Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM PARTY NELIMARLA LEADERS IN VIZIANAGARAM EYES ON INCHARGE POST FOR NEXT ELECTIONS NGS VZM

Telugu Desam Party: మొన్న అధినేత మందు చేతులు కలిపారు.. పదవుల కోసం ఇప్పు ఢీ అంటున్నారు

నెలిమర్ల ఇంఛార్జ్ పదవి కోసం పోటీ

నెలిమర్ల ఇంఛార్జ్ పదవి కోసం పోటీ

Telugu Desam Party: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల ఉత్తరాంధ్రలో పర్యటించారు. దీంతో నేతల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. అంతా చేతులు కలిపి.. కలరింగ్ ఇచ్చారు.. కానీ అధినేత అలా వెళ్లగానికి.. ఆ నియోజర్గం మాది అంటే మాది అంటూ.. కర్చీఫ్ వేసేందుకు సిద్ధమయ్యారు.. మరి అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుంది..

ఇంకా చదవండి ...
  Telugu Desam Party: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయనగరం జిల్లా (Vizianagaram District)లో రాజకీయంగా నెల్లిమర్ల (Nelimarla) నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. నెల్లిమర్లతో పాటు డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం లాంటి కీలక మండలాలు ఉన్నాయి. విశాఖ (Visakha) - విజయనగరం (Vizianagaram) జిల్లాలకు సరిహద్దుగా ఉన్న సెగ్మెంట్ కూడా.. దీనికి తోడు విశాఖపట్నం దగ్గరగా ఉండటంతో రాజకీయాలు కూడా వాడీవేడీగా ఉంటాయి. కొత్తగా నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) కూడా నెల్లిమర్ల పరిధిలోనే ఉంది. ఇలా లెక్కలన్నీ వేసుకున్న తరువాత ఈ నియోజవకర్గానికి డిమాండ్ పెరుగుతోంది. దీనిలో భాగంగా టీడీపీ నేతలు కొత్తగా వ్యూహ రచనల్లో మునిగారు. మూడేళ్లుగా సైలెంట్ గా ఉన్న నేతలంతా ఇప్పుడు అకస్మాత్తుగా ఊడి పడ్డారు. ఎన్నికల వాతావరణం కనిపిస్తుండటంతో గేర్‌ మార్చేస్తున్నారు టీడీపీ నేతలు. నెల్లిమర్ల టీడీపీ ఇంఛార్జ్‌ పదవి కోసం పెద్ద స్థాయిలోనే లాబీయింగ్‌ చేస్తున్నారట. అధినేత ముందు మేం అంతా ఒక్కటే.. మాలో గ్రూపులు లేవని చేతులు కలిపిన నేతలు.. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పర్యటన ముగియగానే.. ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

  మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి వయసు మీద పడటంతో కొత్త ఇంఛార్జ్‌ నియామకం అనివార్యమని టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పేసింది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఇంఛార్జ్‌ పోస్ట్‌ కోసం పోటీ పడుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు వనజాక్షి.. భోగాపురం మండలానికి చెందిన బంగార్రాజు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌రావులు రేస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. వీరితోపాటు పతివాడ మనవడు తారక రామారావు సైతం తానున్నాను అంటున్నారు. ఇక వనజాక్షి సోదరుడు ఆనందకుమార్‌ పేరూ చర్చల్లో నలుగుతోంది.  అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చివరికి కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆశీసులు ఉన్న వారికే ఇంఛార్జ్‌ పదవి వస్తుందనేది ఒక టాక్‌. అందుకే ఆయన శిబిరానికి చెందిన నేతలు ఫుల్‌ జోష్‌లో ఉన్నారట. ఆ మధ్య చంద్రబాబు శ్రీకాకుళం వస్తే.. భోగాపురం దగ్గర ఘన స్వాగతం చెప్పిన బంగర్రాజు సైతం ధీమాగానే ఉన్నట్టు తెలుస్తోంది. పలువురు పేర్లు చర్చల్లో ఉన్నప్పటికీ పతివాడ నారాయణస్వామి అభిప్రాయాన్ని కూడా పార్టీ తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఆయన ఎవరికి ఓటు వేస్తారు? ఎవరి పేరును టీడీపీ పెద్దలకు ప్రతిపాదిస్తారు అనేది సస్పెన్స్‌.

  ఇదీ చదవండి : కౌలురైతుల పిల్లల బాధ్యత తీసుకున్న పవన్.. ఏం హామీ ఇచ్చారు

  ఒకవేళ పతివాడ కుటుంబానికి ఇవ్వకూడదని అధిష్టానం ఫిక్స్ అయితే.. ఆయన ఎవరి పేరు సిఫారసు చేస్తారనేది కూడా కీలకమే. అయితే చంద్రబాబు నిన్న నియోజకవర్గానికి రావడంతో ఈ పోటీ మరింత పెరిగింది. టీడీపీ నేతలంతా ఆయన ముందు చేతులు కట్టుకుని తామంతా కలిసే ఉన్నామని చెప్పారు. అయితే చంద్రబాబు పర్యటనకు అనూహ్య స్పందన రావడంతో... ఆయ నేతలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP, Vizianagaram

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు