హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chandrababu New Plan: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీకి షాక్ తప్పదా..? టీడీపీ విప్ జారీ.. అసలు వ్యూహం ఇదే

Chandrababu New Plan: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీకి షాక్ తప్పదా..? టీడీపీ విప్ జారీ.. అసలు వ్యూహం ఇదే

సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)

సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)

Chandrababu New Plan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన నమోదు కానుందా..? అధికార వైసీపీకి బిగ్ ట్విస్ట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారా..? పట్టభద్రుల ఎన్నికల్లో మూడింటికి మూడూ నెగ్గడంతో.. అదే దూకుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కొనసాగించాలి అనుకుంటున్నారా..? మరి అధి సాధ్యమయ్యే పనేనా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Chandrababu New Plan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అనూహ్యంగా మూడు చోట్ల పట్టభద్రుల ఎన్నికలు (Graduate MLC Elections) జరిగితే.. మూడింట టీడీపీ (TDP)నే నెగ్గింది. అది కూడా వైసీపీ కంచుకోట జిల్లాలు.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సొంత జిల్లాలోనూ సైకిల్ ప్రభంజనం కనిపించింది. అందులోనూ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనూ టీడీపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. ఇది నిజంగా వైసీపీకి ఊహించని ఎదురు దెబ్బే.. అయితే దెబ్బ దెబ్బ కొడితేనే ప్రత్యర్థి ఒత్తిడిలో పడతారన్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) లెక్క.. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగా బలం లేదని తెలిసినా.. ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టారు. అక్కడితోనే ఆగలేదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై విప్ జారీ చేయాలని భావించింది టీడీపీ. అంతేకాదు కచ్చితంగా ఆ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి టీడీపీ లెక్క ఏంటి..? వైసీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది.

ఈ నెల 23వ తేదీ జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు టీడీపీ విప్ జారీ చేసింది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి జై కొట్టిన ఎమ్మెల్యేలకు షాక్ ఇవ్వాలనే లక్ష్యంతో టీడీపీ 23 మంది పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే విప్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీచేశారు. మరి విప్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఓటు వేస్తే అనర్హత ఓటు వేసే అవకాశం ఉంటుంది.

విప్ ను ఎమ్మెల్యేలకు స్పీడ్ పోస్టులో పంపించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా అందజేసింది టీడీపీ. 23వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొని పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేయాల్సిందిగా ఆదేశించింది. మొత్తం ఏడు స్థానాలకు ఈ నెల 23న మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ కూడా తన అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఒక ఎమ్మెల్సీ నెగ్గాలి అంటే 22 మంది సభ్యుల మద్దతు అవసరం.. కానీ ప్రస్తుతం టీడీపీ ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 19 మాత్రమే.. 4 గురు వైసీపీకి జై కొట్టారు. ప్రస్తుతం ఉన్న 19 ఓట్లు పడ్డా.. టీడీపీ నెగ్గడం కష్టం.. వైసీపీకి జై కొట్టిన నలుగురు ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ ఓరు ఓటు వేసే అవకాశాలు తక్కువే.. అయినా ఏ ధీమాతో టీడీపీ గెలుపుపై ఆశలు పెట్టుకుంటోంది.

ఇదీ చదవండి : సీఎం జగన్ ఇలాఖాలో టీడీపీ గెలుపు.. ఈసీకి వైసీపీ ఫిర్యాదు.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

టీడీపీ వ్యూహం ఇదే.. వైసీపీలో భారీగా అసమ్మతి ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి.. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరూ బహిరంగంగానే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అధిష్టానాన్ని ధిక్కరించారు. టీడీపీకి టచ్ లో ఉన్నారనే ప్రచారం ఉంది. అంతేకాదు ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన ఆ ఇద్దరు నేతలు తమ ఆత్మ ప్రబోధాను సారం ఓటు వేస్తామంటు.. అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. నిజంగానే ఆ ఇద్దరు టీడీపీకి ఓటు వేస్తే ఆ బలం 21కి చేరుతుంది. అంతే మరొక్క ఓటు పడితే చాలు.. వైసీపీ నుంచి మరికొందరు కూడా ఓటు వేస్తారనే నమ్మకంతో టీడీపీ పెద్దలు ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. రేపు వారందరి ఖాతాల్లోకి నగదు

ప్రస్తుతం ఎమ్మెల్సీలు నారా లోకేష్‌, పోతుల సునీత, ఇటీవల మరణించిన బచ్చల అర్జునుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రావు, గంగుల ప్రభాకర్‌ రెడ్డి, చల్లా భగీరథ రెడ్డి, పెన్మత్స సూర్యనారాయణ పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. వీరి స్థానంలో శాసనమండలికి ఎన్నికలు నిర్వహించనున్నారు. వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, వారి అండతో తమకు ఒక ఎమ్మెల్సీ సీటు వస్తుందని టీడీపీ నేతలు ఆశాభావంతో ఉంది. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఏడు ఎమ్మెల్సీ సీట్లు ఖచ్చితంగా గెలవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఎన్నికల్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించారని అంటున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మాక్ పోలింగ్ కూడా నిర్వహించింది. ఇంత జరుగుతున్నా.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి నెగ్గితే.. ఏపీ రాజకీయాల్లో సంచలనమే అవుతుంది.. మరి 23న ఏం జరుగుతుందో చూడాలి..

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap mlc elections, AP News, Chandrababu Naidu

ఉత్తమ కథలు