Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM PARTY MAHANADU STARTS FROM TODAY 17 AMENDMENTS WILL PROPOSED BY CHANDRABABU NGS GNT

Mahanadu: ఒంగోలు నుంచి టీడీపీ సమరశంఖం.. మహానాడులో 17 కీలక తీర్మానాలు

మహానాడులో కీలక త్మీర్మానాలు

మహానాడులో కీలక త్మీర్మానాలు

Mahanadu 2022: ఒంగోలు వేదికగా ఎన్నికల సమర శంఖం పూరిస్తోంది తెలుగు దేశం పార్టీ..2024 టార్గెట్ గా.. 17 తీర్మానాలను పార్టీ ఆమోదించనుంది. అలాగే పొత్తులపైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

    TDP Mahanadu 2022:  రాబోయే ఎన్నికలే టార్గెట్ గా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) సమర శంఖం పూరించేందుకు సిద్ధమైంది. పార్టీ శ్రేణులు అతి పెద్ద పండగుగా భావించే మహానాడు (Mahanadu) వేదికగా ఎన్నికల హామీలపైనా అధినేత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఒంగోలు (Ongle) లోని మహానాడు జరిగే మండవవారిపాలెం పసుపుమయంగా మారింది. నేడు, రేపు జరిగే ఈ మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి 10 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మహానాడు సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrabau Naidu) ఇప్పటికే ఒంగోలుకు చేరుకున్నారు. మంగళగిరి (Mangalagiri) నుంచి భారీ కార్లు, మోటార్ సైకిళ్ల ర్యాలీతో చంద్రబాబు ఒంగోలుకు చేరుకోగా.. టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో మహానాడులో పార్టీ శ్రేణులకు చంద్రబాబు శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగం ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు సిద్ధం అనే సంకేతాలు అయితే ఇస్తారు.. మరి సింగిల్ గా ఎన్నికలకు సిద్ధం అవుదాం అంటారో.. పొత్తుల కోసం త్యాగాలు తప్పవని సూచిస్తారా అన్నది ఉత్కంఠ పెంచుతోంది.

    ఇప్పటికే టీడీపీ (TDP) , జనసేన (Janasena) మధ్య పొత్తు వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబుసైతం జనసేనతో జట్టుకట్టేందుకు సుముఖంగానే ఉన్నారు. మహానాడులో రాబోయే ఎన్నికల్లో పొత్తుల విషయపై చంద్రబాబు పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది. మరి బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీపై విమర్శలు చేస్తారా..? బీజేపీతో కలిసే వెళ్తామనే సంకేతాలు ఇస్తారా అన్నది కూడా ఆసక్తి పెంచుతోంది.

    ఇదీ చదవండి : జాబితాలో బీజేపీ, కాపు ఉద్యమ నేతలు.. 46 మందిపై కేసులు.. కోనసీమ అల్లర్లపై సర్కార్ సీరియస్

    మరోవైపు చంద్రబాబు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుంచి భారీస్పందన వస్తుంది. దీంతో ప్రజల్లో వైసీపీపై వ్యతిరేఖత మొదలైందని టీడీపీ భావిస్తోంది. ఇదే అవకాశంగా టీడీపీ నేతలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని చంద్రబాబు దిశానిర్దేశం చయనున్నారు. అలాగే వైసీపీ వాలంటీరు వ్యవస్థకు ధీటుగా ఏం చేయబోతున్నారు.. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని ఎందుకు గెలిపించాలి.. గెలిస్తే ఏం చేస్తామనే విషయాలపై ఆయన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు మహానాడులో మొత్తంగా 17తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలపై భారాల మీద 12తీర్మానాలు ప్రవేశపెట్టి, వీటిపై చర్చించనున్నారు.

    ఇదీ చదవండి : మొన్న విజయవాడ.. నిన్న కొనసీమ.. ఇంటెలిజెన్స్ వైఫల్యాలతో జగన్ సర్కార్ కు టెన్షన్ టెన్షన్

    అయితే క‌రోనా కార‌ణంగా గ‌త రెండేళ్లుగా ఆన్‌లైన్ ప‌ద్ద‌తిలో జ‌రిగింది మహానాడు. అందుకే ఈసారి అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఒంగోలు స‌మీపంలోని మండ‌వ‌వారి పాలెం దగ్గర 80 ఎక‌రాల సువిశాల మైదానంలో మ‌హానాడు జ‌రుగుతోంది. దీనికి ఎన్టీఆర్ ప్రాంగ‌ణంగా పేరు పెట్టారు. ఇప్ప‌టికే పార్టీ నేతలంతా సభకు చేరుకున్నారు. ఒంగోలు మొత్తం పసుపుమయమైంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

    తదుపరి వార్తలు