Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM PARTY MLA PAYYAVULA KESAV SENSATIONAL COMMENTS ON ANDHRA PRADESH GOVERNMENT NGS

Payyavula Keshav: శ్రీలంక కంటే నాలుగు రెట్టు ఎక్కువే..? ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆవేదన

పయ్యావుల కేశవ్

పయ్యావుల కేశవ్

Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందా..? గత కొన్ని రోజుల నుంచే ఇదే చర్చ రాజకీయాల్లో రచ్చ రచ్చ అవుతోంది. తాజాగా కేంద్రం కూడా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడం మరింత కలకలం రేపుతోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
    Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్థిక పరిస్థితిపై టీడీపీ  (TDP) ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula keshav) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే.. శ్రీలంక (Srilank) బాటలో సాగుతోందని ఆందోళన కలుగుతోంది అన్నారు. ఇదే విషయాన్ని తాము 4 నెలల నుంచి చెబుతున్నామని.. ఇప్పుడు కేంద్రం కూడా ఆదేమాట చెబుతోందని పయ్యావుల గుర్తు చేశారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదమని హెచ్చరించారు. ఇప్పటికైనా అంతా మేలుకొని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతైన అధ్యయనం జరిగేలా చూడాలి అంటూ పయ్యావుల డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తే.. శ్రీలంక కంటే నాలుగురెట్లు అధికంగా ఏపీ అప్పు చేసిందంటూ వెల్లడించారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే ఆర్థిక సంక్షోభం తలెత్తక మరేమవుతుందంటూ పీఏసీ చైర్మన్ అయిన పయ్యావుల ప్రశ్నించారు. ఆర్థికమంత్రి CAG పూర్తిస్థాయి ఆడిట్2కు సిద్ధపడతారా..? లేక శ్వేతపత్రం విడుదల చేస్తారా..? అంటూ ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. తమ లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం (AP Government) భావిస్తే.. ప్రత్యేక ఆడిట్‌కు సిద్దమవ్వడానికి ఏంటి అభ్యంతరం అంటూ నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు ఎందుకు లెక్కలు చూపట్లేదని ఆయన నిలదీశారు.

    తాను ప్రతిపక్ష పార్టీ నేతగా కాకుండా.. పీఏసీ చైర్మన్ హోదాలో తాను అడిగిన వాటికి లెక్కల వివరాలు చెప్పట్లేదని పయ్యావుల తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి సంబంధించి వందలాది పీడీ అకౌంట్లకు లెక్కలు లేవని గుర్తు చేశారు. దీనిని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నాని.. ఎవరైనా చర్చకు రావొచ్చు అంటూ ఛాలెంజ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఇంకా మెతక వైఖరితో ఉండటానికి రాజకీయ కారణాలా..? లేక సమాఖ్య స్ఫూర్తా అనేది అర్థం కావడం లేదన్నారు.



    ఒకవేళ కేంద్రం కూడా అప్పులు చేసి తప్పు చేస్తోందని వైసీపీ భావిస్తే, ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లోనే నిలదీయొచ్చు కదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రం తప్పిదాలు చేస్తోందని ఎండగడుతుంటే, ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎందుకు మౌనం వహిస్తోందని ఆయన ప్రశ్నించారు. పులులు అని చెప్పుకునేవారు ఏ విషయంలోనూ కేంద్రాన్ని నిలదీయకపోవటం గత కొంతకాలంగా చూస్తున్నామంటూ సెటైర్లు వేశారు.

    ఇదీ చదవండి : బాబోయ్ బాహుబలికి బాబులా ఉంది..? ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండరు..?

    మరోవైపు తన భద్రత విషయంలో సీరియస్ కారణాలున్నాయని.. దీనికి సంబంధించి పార్టీ సూచనల మేరకు సరైన సమయంలో వెల్లడిస్తా అంటూ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అయితే ఇటీవల ఆయనకు భద్రత తొలగింపు విషయంలో పెద్ద దుమారమే రేగింది. ఇద్దరు గన్ మెన్లను తీసేసిన ప్రభుత్వం.. మళ్లీ తీవ్ర విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం రాజకీయంగా సంచలనం రేపింది. ఈ సందర్భంగా ఆయన.. త్వరలోనే సంచలన విషయాలు బయట పెడతానంటూ చెప్పారు.. దీంతో పయ్యావుల ఏం చెబుతారంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, AP News, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు