Home /News /andhra-pradesh /

AP POLITICS TELUGU DESAM PARTY LEADERS TENSION ABOUT WITH JANASENA ALLIANCE FOR LOOSING THEIR SEATS NGS

TDP-Janasena: జనసేనతో పొత్తు అంటే ఆ పార్టీ నేతలు భయపడుతున్నారా..? అందుకే స్వరం మారిందా..?

పవన్ కళ్యాణ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

TDP-Janasena: జనసేనతో టీడీపీ పొత్తులకు బ్రేక్ లు పడాలని వారు కోరుకుంటున్నారా..? పొత్తు మాట వింటే.. కొందరు తెలుగు తమ్ముళ్లు భయపడుతున్నారా..? అంతలా భయపడడానికి కారణం ఏంటి..? మొన్నటి వరకు పొత్తులు తప్పవంటూ మాట్లాడిన నేతలే.. ఇప్పుడు సింగిల్ గా వెళ్దామని అధినేత దగ్గర ఎందుకు మొరపెట్టుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
  TDP-Janasena: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో ఎన్నికలు ఏ క్షణమైనా జరుగుతాయన్నది విపక్షాల అంచనా? ఎప్పుడు అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.. పొత్తులు ఎత్తులపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), జనసేన (Janasena) రెండు కలిసి పోటీ చేస్తాయని అనుకుంటున్నారు. ఈ పొత్తుల అంశానికి మొదట మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే (Chandrababu Naidu) తెరలేపారు. కుప్పం పర్యటనలో జనసేనపై తమది వన్‌సైడ్‌ లవ్‌ అంటూ కన్ను గీటారు. అప్పటి నుంచి పొత్తులపై చర్చలు ఊపందుకున్నాయి. ఆ తరువాత కొన్ని రోజులకే జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ప్రకటించారు. ఇలా రెండు పార్టీల అధినేతల మాటలు.. ప్రకటనలతో పొత్తు ఫిక్స్ అని అంతా అనుకున్నారు. తరువాత జరిగిన పరిణామాలతో ఇద్దరి అధినేత స్వరం కూడామారింది. వార్ వన్ సైడ్ అని చంద్రబాబు అంటే..? టీడీపీ (TDP)కి మూడు ఆప్షన్లు పెట్టారు.. అక్కడితోనే ఆగలేదు.. మరో అడుగు ముందుకు వేసి.. తనకు ఎవరితోనే పొత్తులు లేవు.. జనంతోనే పొత్తులు అంటూ ట్విస్ట్ ఇచ్చారు.  ఇప్పుడు టీడీపీ సీనియర్లు కూడా అదే బెటర్ అని ఆలోచిస్తున్నారు. అధినేత చంద్రబాబు మాత్రం ఈ అంశంపై ఎక్కడా మాట్లాడటం లేదు. అలా అని జనసేనను వదులుకునే స్థితిలో లేరని టాక్‌. ఆ ఆందోళన చుట్టూనే జిల్లాల్లో చర్చ ఆసక్తిగా మారుతోంది.

