Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM PARTY WILL RESERVE SEAT IN TIRUPATI FOR JANASENA WHAT IS THE CHANDRABABU STRATEGY NGS TPT

TDP-Jansena: జనసేన కోసం ఆ సీటును టీడీపీ రిజర్వ్ చేసిందా..? అందుకే బాధ్యతలు ఎవరికీ ఇవ్వడం లేదా..?

పవన్ కళ్యాణ్,చంద్రబాబు (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్,చంద్రబాబు (ఫైల్ ఫోటో)

TDP-Jansena:టీడీపీ -జనసేన పొత్తుపై అనుమానాలు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు వ్యతిరేక ఓటు చీలకూడదంటూ.. త్యాగాలు తప్పవని అన్నా చంద్రబాబు, పవన్ లు ఇప్పుడు మాట మార్చారు. మహానాడు తరువాత పొత్తుల గురించి చంద్రబాబు మాట్లాడడం లేదు. జాగా పవన్ సైతం.. తగ్గేదేలే అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలాంటి సమయంలోనూ ఓ వార్త హాట్ టాపిక్ అయ్యింది.. జనసేన కోసం టీడీపీ ఓ సీటును రిజర్వ్ చేసిందనే ప్రచారం ఉంది.

ఇంకా చదవండి ...
  TDP-Jansena: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయాలు పొత్తుల చుట్టూనే తిరుగుతున్నాయి.  మొన్నటి వరకు తెలుగు దేశం (Telugu Desam) -జనసేన (Janasena) పొత్తు కచ్చితంగా ఉంటుంది అని అంతా భావించారు.. దీనిపై ఎవరి లెక్కలు వారు వేసుకున్నారు కూడా.. ఇప్పుడు పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మొన్నటి వరకు పొత్తు కోసం ఓ మెట్టు దిగేందుకు కూడా సై అన్న పార్టీల అధినేతలు.. ఇప్పుడు తగ్గేదే లే అంటున్నారు. దీంతో టీడీపీ, జనసేన పొత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి సమయంలోనూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అది ఏటంటే.. అత్యంత కీలకమైన నియోజకవర్గమైన తిరుపతి (Tirupati)ని జనసేన కోసం టీడీపీ (TDP) వదిలేస్తోంది అంటూ తెలుగు తమ్ముళ్లు చెవులు కొరక్కుంటున్నారు. ఎందుకంటే.. తిరుపతి నియోజకవర్గం టీడీపీ కంచుకోట లాంటిది. పార్టీ ఆవిర్భావ సమయంలో స్వయంగా ఆ పార్టీ అధినేత ఎన్టీ రామారావు (NT Ramarao) తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కూడా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ చాలా సార్లు విజయం సాధిస్తూ వచ్చింది.

  గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటమి తప్పలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి (YCP) గాలి వీచినా.. చంద్రబాబు సొంత జిల్లాలో కుప్పం (Kuppam) మినహా మిగిలిన నియోజకవర్గాల వేల సంఖ్యలో ఓట్ల తేడాతో టీడీపీ ఓటమి పాలైనా….తిరుపతిలో మాత్రం స్వల్ప తేడాతో ఆ పార్టీ ఓడిపోయింది. తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి మొదటి రౌండ్ నుంచి అధిక్యంలో ఉన్నప్పటికీ.. చివరి రౌండ్‌లో వచ్చిన స్వల్ప మెజారిటీతో వైసిపి గట్టెక్కింది. కంచుకోట లాంటి నియోజకవర్గంలో టీడీపీకి ఆశావాహులు కూడా అధికంగానే ఉన్నారు. అలాంటి సీటును జనసేన కోసం వదిలేసినట్టు ప్రచారం ఉంది.  ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గ ఇంచార్జిగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ (MLA Sugunamma) కొనసాగుతున్నారు. అయినా ఆమె పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా లేరు. దీంతో తమకు అవకాశం కల్పించాలంటూ అధినేత వద్ద క్యూ కడుతున్నారు ఆశావాహులు. తిరుపతి అర్బన్ నియోజకవర్గం కావడంతో ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం సులభమే అని.. తెలుగు తమ్ముళ్లు ధీమాగానే ఉన్నారు. అధినేత మాట ఇస్తే ఇప్పటి నుంచే కార్యచరణ ప్రారంభించాలని అనుకుంటున్నారు. అందుకే అధినేత సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వారికి ఎదురైన సమాధానం విని షాకైనట్టు టాక్.

  ఇదీ చదవండి : ఉద్యోగులకు శుభవార్త.. రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్న సీఎం

  మాజీ ఎమ్మెల్యే మబ్బురామిరెడ్డి కుమారుడు దేవనారాయణరెడ్డి తనకు తిరుపతి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబును కలిశారట. తిరుపతికి వేరే లేక్కలు ఉన్నాయని... కావాలంటే చంద్రగిరి నియోజకవర్గంపై దృష్టిసారించాలని దేవ నారాయణ రెడ్డికి పార్టీ అధినేత సూచించినట్లు సమాచారం. యువజన నాయకుడు జేబీ శ్రీనివాస్ కూడా తనకు తిరుపతి నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి వస్తానని అధినేతను కోరారట. అటు నుంచి సానుకూల స్పందన మాత్రం రాలేదట. అధినేతతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా తిరుపతికి సంబంధించి వేరే లెక్కలు ఉన్నాయంటూ చెబుతున్నారని టాక్.

  ఇదీ చదవండి : పవన్ కు వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు.. ఆయన పోరాటం పొత్తుల కోసమే..

  అందుకే తెలుగు తమ్ముళ్లుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తూన్నారట. దీనికంతటికీ కారణం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జనసేన జట్టు కడితే…జనసేన తిరుపతి సీటును ఆ పార్టీ అడిగే అవకాశం ఉందని..అందుకే ఇప్పటి నుంచే ఆ సీటు విషయంలో క్లారిటీగా ఉన్నట్లు చెబుతున్నారు. వంద మంది ఆశావహులు వచ్చినా..ఆ సీటు రిజర్వుడ్‌ అని చెప్పకనే చెబుతున్నారట.

  ఇదీ చదవండి : ఆరోగ్యశ్రీ పథకం జగన్ ది కాదు..? కేంద్రాన్ని కాపీ కొట్టారు.. సీఎం అభ్యర్థిపై క్లారిటీ..?

  2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. గాజువాక.. భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడించటంతో పాటు అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్న పవన్ తిరుపతినే సేఫ్ అనుకుంటున్నారట. మరి జనసేనాని అడుగుతున్నారని ఈ సీటును టీడీపీ రిజర్వు చేసిందా.. లేక ఆల్రెడీ అడిగేశారని టీడీపీ నో వేకెన్సీ బోర్డు పెట్టిందా అని అనుమానాలు ఉన్నాయట రెండు పార్టీల క్యాడర్‌కు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Janasena, TDP, Tirupati

  తదుపరి వార్తలు