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్లిద్దరు మధ్య కోకొల్లలుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ అంతర్గత పోరు సమస్య పరిష్కారానికి.. పార్టీ పెద్దలు త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే.. వచ్చే ఎన్నికల్లోనూ పరాభవం తప్పదేమో అని కేడర్ ఆందోళన పడుతుంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.