Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM PARTY SENIOR LEADER TIKKAREDDY HOT COMMENTS ON CHANDHRABABU NAIDU NGS

TDP Leader: 2024 ఎన్నికల తర్వాత ఆస్తులమ్ముకోవాలి..? లేదా ఆత్మహత్యే.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు,లోకేశ్ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు,లోకేశ్ (ఫైల్ ఫోటో)

TDP Leader: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగు దేశం మధ్య మాటల తూటాలు పేలుతుంటే.. మరోవైపు కొందరు నేతలు సొంత పార్టీపైనే తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారుతోంది. మొన్నటి వరకు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలే.. పార్టీ పెద్దల తీరుపై నేరుగా విమర్శలు చేశారు. తాజగా టీడీపీ నేత.. కూడా అధిష్టానం తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
    TDP Leader: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఎవరి నోట విన్నా ఎన్నికల మాటే వినిపిస్తోంది. ప్రధాన పార్టీలు అన్నీ ఎన్నికల వ్యూహాల్లో బిజీ అయ్యాయి. మరోవైపు అదే స్థాయిలో మాటల తూటాలు.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. మరోవైపు కొందరి నేతల తీరు సంచలనంగా మారుతోంది. ఇటీవల అధికార వైసీపీ నేతల (YCP Leaders) తీరు దుమారం రేపింది. జిల్లాల ప్లీనరీల్లో భాగంగా కీలక నేతలు కొందరు సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. మాజీ మంత్రి బాలినేని (Balineni), ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) లాంటి వారు సైతం సొంత పార్టీ నేతలే తమపై కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక దర్శి నేత అయితే నేరుగా సీఎం జనగ్ తీరునే తప్పు పట్టారు. సీఎం బటన్ నొక్కితే ఆయన గ్రాఫ్ పెరుగుతుందని.. కానీ తమ గ్రాఫ్ పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  అధికార పార్టీలో చాలామంది నేతలు ఇలాంటి వ్యాఖ్యలతో సంచలనం రేపితే.. తాజాగా టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డి (Tikkareddy) వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..

    తిక్కారెడ్డి ఏం అన్నారంటే..? 2024 ఎన్నికలు అయిపోతే టీడీపీ నాయకులు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని.. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటూ వ్యాఖ్యానించి పెద్ద చర్చకు తెరలేపారు. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. పార్టీ నాయకులను రోడ్డుపై పారేశారని వ్యాఖ్యనించారు. ఉన్న డబ్బులు అంతా రాజకీయలకే ఖర్చు అయ్యాయని.. ఇక 2024 ఎన్నికలు వస్తే తన ఆస్థి అంత కరిగిపోయి తాను టీ వ్యాపారం పెట్టుకొని బతకాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు.



    ఆంధ్రప్రదేశ్‌లోని చాలామంది తెలుగుదేశం లీడర్లు ఆస్తులు అమ్ముకున్నారని..  2024 ఎన్నికలకు వెళ్తే అందరూ అప్పులు చేసి దివాలా తీసి రోడ్డున పడాలి లేకపోతే సూసైడ్‌ చేసుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏపీలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. 2024 ఎలెక్షన్ అయిపోతే టీడీపీ నాయకులు ఆస్తులు అమ్ముకొని సూసైడ్ చేసుకుంటారు అని వ్యాఖ్యానించారు తిక్కారెడ్డి.

    ఇదీ చదవండి : అచ్చెన్నాయుడుకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్షమాపణలు. మోదీ టూర్ లో అవమానంపై వివరణ.. అసలు ఏం జరిగింది అంటే?

    అక్కడితోనే ఆగలేదు.. అధికార పార్టీపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. తన మీద గెలిచిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దేవుడి గదిలో దేవుళ్ల ఫొటోలు తీసి సీఎం జగన్ ఫొటోలు పెట్టుకున్నారన్నారు. అక్రమ ఇసుక అమ్మి బస్తాలు, బస్తాలు డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు. రోజుకు 400 ట్రిప్పులు ఇసుక తరలిస్తే 50 ట్రిప్పులకు బిల్లులు వేయించి 350 ట్రిప్పుల ఇసుక డబ్బులు ఎమ్మెల్యే ఖాతాలో జమ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఇసుక లారీల తరలింపుతో రోడ్లు పగిలి అద్వనంగా తయారయ్యాయని విమర్శించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Kurnool, TDP

    తదుపరి వార్తలు