  బయటకు ఎన్నిమాటలు చెబుతున్నా..? అధినేతలు మాత్రం పొత్తులకు సిద్ధంగా ఉన్నట్టే సమాచారం. సమయం వచ్చినప్పుడు మాత్రమే గురించి మాట్లాడుదాం అన్నది వారి బావనే అని ప్రచారం ఉంది. ఇదే టీడీపీ సీనియర్లకు ఇబ్బంది కలిగిస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే సీట్ల సర్దుబాటు తప్పనిసరి. జనసేనకు కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సామాజికవర్గం ఓట్లను బేస్‌ చేసుకుని జనసేనను దువ్వే పనిలో ఉంది టీడీపీ. టీడీపీ పెద్దల అంచనా ఏంటంటే.. జనసేన పొత్తు కాదంటే కాపుల ఓట్లు వదులుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. అయితే జనసేనతో పొత్తు పెట్టుకుంటే.. ఆ పార్టీ ఎక్కువ సీట్లు డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఏంటి పరిస్థితి అని టీడీపీ సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు.  జనసేన అడిగిన అన్ని సీట్లు ఇస్తే.. చాలామంది సీనియర్లు త్యాగం చేయకతప్పని పరిస్థితి. చర్చలు కొలిక్కి వచ్చాక కొన్ని సీట్లు అయితే జనసేనకు ఇవ్వాల్సిందే. అక్కడ టీడీపీ నేతలు సీట్లను వదులుకుని మిత్రపక్షానికి మద్దతు తెలపాల్సి ఉంటుంది. జనసేన అడిగే సీట్లు ఏంటన్నదే ప్రస్తుతం టీడీపీ నేతలను కలవర పెడుతోందట. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని టీడీపీ నేతలు పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ ఉలిక్కి పడుతున్నారు. ప్రస్తుతం జనసేన బలంగా కనిపిస్తోంది ఉభయ గోదావరి జిల్లాల్లోనే.. అక్కడ ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది. అక్కడ టీడీపీ, జనసేన కలిస్తే.. గెలుపు అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయన్నది రాజకీయ విశ్లేషకులు మాట.

  ఇదీ చదవండి : వైసీపీ ట్రాప్ లో పవన్..! బాబు డైలమాకు కారణం అదేనా..? మరి జరగబోయేది ఏంటి..?

  ఉమ్మడి తూర్పుగోదారి జిల్లాలో ప్రస్తుతం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత లెక్కలను చూస్తే 2009లో పీఆర్పీ నాలుగు సీట్లు గెలుచుకుంది. కాపు సామాజికవర్గం ప్రభావం ఎక్కువ. ప్రస్తుతం ఉన్న 19 నియోజకవర్గాల్లో 9 చోట్ల మాత్రం టీడీపీ శిబిరంలో గట్టిగా చర్చ జరుగుతోంది. కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీ, తుని, కొత్తపేట, పిఠాపురం, రాజమండ్రి రూరల్‌, ముమ్మిడివర్గం, రాజోలు, జగ్గంపేట సీట్ల చుట్టూ ఆ చర్చ హీటెక్కుతోంది. 2019 ఎన్నికల్లో రాజోలులో జనసేన గెలిచింది. ప్రస్తుతం చర్చ జరుగుతున్న సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గట్టిగా పోరాడి టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు అవ్వాలని చూస్తున్నారు కొందరు నాయకులు. జనసేనతో పొత్తు ఓకే అయితే ఈ నియోజకవర్గాల్లో టీడీపీ నేతల పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్న. మూడేళ్లుగా పడిన కష్టం గంగలో కలిసిపోతుందని ఆవేదన చెందుతున్నారట.

  ఇదీ చదవండి : జనసేన టీడీపీ పొత్తుపై ట్విస్ట్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెంచిన పవన్ కళ్యాణ్ కామెంట్స్

  జనసేన, టీడీపీ కలిస్తే.. కాపుల ఓట్లు పడటంతోపాటు.. టీడీపీ ఓటు బ్యాంక్‌ కూడా కలిసి వస్తుందని జనసైనికులు భావిస్తున్నారు. అయితే సీటు వదులుకోవాలేమోనని ఆందోళన చెందుతున్న టీడీపీ నేతలకు ఎక్కడా ఊరట దక్కడం లేదట. తరచూ అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. పిఠాపురంలో టీడీపీని వర్మ, కొత్తపేటలో బండారు సత్యానందం, జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ.. తునిలో యనమల తదితరులు లీడ్‌ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఆందోళనను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే పనిలో ఉన్నారట అక్కడి నాయకులు. అంతా ఒక టీమ్‌గా ఏర్పడుతున్నట్టు సమాచారం. మొత్తానికి పొత్తు కుదరకముందే ప్రకంపనలు వస్తున్నాయి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Janasena, TDP

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు