Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM PARTY OFFICIAL TWITTER ACCOUNT HACKED NARA LOKESH ANNOUNCED OFFICIALLY NGS

TDP Twitter Hack: టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాక్.. వారిపైనే అనుమానం ఉందంటున్న నేతలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TDP Twitter Hack: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవ్వడం కలకలం రేపుతోంది. పెగాసస్ వివాదం తెరపైకి రావడం.. ఆ వెంటనే తమ ఫోన్లను వైసీపీ ట్యాపింగ్ చేస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించడం.. ఆ రెండు పరిణమాలు జరిగిన గంటల వ్యవధిలోనే టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అయితే టీడీపీ మాత్రం ఇదంతా వారిపనే అంటున్నారు.

ఇంకా చదవండి ...
    TDP Twitter Hack: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ (Twitter Account Hack) అవ్వడం కలకలం రేపుతోం. ఈ విషయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అధికారికంగా ప్రకటించారు. తమ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని, తిరిగి అకౌంట్ పొందేందుకు ట్విట్టర్‌తో కలిసి పని చేస్తున్నామని వెల్లడించారు. శుక్రవారం రాత్రి నుంచి టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ట్విట్టర్ అకౌంట్లో ఏవేవో విచిత్రమైన ట్వీట్లు వరుసగా కనిపించాయి. దీంతో టీడీపీ నేతలు  (Tdp Leaders alert) అలర్ట్ అయ్యి.. ట్విట్టర్ కు కంప్లైట్ చేయడం జరిగింది. ట్విట్టర్ అకౌంట్ రికవరీ కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసిన హ్యాకర్ వివిధ రకాల పోస్టులను చేసినట్టు లోకేష్ గుర్తించింది. అయితే ఏపీలో పెగాసస్ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Benrji) పెగాసస్ అంశంపై చేసిన సంచలన వ్యాఖ్యలు మరింత పొలిటికల్ హీట్ పెంచాయి. అధికారి పార్టీ, టీడీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అదే సమయంలో తమ ఫోన్లను అధికార వైసీపీ ట్యాపింగ్ చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆ రెండు ఘటనలు హీటు పెంచుతున్న సమయంలోనే టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

    పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలో మమతా బెనర్జీ పెగాసస్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెలీ సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ, NSO గ్రూప్, స్పైవేర్ పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను 25 కోట్ల రూపాయలకు విక్రయించేందుకు నాలుగు ఐదేళ్ల క్రితం తమకు ఆఫర్ ఇచ్చిందని మమత గుర్తు చేశారు. అయితే అప్పట్లో బెంగాల్ రాష్ట్ర పోలీసు విభాగానికి ఈ ఆఫర్ వస్తే తాము నిరాకరించినట్టు మమత వెల్లడించారు.   పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కొనుగోలు చేశారంటూ వ్యాఖ్యానించారు. దీంతో దీదీ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం వేడెక్కింది. మమత వ్యాఖ్యలపై చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. పెగాసస్ కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అప్పట్లో తమకు కూడా పెగాసస్ క్రియేట్ చేసిన వారి నుంచి ఆఫర్ వచ్చిందన్నారు.

    ఇదీ చదవండి : పొత్తులపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎంపీ.. వచ్చేది బీజేపీ సర్కారే అంటూ సంచలన వ్యాఖ్యలు

    కానీ తాము దాన్ని తిరస్కరించామని లోకేశ్ స్పష్టం చేశారు. చట్టానికి విరుద్ధంగా తాము ఎలాంటి పనులు చేయమన్నారు. ఆమెకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఆ సమాచారం ఆధారంగానే ఆమె అలా అని ఉండొచ్చని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ నిజంగా పెగాసస్ కొనుగోలు చేసి ఉంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టకుండా ఉంటుందా అని లోకేశ్ ప్రశ్నించారు. ఆ వివాదం కొనసాగుతుండగానే.. ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవ్వడం మరెన్నో అనుమానాలు కలిగిస్తోంది.

    ఈ పని ఎవరు చేశారు..? రాజకీయ కుట్రలో భాగంగానే కుట్ర చేశారా.. ? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా అని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం.. అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలే ఇలాంటి పని చేసి ఉంటారని.. రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Nara Lokesh, TDP

    తదుపరి వార్తలు